Rohan Gavaskar
-
'అతడికి టీ20ల్లో కూడా రాణించే సత్తా ఉంది.. అవకాశం ఇవ్వండి'
టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత నెలలో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. అదే విధంగా ఇంగ్లండ్ కౌంటీల్లో కూడా గిల్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. కౌంటీ చాంఫియన్ షిప్-2022లో గ్లామోర్గాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్.. తన తొలి కౌంటీ క్రికెట్ సెంచరీ కూడా నమోదు చేశాడు. ససెక్స్ క్రికెట్ క్లబ్‌పై గిల్ మెరుపు సెంచరీ సాధించాడు. దీంతో అతడు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. ఈ క్రమంలో గిల్‌పై మాజీలు, క్రికెట్ నిపుణులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ జాబితాలో భారత మాజీ ఆటగాడు రోహన్ గవాస్కర్ చేరాడు. గిల్‌ను "ఆల్ ఫార్మాట్ ప్లేయర్" రోహన్ అభివర్ణించాడు. గిల్ 'ఆల్ ఫార్మాట్ ప్లేయర్' "అమోల్ మజుందార్ నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్‌గా పనిచేస్తున్నప్పుడు.. తొలి సారి గిల్‌ను చూశాడు. అప్పుడే మజుందార్ నాతో చెప్పాడు. రోహన్ నేను ఒక అద్భుతమైన ఆటగాడిని ఎన్‌సిఎలో చూశాను అని మజుందార్ చెప్పాడు. గిల్ చాలా ప్రతిభాంతుడైన ఆటగాడు. అతడు కచ్చితంగా మూడు ఫార్మాటల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గిల్‌కు మూడు ఫార్మాటల్లో రాణించే సత్తా ఉంది. అతడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్. టెస్టుల్లో ఇప్పటికే తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్లో తన సత్తా చాటడానికి సిద్దమయ్యాడు. అతడి తగినన్ని అవకాశాలు ఇవ్వాలి. అతడు భవిష్యత్తులో భారత సూపర్ స్టార్ అయ్యే అవకాశం ఉంది" అని స్పోర్ట్స్ 18తో గవాస్కర్ పేర్కొన్నాడు. టెస్టు, వన్డేల్లో ఆకట్టుకున్న గిల్ గిల్ ఇప్పటివరకు టెస్టు, వన్డే క్రికెట్లో మాత్రమే టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 11 టెస్టులు ఆడిన గిల్ 579 పరుగులు సాధించాడు. అతడి టెస్టు కెరీర్లో నాలుగు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. అదే విధంగా ఇప్పటివరకు 9 వన్డేలు ఆడిన గిల్.. 499 పరుగులు సాధించాడు. వన్డే కెరీర్లో మూడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. కాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు గిల్ ఎంపికయ్యే అవకాశం ఉంది. చదవండి: T20 WC 2022: ఎంసీజీ నా హోం గ్రౌండ్.. భారత బ్యాటర్లు నన్ను తట్టుకోలేరు! అవునా?! -
'టీ20ల్లో విరాట్ కోహ్లిని ఓపెనర్‌గా పంపండి.. ఇక రాహుల్‌ను..'
