సాక్షి, హైదరాబాద్: పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా వ్యవహార శైలిపై ఆ శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆయన వ్యవహారశైలి మార్చుకునేలా జోక్యం చేసుకోవాలని మంత్రి దయాకర్‌రావును తెలంగాణ సీఈవోలు, డిప్యూటీ సీఈవోల సంక్షేమ సంఘం విన్నవించింది. ఈ మేరకు ఓ వినతిపత్రం మంత్రికి సమర్పించింది.
సానుకూల వాతావరణం చెడిపోతోంది
తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి తీసుకున్న చర్యలతో దీర్ఘకాలంగా ఉన్న సర్వీసు, పరిపాలనా పరమైన సమస్యలు పరిష్కారమై అన్ని స్ధాయిల్లో ప్రమోషన్లు, పోస్టింగ్‌లతో అధికారులు, ఉద్యోగుల్లో సానుకూల వాతావరణం ఏర్పడిందని ఆ సంఘం సభ్యులు వెల్లడించారు. అయితే కొంతకాలంగా సుల్తానియా వ్యవహారశైలి, అధికారులు, ఉద్యోగుల పట్ల ప్రదర్శిస్తున్న అనుచిత వైఖరితో ఈ సానుకూల వాతా వరణమంతా దెబ్బతిందని మంత్రి దృష్ఖికి తీసుకొచ్చారు.
టెలీ, వీడియో కాన్ఫ రెన్స్‌లలో అధికారులు, ఉద్యోగుల పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయి అధికారుల స్పందన, వారి వైపు నుంచి అభిప్రా యాలు తీసు కోకుండానే పరుషంగా వ్యవహరిస్తుండడంతో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.
చిన్న చిన్న కారణాలతో డీఆర్‌డీవోలు, డీపీవోలను సైతం సస్పెన్షన్ లేదా ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి పరిణామాలు అధికారులను తీవ్ర ఒత్తిళ్లకు, అయోమయానికి గురి చేస్తున్నాయని తెలియజేశారు. పీఆర్ శాఖ అధికారులు, ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, తక్షణమే మంత్రి ఎర్రబెల్లి జోక్యం చేసుకుని పనిచేసే వాతావరణం కల్పించాలని కోరారు.
పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా వ్యవహారశైలిపై అధికారులు, ఉద్యోగుల ఆగ్రహం
telangana ceo ఎర్రబెల్లికి తెలంగాణ సీఈవోలు, డిప్యూటీ సీఈవోల సంక్షేమ సంఘం వినతిపత్రం
Comments
Please login to add a commentAdd a comment