
కర్నూలు: టీ స్టాల్‌లో టీ ఆర్డర్ ఆలస్యమైందని మొదలైన వాగ్వాదం చివరకు పోలీసు స్టేషన్‌కు చేరింది. ఈ ఘటన డోన్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. పట్టణ ఎస్‌ఐలు శరత్ కుమార్‌రెడ్డి, నగేష్ తెలిపిన వివరాల మేరకు.. తారకరామనగర్‌కు చెందిన ఈశ్వర్‌గౌడ్, రమేష్ గౌడ్ సొంత అన్నదమ్ములు. వీరు స్థానిక స్టేట్ బ్యాంక్ సమీపంలో టీ స్టాల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు.
శనివారం అదే కాలనీకి చెందిన ఎరుకలి తిరుపతి అనే వ్యక్తి వచ్చి స్పెషల్ టీ కోసం ఆర్డరు ఇచ్చాడు. టీ ఇవ్వడం ఆలస్యం కావడంతో మాట మాట పెరగడంతో పరస్పరం దాడికి పాల్ప డ్డారు. తిరుపతికి గాయాలు కాగా చికిత్స నిమి త్తం డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
తనను కులం పేరుతో దూషించారని బాధితుడి ఫిర్యాదు మేరకు టీస్టాల్ నిర్వాహకులపై ఎస్సీ, ఎస్టీ కేసును, తమపై దాడి చేశాడని టీకొట్టు యజమానుల ఫిర్యాదు మేరకు తిరుపతిపై కౌంటర్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment