
బాలికలను విచారణకోసం తీసుకెళ్తున్నపోలీసులు (ఫైల్)
యాదగిరిగుట్ట(ఆలేరు) : ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా ఇటీవల పోలీసుల దాడుల్లో వ్య భిచార ముఠా చెర నుంచి విముక్తి పొందిన చిన్నారులు తమ పిల్లల్లాగే ఉన్నారని వరంగల్ జిల్లా కేంద్రంలోని చిత్రాసికుంటకు చెందిన అయిలమ్మ యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తమ కూతురు ప్రవళిక(23)తో పాటు మనమరాళ్లు వైష్ణవి (3), విశాల(2)లు ఏడాది క్రితం ఇంటి నుంచి కనిపించకుండా పోయారని అయిలమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.
అప్పటి నుంచి వివిధ ప్రాం తాల్లో వెతికామని, అయినా ఫలితం కనిపించలేదని కన్నీటిపర్యంతమైంది. ఇటీవల యాదగిరిగుట్టలో 15 మంది చిన్నారులు దొరి కారని పేపరు, టీవీల్లో చూశామని, అందులో ఓ అమ్మాయి తమ మనవరాలు వైష్ణవి లాగానే కనిపించిందని తెలిపింది. పిల్లలను చూసేందుకు యాదగిరిగుట్టకు వచ్చినట్లు ఆమె వెల్లడించింది.

కూతురు, మనుమరాళ్ల ఫొటోలను చూపెడుతున్న అయిలమ్మ
Comments
Please login to add a commentAdd a comment