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆసియాకప్‌తో తిరిగి తన ఫామ్‌ను పొందాడు. ఈ మెగా ఈవెంట్లో ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన కింగ్ కోహ్లి.. అద్భుతమైన సెంచరీతో తన మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. దాదాపు 1000 రోజుల తర్వాత కోహ్లి తన 71వ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 61 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 122 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దాదాపు ఓపెనర్‌గా వచ్చిన ప్రతీ మ్యాచ్‌లోనూ కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో అకట్టుకుంటున్నాడు. దీంతో త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో విరాట్‌ను ఓపెనర్‌గా పంపాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో టీ20ల్లో విరాట్ కోహ్లిని ఓపెనర్‌గా కొనసాగిస్తే కేఎల్ రాహుల్ తన స్థానాన్ని కోల్పోవలసి వస్తుందని భారత మాజీ ఆటగాడు రోహన్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "టీ20ల్లో కోహ్లిని టీమిండియా ఓపెనర్‌గా పంపాలని భావిస్తున్నాను. అతడు టీ20 క్రికెట్లో అద్భుతమైన ఆటగాడు. పొట్టి ఫార్మాట్లో విరాట్ సగటు దాదాపు 57గా ఉంది. అదే విధంగా అతడి స్ట్రైక్ రేట్ కూడా దాదాపు 160గా ఉంది. కోహ్లి తన చివరి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చి ఏకంగా సెంచరీ సాధించాడు. బహుశా కోహ్లి కూడా ఓపెనర్ ఆడాలని భావిస్తుండవచ్చు. ఇక కోహ్లి ఓపెనర్‌గా వస్తే రాహల్ తన స్థానాన్ని త్యాగం త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక కోహ్లి స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను పంపాలి. అదే విధంగా రాహుల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ వస్తే బాగుంటుంది అని గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: Urvashi Rautela: లైట్ తీసుకున్న పంత్.. చేతులు జోడించి సారీ చెప్పిన ఊర్వశి.. వీడియో వైరల్! -
డీకేకే ఆ ఛాన్స్! ‘ప్రపంచకప్’ జట్టులో అతడే ముందు! ఇక ఉమ్రాన్ సంగతి!
India Vs Ireland T20I Series: హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు ఆదివారం నుంచి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఇరు దేశాలు తమ జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. గాయం కారణంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన సూర్యకుమార్ యాదవ్ ఈ టూర్లో భాగంగా జట్టుతో చేరాడు. అదే విధంగా మరో మహారాష్ట్ర బ్యాటర్ రాహుల్ త్రిపాఠికి తొలిసారిగా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. అదే విధంగా ప్రొటిస్‌తో సిరీస్‌లో అదరగొట్టిన వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సైతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఎంపికయ్యాడు. చాన్నాళ్ల తర్వాత కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ కూడా సెలక్ట్ అయ్యాడు. సంజూ, ఇషాన్ కాదు.. డీకేకే ఛాన్స్! ఈ క్రమంలో పాండ్యా సేన తుది జట్టు కూర్పు గురించి పలువురు మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ 18తో మాట్లాడిన మాజీ ఆటగాడు రోహన్ గావస్కర్‌కు ఈ సిరీస్‌లో ఎవరిని వికెట్ కీపర్‌గా ఎంచుకుంటారన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిచ్చిన రోహన్.. సంజూ, ఇషాన్ కిషన్‌ను కాదని డీకేకు ఓటు వేశాడు. ఈ మేరకు.. ‘‘వికెట్ కీపర్లుగా ఈ ముగ్గురికి తమకంటూ ప్రత్యేక స్థానం ఉంది. అయితే, నేను మాత్రం.. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ తుది జట్టులో ఉన్నా కూడా డీకేకే వికెట్ కీపింగ్ బాధ్యతలు ఇస్తాను’’ అని స్పష్టం చేశాడు. ప్రపంచకప్ జట్టులో అతడి పేరే ముందు! ఇక సూర్యకుమార్ యాదవ్ జట్టుతో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన రోహన్ గావస్కర్.. ‘‘టీ20 ప్రపంచకప్ భారత జట్టు అనగానే నాకు మొదట గుర్తుకు వచ్చే పేరు సూర్యకుమార్ యాదవ్. ఎందుకంటే తనొక విలక్షణమైన ఆటగాడు. అత్యద్భుతమైన క్రికెటర్. ఇప్పుడు ఈ సిరీస్‌తో ఫామ్‌లోకి వస్తే.. ప్రపంచకప్‌నకు ముందు మంచి ప్రాక్టీసు లభించినట్లవుతుంది. నిజంగా తను తిరిగి రావడం జట్టుకు మేలు చేస్తుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. ఉమ్రాన్ మాలిక్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో అదిరిపోయే ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అద్భుతమైన బంతులు సంధించాడు. వికెట్లు కూడా తీశాడు. అయితే, కొంతమంది అత్యంత వేగంగా బాల్ విసిరినా వికెట్లు తీయలేరు. అలాంటి వాళ్లు జట్టులో ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. అయితే, ఉమ్రాన్ మాత్రం ఈ రెండు లక్షణాలు కలగలిసిన ప్యాకేజ్. అతడి అరంగేట్రం కోసం అభిమానులతో పాటు నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని రోహన్ గావస్కర్ చెప్పుకొచ్చాడు. చదవండి: India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్‌తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు! -
నీదే పిల్లాడి మనస్తత్వం అందుకే, ఇలా..
