
కొలంబో: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ అండర్-19 అరంగేట్రం మ్యాచ్‌లో నిరాశపరిచాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భాగంగా అర్జున్ తొలి ఇన్నింగ్స్‌లో పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. 11 బంతులు ఆడిన అర్జున్ డకౌట్‌గా ఔటయ్యాడు.
అంతకుముందు కమిల్ మిషారాను ఔట్ చేయడం ద్వారా తన తొలి అంతర్జాతీయ వికెట్‌ను ఖాతాలో వేసుకున్న అర్జున్.. బ్యాటింగ్‌లో మాత్రం కనీసం పరుగు చేయకుండానే నిష్క్రమించాడు. సచిన్ టెండూల్కర్ తన వన్డే అరంగేట్రంలో మ్యాచ్‌లో సైతం డకౌట్‌గా పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. 1989లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ పరుగులేమీ చేయకుండా ఔట్ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment