ఇటీవల మన తెలుగు వాడుక భాషలో ఆంగ్ల పదాలు అలవొకగా చేరిపోయాయి. మనం కూడా వాటికే అలవాటు పడిపోయాం. తెలుగు, ఆంగ్లం మిక్స్ కొట్టినట్లుగా మాట్లాడుతున్నాం. ఆ క్రమంలో కొన్ని అర్థరహితమైన పదబంధాలను వినియోగిస్తున్నాం. వాటినే గుర్తు చేసి అవి ఎంత అర్థ రహితమో వివరిస్తున్నారు భారత సంతతి అమెరికన్, రచయిత్రి టీవీ నటి పద్మాలక్ష్మి. తప్పుగా ఉపయోగిస్తున్న గమ్మత్తైన పదబంధాలేంటో చూద్దామా..!
చాలామంది 'చాయ్ టీ'కి పోదామా అంటుంటారని పద్మాలక్ష్మి చెబుతున్నారు. అస్సలు ఇది ఎంత చెత్త పదబంధమో ఒక్కసారి చూడండంటూ వాటి అర్థం గురించి వివరించారు. నిజానికి చాయ్ అంటే టీ మళ్లీ దానికి టీ అనే పదాన్ని కూడా జోడిస్తున్నాం. అంటే టీ టీ అని అర్థం వస్తుంది. అందుకే చాయ్ టీ వద్దు. ఆ పదం లేదు. అని సవివరంగా చెప్పారు. అలాగే ఘుమఘమలాడే 'అల్లం టీ' కావాలంటే మసాలా టీ అనండి చాలు అంటున్నారు.
అలాగే చాలామంది 'గీ బట్టర్' అని అంటారు ఇది కూడా తప్పే ఎందుకంటే.. వెన్న, నెయ్యి వేరువేరు అది గుర్తించుకోండి అని చెబుతున్నారు పద్మాలక్ష్మి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తాము కూడా విన్న అలాంటి పదబంధాల గురించి చెప్పుకొచ్చారు. ఓ నెటిజన్ చాలామంది ఏటీఎం మిషన్ అని పిలుస్తుంటారు. ఇది కూడా చాలా తప్పు పదబంధం.
ఏటీఎం అంటేనే(ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్). అలాంటప్పుడు మళ్లా మిషన్ ఎందుకు వ్యాఖ్యానించడం అని కామెంట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. మరో నెటిజన్ ఇలాంటి తప్పు పదబంధాలు భారత్‌లోని స్టార్‌బక్స్ మెనూలో కూడా ఉందని చెప్పుకొచ్చాడు. అక్కడ ఆహార మెనులో ఇలానే 'చాయ్ టీ' ఉండటం విచారకరం అంటూ పోస్ట్ పెట్టాడు.
(చదవండి: బ్లింకిట్ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!)
Comments
Please login to add a commentAdd a comment