sachi tendulkar
-
ఇద్దరు దిగ్గజాలు కలిసిన వేళ..
సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా.. ఇద్దరు ఇద్దరే. సమకాలీన క్రికెట్లో పరుగులు సాధించడంలో పోటీ పడ్డారు. సచిన్ రెండు ఫార్మాట్లలో(వన్డే, టెస్టులు) ఎదురులేకుండా సాగితే.. లారా మాత్రం టెస్టుల్లో సచిన్‌కు ధీటుగా నిలిచాడు. అంతేకాదు ఎవరికి సాధ్యం కాని క్వాడ్రపుల్ సెంచరీ(400 పరుగులు)ని లారా అందుకున్నాడు. సచిన్ వంద సెంచరీలు, డబుల్ సెంచరీలు అందుకున్నప్పటికి ట్రిపుల్ సెంచరీ, క్వాడ్రపుల్ సెంచరీలు తీరని కలగానే మిగిలిపోయాయి. మరి ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకేచోట కలిస్తే చూడడానికి ఆ ఫ్రేమ్ ఎంతో అందంగా ఉంటుంది. తాజాగా హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన లీడర్షిప్ సమ్మిట్‌కు హాజరైన వీరు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇద్దరు తమ గురించి అభిమానులకు కొన్ని వాస్తవాలను తెలియపరిచారు. మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు..తమ ట్రేడ్ మార్క్, నిరాశలో కూరుకున్నప్పుడు ఎలా ఉన్నారు లాంటి విషయాలను వెల్లడించారు. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో సచిన్, లారా కలిసి బ్యాటింగ్ చేయడం గురించి కునాల్ అడిగారు. ఆ వీడియో కోసం అభిమానులు యూట్యూబ్‌లో విపరీతంగా సెర్చ్ చేశారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్‌లతో లాంటి స్టార్లు ఉన్న పాకిస్థాన్ లైనప్‌ను ఎలా కూల్చివేశారో సచిన్, లారా వివరంగా తెలియజేశారు. సిడ్నీలో సచిన్ ఐకానిక్ డబుల్ సెంచరీ చేసినప్పుడు తన ఆనందాన్ని ఎలా నియంత్రించుకున్నాడో లారా గుర్తు చేసుకున్నాడు. ప్రతి అభిమానివ వలే ఎంతో ఉద్వేగానికి లోనయ్యానని తెలిపాడు. అలాగే లారా పరుగుల దాహం, నిలకడం, నైపుణ్యం గురించి సచిన్ ప్రశంసించాడు. కరెబియన్ దిగ్గజం కిట్ బ్యాగ్ గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు. టి20 రాకతో క్రికెట్ చాలా మారిపోయిందని ఇద్దరు మాజీలు తెలియజేశారు.ఇప్పటి బ్యాటర్లు తమ వినూత్న 360 డిగ్రీల షాట్లతో బ్యాటింగ్‌లో విప్లవాత్మక మార్పులు చేశారని.. కొంతమంది వారిని ఎగతాళీ చేసినప్పటికీ.. వారి వైవిధ్యమైన ఆటతీరు గేమ్‌ను మంచిగా మార్చివేసిందని లారా స్పష్టం చేశాడు. మూడు ఫార్మాట్లలో ఆడటం చాలాకష్టమని.. కొంతమంది టెస్టుల్లో కష్టపడుతుంటే.. కొంతమంది మాత్రం టి20 ఫార్మాట్లో సవాలు ఎదుర్కొంటున్నారని తెలిపాడు. పాకిస్థాన్‌కు మెరుగైన జట్టు ఉందని లారా అభిప్రాయపడ్డాడు. మరోవైపు సచిన్ ఎంసీజీ మైదానం ఇంగ్లాండ్‌కు కలిసొస్తుందని, అందుకని బట్లర్ జట్టు గెలిచే అవకాశముందని స్పష్టం చేశాడు. మొత్తంమీద సచిన్, లారా ఇద్దరూ మరోసారి తమ అభిమానులతో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. -
మిల్కా సింగ్ మృతి కి నివాళి అర్పించిన బీసీసీఐ
