
రాయ్ పూర్ : 'టీ' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒత్తిడితో చిత్తయ్యే చిరుద్యోగి నుంచి కార్పొరేట్ కంపెనీ సీఈఓ వరకు రోజుకు ఒక్కసారైనా సేవించాల్సిందే. ఇక వాన పడినా.. మంచు కురిసినా, ఎండ కాసినా టీ రుచులను ఆస్వాదించాల్సిందే. లేదంటే ప్రాణం ఉసూరుమంటుంది. ముఖ్యంగా ఆహ్లాదకరమైన వాతావరణం. వేడివేడిగా తేనీటి చుక్కలు గొంతులోకి దిగుతుంటే భలే ఉంటుంది కదూ. ముఖ్యంగా ఈ ఛాయ్ ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యుద్ధం వచ్చినా సరే టీ తాగడం మాత్రం ఆపరు
ఇక అసలు విషయానికొస్తే.. కరోనా కట్టడిలో భాగంగా..పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ప్రస్తుతం ఛత్తీస్ గడ్ లో లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే ఓ ప్రాంతంలో లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుటుంటున్నారు. ఇదే సమయంలో ఓ ఛాయ్ దుకాణంలో నక్కి నక్కి ఛాయ్ తాగుతున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ జీప్ ఎక్కించేందుకు ప్రయత్నించారు.
ఆ సమయంలో ఆ ఇద్దరు వ్యక్తులు పోలీసులు అదుపులో తీసుకున్నారనే భయం కంటే టీగ్లాస్ లో టీ ఎక్కడ పోతాయోనని ఆందోళన స్పష్టం కనిపిస్తున్న వీడియోల్ని ఐపీఎస్ అధికారిణి అంకిత శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు నెటిజన్లను నవ్వులు పూయిస్తున్నాయి. మీ ఛాయ్ సల్లంగుండా.. యుద్ధం వచ్చినా మీరు టీ తాగడం ఆపరా అని కామెంట్ చేస్తుంటే.. మరో నెటిజన్ 'నీ దగ్గర ఛాయ్ బావుంటుందంటా... నాకు ఇవ్వూ అని మరో నెటిజన్ సరదగా కామెంట్ చేస్తున్నాడు.
ये हम है, ये हमारी चाय है, बाक़ी बाद में देखेंगे 😎 pic.twitter.com/B0K1X9y5P4
— Ankita Sharma IPS (@ankidurg) May 27, 2021
Comments
Please login to add a commentAdd a comment