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. పింక్‌బాల్ టెస్టులో అవమానకర రీతిలో కోహ్లి సేన ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులే చేసిన భారత్ తన టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. దీంతో టీమిండియా ప్రదర్శనపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతి విశ్వాసమే ఈ పరిస్థితిని కల్పించింది అని కొందరు అంటుంటే, మరికొందరేమో పింక్ బాల్ కొంపముంచిందని భారత ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈక్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ తనయుడు, మాజీ ఆటగాడు రోహన్ గావస్కర్ కోహ్లి సేనపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తొలి ఇన్నింగ్స్ టెస్టు మ్యాచ్‌గా, రెండో ఇన్నింగ్స్ టీ20 గా అనిపించిందని ట్విటర్లో కామెంట్ చేశాడు. పింక్ బాల్ టెస్టుతో మరో కొత్త ఫార్మాట్ పుట్టుకొచ్చిందని పేర్కొన్నాడు. అయితే, రోహన్ కామెంట్లపై ఓ అభిమాని విరుచుకుపడ్డాడు. ‘హే బడ్డీ.. ఇంతకూ క్రికెట్‌కు సంబంధించి ఏం సాధించావ్. టీమిండియా ఆటగాళ్లపై ఊరికే ఎందుకు కామెంట్ చేస్తావ్. ముందు నీ జీవితంలో ఏదైనా సాధించు. నీకింకా చిన్నా పిల్లాడి మనస్తత్వమే ఉంది’అని ఎద్దేవా చేశాడు. ఇక అభిమాని కౌంటర్‌పై రోహన్ తనదైన శైలిలో స్పందించాడు. ‘నన్ను బడ్డీ అని కామెంట్ చేస్తున్న నీదే పిల్లల మనస్తత్వం. భారత్ తరపున వన్డేలకు ప్రాతినిథ్యం వహించాను. కనుకనే టీమిండియాపై కామెంట్లు చేస్తున్నాను. నువ్ ఫాంటసీ క్రికెట్ ఆడుకో. ఒకరిపై ఆధారపడకుండా బతకడం నేర్చుకో’ అని చురకలు వేశాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్లోకి 2004లో అరంగేట్రం చేసిన రోహన్ 11 వన్డేలు ఆడి 18.87 సగటుతో 151 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 117 మ్యాచ్‌లు ఆడి 44 సగటుతో 6900 పరుగులు చేశాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. A) I’m not your buddy B) yes I have . C) stick to making your fantasy teams . D) move out of your parents house . https://t.co/LM6Q8oeKVT — Rohan Gavaskar (@rohangava9) December 19, 2020 -
సచిన్ కుమారుడ్ని స్వేచ్ఛగా వదిలేయండి: రోహన్ గవాస్కర్
లాహ్లీ (హర్యానా): ఓ స్టార్ క్రికెటర్ వారసుడి మీద ఒత్తిడి ఎలా ఉంటుందో అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి రోహన్ గవాస్కర్. సునీల్ గవాస్కర్ కుమారుడిగా కెరీర్ ఆరంభం నుంచే అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఎదుర్కొన్న రోహన్ అంతర్జాతీయ క్రికెటర్‌గా సక్సెస్ కాలేకపోయాడు. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ కూడా ఇదే తరహా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి అతడిని స్వేచ్ఛగా వదిలేయాలని రోహన్ కోరాడు. ‘స్కూల్ స్థాయి క్రికెట్లో అర్జున్ టెండూల్కర్ ఎలా ఆడుతున్నాడనే విషయంపై చర్చించే ఆసక్తి నాకు లేదు. అతడిని అలా స్వేచ్ఛగా వదిలేయండి. ఈ విషయంపై ఇప్పటికే నేను సచిన్, అంజలిలతోనూ మాట్లాడాను. అందరూ అతడిపై దృష్టి సారించాల్సిన అవసరం లేదు. తండ్రి ప్రభావం అర్జున్‌పై పడకూడదు. అప్పుడే మంచి క్రికెటర్‌గా ఎదుగుతాడు’ అని రోహన్ అన్నాడు.