ముంబై: లెజండరీ అథ్లెట్.. ద ఫ్లయింగ్ సిక్కుగా ఖ్యాతి గాంచిన మిల్కా సింగ్ మృతి పట్ల బీసీసీఐ నివాళి అర్పించింది. మిల్కా సింగ్ మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశారు. భారత్‌కు చెందిన అతిగొప్ప క్రీడాకారుడు మిల్కా సింగ్ అని, భారతీయ యువత అథ్లెటిక్స్ వైపు మళ్లేందుకు మిల్కా సింగ్ ఆదర్శంగా నిలిచారని, అతనితో దగ్గర పరిచయం ఉన్నట్లు సౌరవ్ గంగూలీ తెలిపారు. బీసీసీఐ కార్యదర్శి జే షా కూడా నివాళి అర్పించారు. మిల్కాసింగ్ మృతి విషాదాన్ని మిగిల్చిందని, తరతరాలు ఎంతో మంది క్రీడాకారులకు మిల్కా ప్రేరణగా నిలిచారని, అసాధ్యం అంటూ ఏదీ లేదని ఆయన నిరూపించారని, మిల్కా మృతి పట్ల నివాళి అర్పిస్తున్నట్లు జే షా చెప్పారు. ఏషియా క్రీడల్లో స్ప్రింట్ విభాగంలో మిల్కాసింగ్ నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించాడు. సురేష్ రైనా, అనిల్‌కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, వెంకటేశ్ ప్రసాద్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఇండియన్ క్రికెట్ టీమ్ కోచ్ రవిశాస్త్రి మిల్కాసింగ్ మృతి పట్ల నివాళి అర్పించారు. చదవండి: ఊరించి... ఉసూరుమనిపించి... -
వార్నర్-బెయిర్‌స్టోల భాగస్వామ్యం అసాధారణం
సాక్షి, హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో నెలకొల్పిన 185 పరుగుల రికార్డు భాగస్వామ్యంపై పలువురు క్రీడా దిగ్గజాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వాతావరణంలో వేడి అధికంగా ఉన్నప్పటికీ అలసిపోకుండా, వికెట్ల మధ్య చకాచకా పరుగులు తీస్తూ, అద్బుతమైన క్రికెటింగ్ షాట్లు ఆడుతూ మరిచిపోలేని భాగస్వామ్యం ఈ ఇద్దరు నెలకొల్పారని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో సెంచరీల మోత వల్ల సన్‌రైజర్స్ ఐపీఎల్లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ కెరీర్లో వార్నర్ నాలుగు సెంచరీలు చేయగా మూడు సెంచరీలు ఇదే మైదానంలో సాధించడం విశేషం. వార్నర్ ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 114 పరుగులు చేసిన బెయిర్ స్టో ఐపీఎల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 231 పరుగులు భారీ స్కోరు చేయగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్.. సన్‌రైజర్స్ బౌలర్ మహ్మద్ నబీ(11/4) ధాటికి 19.5 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 118 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. తమ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోలు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని, మహ్మద్ నబీ, సందీప్‌లు బౌలింగ్‌లో రాణించడంతో బెంగుళూర్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగామని, సీరిస్ మొత్తం ఇలాగే విజయ పరంపర కొనసాగిస్తామని సన్‌రైజర్స్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
వచ్చాడు మరో టెండూల్కర్
ముంబై: సరిగ్గా 29 ఏళ్ల క్రితం... 16 ఏళ్ల ముంబై కుర్రాడు పాకిస్తాన్లో జేగంట మోగించాడు. పిన్న వయస్సులో అరంగేట్రం చేసిన ఈ ఆటగాడు తర్వాత భారత క్రికెట్ చరిత్రనే మార్చేశాడు. అతనెవరో ఈపాటికే అర్థమైవుంటుంది... సచిన్ టెండూల్కర్ అని! 