మా వాడిని ఒంటరిగా వదిలేయండి
ముంబై: భారత క్రికెట్‌కు దేవుడిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను అభిమానులు భావిస్తుం టారు. మరి అలాంటి ఆటగాడి కుమారుడు కూడా బ్యాట్ చేతపటి ్ట మైదానంలో దిగితే... అందరి చూపుతో పాటు మీడియా దృష్టి కూడా అతడి మీదే ఉంటుంది. అయితే ఇదంతా ఆ టీనేజి కుర్రాడి ఏకాగ్రతను దెబ్బతీసినట్టవుతుందని మాస్టర్ భావిస్తున్నాడు. తన కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను ఒంటరిగా వదిలేయాలని, ఎక్కువ ఫోకస్‌తో అనవసరంగా అతడిపై ఒత్తిడి పెంచరాదని మీడియాకు సూచించాడు.
‘ఆదివారం మా అబ్బాయి ఓ మ్యాచ్ ఆడాడు. ఇది అతడికి తొలి అధికారిక క్లబ్ మ్యాచ్. ఇంతవరకు బాగానే ఉన్నా అర్జున్ ఎలా ఆడుతున్నాడు అనే అంశంతో పాటు అతడు ఎవరితో మాట్లాడుతున్నాడు లేక ఏం చదువుతున్నాడనే విషయాలు కూడా పట్టించుకుంటున్నారు. ఇలా కాకుండా అతడిని తనకు తానుగా వదిలేసి, సొంత గుర్తింపు తెచ్చుకునే వరకు వదిలేస్తే నేను ఎక్కువ సంతోషిస్తా. నేను అతడికి రక్షణగా ఉండాల్సిన తండ్రిని. నేను క్రికెట్ నేర్చుకుంటున్న దశలో ఎవరి నుంచీ ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కోలేదు. అర్జున్ ఇప్పుడిప్పుడే కెరీర్‌ను ప్రారంభిస్తున్నాడు. కాబట్టి 14 ఏళ్ల మామూలు కుర్రాడిలా క్రికెట్‌ను తప్ప మరేమీ ఆలోచించని వాడిలా తనను వదిలేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ముంబై స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ సూచించాడు.