ఉదయం నిద్రలేచింది మొదలు గొంతులో రాత్రి పడుకునేదాకా కాసిన్ని ‘టీ’ నీళ్లు పడితే తప్ప ఏ పనీ జరగదు చాలామందికి. బ్లాక్‌టీ, హెర్బల్ టీ, మసాలా టీ, లెమన్ టీ, హనీ టీ..ఇలా ఏదో ఒక‘టీ’ పడాల్సిందే. తాజాగా టీకు సంబంధించిన ఒక మంచి వార్త ముఖ్యమైన ఆరోగ్య నియంత్రణ ఏజెన్సీ అందించింది . అదేంటంటే..టీ ఆరోగ్యకరమైనదే అని యూఎస్ ఎఫ్‌డీఏ టీకి సర్టిఫికెట్ ఇచ్చింది. టీ హెల్దీ డ్రింకా కాదా అనే అంశంపై తన తుది నిర్ణయాన్ని డిసెంబరు 19న ప్రకటించింది.ఈ నిర్ణయం టీ ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి ప్రపంచ టీ పరిశ్రమ వాదనలను ధృవీకరిస్తుందంటూ ఆనందం వెల్లువెత్తింది.
అయితే ఇది కామెల్లియా సినెన్సిస్ (తేయాకు) నుండి తీసుకోబడిన టీకి మాత్రమే వర్తిస్తుందని ఎఫ్‌డీఐ స్పష్టం చేసింది. ఐదు కేలరీల కంటే తక్కువ ఉన్న నీరు, టీ , కాఫీ వంటి పానీయాలు మాత్రం "ఆరోగ్యకరమైన" హోదాకు అర్హత పొందుతాయని ఎఫ్‌డీఏ పేర్కొంది. అయితే, చామోమిలే, పిప్పరమెంటు, అల్లం, లావెండర్, మందార, శంఖంపువ్వు (అపరాజిsత) లేదా మసాలా టీతో సహా ఇతర హెర్బల్ టీలకు "ఆరోగ్యకరమైన" ఈ గుర్తింపు వర్తించదని ఏజెన్సీ స్పష్టం చేసింది. కామెల్లియా సైనెన్సిస్‌ను కొన్ని క్యాన్సర్ సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలకు ముందస్తు పరిశోధనలను కూడా ఎఫ్‌డీఏ అంగీకరించింది.
నార్త్ ఈస్టర్న్ టీ అసోసియేషన్ (NETA), ఇండియన్ టీ అసోసియేషన్ (ITA) U.S. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కూడా కామెల్లియా సినెన్సిస్ టీని ఆరోగ్యకరమైన పానీయంగా గుర్తించడాన్ని స్వాగతించాయి. దేశంలోని అతిపురాతన టీ ఉత్పత్తిదారుల సంస్థ ఇండియన్ టీ అసోసియేషన్ (ITA), ఇది ల్యాండ్‌మార్క్ నిర్ణయంగా అభివర్ణించింది. అటు ప్రపంచ తేయాకు పరిశ్రమకు ఇది "అద్భుతమైన వార్త" అంటూ అమెరికా టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటర్ ఎఫ్. గోగీ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే టీ బోర్డ్ ఆఫ్ ఇండియా మాజీ వైస్ చైర్మన్ బిద్యానంద బోర్కకోటి కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్‌డీఏ గుర్తింపు, టీ ఆరోగ్య ప్రయోజనాల నేపథ్యంలో టీని ఒక వెల్నెస్ ,జీవనశైలి పానీయంగా ప్రచారం చేయాలని తాము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: మోతీ షాహీ మహల్ : ఐరన్ మ్యాన్ మెమోరియల్
Comments
Please login to add a commentAdd a comment