24 ఏళ్లపాటు భారత క్రికెట్‌ను నడిపించి, ఒక తరాన్ని అతను ఊపేశాడు. మళ్లీ ఇప్పుడు అతని గారాల తనయుడు అర్జున్ టెండూల్కర్ వంతు వచ్చినట్లుంది. వివిధ వయోవిభాగాల్లో నిలకడగా రాణిస్తూ వచ్చిన అర్జున్ తొలిసారి టీమిండియా ‘బ్లూ’ జెర్సీలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంకలో పర్యటించే భారత అండర్–19 జట్టులోకి అతను ఎంపికయ్యాడు. వచ్చే నెల 11 నుంచి ఆగస్టు 11 వరకు ఈ జూనియర్ జట్టు లంకలో 2 నాలుగు రోజుల మ్యాచ్‌ల్ని, ఐదు వన్డే మ్యాచ్‌ల్ని ఆడనుంది. అయితే నాలుగు రోజుల టోర్నీకే ఎంపికైన అర్జున్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. ఈ లిటిల్ టెండూల్కర్ లెఫ్టార్మ్ పేస్ బౌలర్. జాతీయ అండర్–19 టోర్నీ కూచ్‌బెహర్ ట్రోఫీలో ముంబై తరఫున 18 వికెట్లతో రాణించిన అతని ప్రదర్శన భారత జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది. ఇందులో అతను ఐదేసి వికెట్లను ఒకసారి, నాలుగేసి వికెట్లను రెండుసార్లు పడగొట్టాడు. 2017–18 సీజన్లో అర్జున్కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు చాలా మంది ఉన్నా... వారంతా స్పిన్నర్లే కావడం, అర్జున్ అసలైన పేస్ బౌలర్ కావడమే అతనికి ఎంపికకు కారణమని జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడొకరు వెల్లడించారు. తండ్రి మార్గనిర్దేశనంలో అర్జున్ గత కొంత కాలంగా ఎంతో మెరుగయ్యాడు. లార్డ్స్ మైదానంలో అతను తరచుగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. గత ఏడాది ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు అతని బౌలింగ్ వేగానికి ప్రాక్టీస్ సెషన్లో బెయిర్‌స్టో గాయపడ్డాడు. అంతకు ముందు చాంపియన్స్ ట్రోఫీ నెట్స్‌కు హాజరైన అర్జున్... ఇటీవలే సిడ్నీలోని బ్రాడ్‌మన్ మైదానంలో టి20 లీగ్స్‌లో పాల్గొని బ్యాటింగ్‌లోనూ చెలరేగాడు. భారత్–న్యూజిలాండ్ సిరీస్ సమయంలోనూ భారత జట్టు సెషన్స్‌లో పాల్గొన్నాడు. ఏదేమైనా ఎన్నో అంచనాల మధ్య, సచిన్ అభిమానుల ఆశీస్సులతో అర్జున్ బంతితో రె‘ఢీ’ అంటున్నాడు. -
సచిన్ కు పశ్చిమ బెంగాల్ ఘన సన్మానం
ఈడెన్ మైదానంలో చివరి టెస్టు ఆడిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. వెస్టిండీస్‌తో తొలి టెస్టు ముగిసిన తర్వాత మాస్టర్ బ్లాస్టర్‌కు ఘన సన్మానం జరిగింది. -
సచిన్ కుమారుడ్ని స్వేచ్ఛగా వదిలేయండి: రోహన్ గవాస్కర్
లాహ్లీ (హర్యానా): ఓ స్టార్ క్రికెటర్ వారసుడి మీద ఒత్తిడి ఎలా ఉంటుందో అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి రోహన్ గవాస్కర్. సునీల్ గవాస్కర్ కుమారుడిగా కెరీర్ ఆరంభం నుంచే అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఎదుర్కొన్న రోహన్ అంతర్జాతీయ క్రికెటర్‌గా సక్సెస్ కాలేకపోయాడు. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ కూడా ఇదే తరహా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి అతడిని స్వేచ్ఛగా వదిలేయాలని రోహన్ కోరాడు. ‘స్కూల్ స్థాయి క్రికెట్లో అర్జున్ టెండూల్కర్ ఎలా ఆడుతున్నాడనే విషయంపై చర్చించే ఆసక్తి నాకు లేదు. అతడిని అలా స్వేచ్ఛగా వదిలేయండి. ఈ విషయంపై ఇప్పటికే నేను సచిన్, అంజలిలతోనూ మాట్లాడాను. అందరూ అతడిపై దృష్టి సారించాల్సిన అవసరం లేదు. తండ్రి ప్రభావం అర్జున్‌పై పడకూడదు. అప్పుడే మంచి క్రికెటర్‌గా ఎదుగుతాడు’ అని రోహన్ అన్నాడు.