
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన వారు.. నర్సీంపట్నం ఏఎస్పీగా రిషాంత్ రెడ్డి, రంపచోడవరం ఓఎస్డీగా ఆరిఫ్ హఫీజ్, రంపచోడవరం ఏఎస్పీగా వకుల్ జిందాలు ఉన్నారు. వీరితో పాటు గ్రేహోండ్స్ స్వ్కాడ్రన్ కమాండర్‌గా రాహుల్ దేవ్ సింగ్, విశాఖపట్నం అదనపు ఏఎస్పీ అడ్మిన్‌గా అజితా వేజెండ్ల, బొబ్బిలి ఏఎస్పీ గ్రేడ్‌వన్‌గా గౌతమి శాలిని, పార్వతీపురం ఏఎస్పీ గ్రేడ్ వన్‌గా సుమిత్ సునీల్ బదిలీ అయ్యారు.