యాదగిరిగుట్ట లోని అనురాధ నర్సింగ్ హోం
యాదగిరిగుట్ట(ఆలేరు) : అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొంతమంది ఆర్‌ఎంపీ వైద్యులు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎలా ంటి అనుభవం లేకున్నా .. తమకు తెలిసిన వై ద్యంతో ప్రజ లకు వైద్యం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. పట్టణంలోని గణేష్‌నగర్‌లో ఇటీవల కొంతమంది ఆర్‌ఎంపీలు డబ్బులకు ఆశపడి వ్యభిచార నిర్వాహకులతో చేతులు క లిపి చిన్నారులకు హర్మోన్‌గ్రోత్ ఇం జక్షన్లు ఇచ్చి అక్రమంగా సంపాదిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు వ్యభిచారగృహాల్లో జ్వరా లు, అస్వస్థతకు గురైన మహిళలకు ఇంటింటికి వెళ్లి వైద్యం చేసే ఆర్‌ఎంపీలు నేడు పట్టణంలో ఆస్పత్రులను సైతం ఏర్పాటు చేసుకున్నారంటే ఈ దందా ఎంతగా సాగుతుందో ఇట్టే అర్థమవుతోంది.
అసలు ఏం జరుగుతోంది..
యాదగిరిగుట్ట పట్టణంలో జూలై 30వ తేదీన ఓ చిన్నారిని చిత్రహింసలు పెడుతున్నట్లు తెలియడంతో ఎస్వోటీ, షీటీం, ఐసీడీఎస్, స్థానిక పోలీసులు ఆ ఇంటిపై దాడులు చేశారు. దీంతో చిన్నారులను అక్రమంగా అమ్మకాలు చేస్తున్న వ్యభిచారగృహ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నా రు. వారిని పోలీసులు లోతుగా విచారించడంతో చిన్నారుల శరీర ఎదుగుదలకు స్థానికంగా కొంత మంది వైద్యుల వద్ద హర్మోన్‌గ్రోత్‌కు సంబంధించిన ఈస్ట్రోజన్, ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇస్తునట్లు తెలిపారు.
దీంతో దర్యాఫ్తు ముమ్మరం చేసిన పోలీ సులు గురువారం పట్టణంలోని అనురాధ నర్సిం గ్‌హోం పై రాచకొండ సీపీ మహేష్‌భగవత్ ఆదేశాలతో ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఈ దాడుల్లో సుమారు 48 హర్మోన్ గ్రోత్‌కు సంబంధించిన ఆక్సిటోసిన్ ఇంజకన్ల శాంపిల్స్ దొరికాయి.
అంతే కాకుండా ఆర్‌ఎంపీ వైద్యుడిగా కొనసాగుతున్న అనురాధ నర్సింగ్ హోం వైద్యుడు నర్సింహ ఎలాంటి అనుమతులు లేకుండా సిజేరియన్, అబార్షన్, పిల్లలు కాకుండా ఆపరేషన్, హెన్రీయా ఆపరేషన్లు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. దీంతో డీసీపీ రాంచంద్రారెడ్డి ఆస్పత్రి నిర్వాహకుడు నర్సింహను విచారించి రిమాండ్‌కు పంపారు.
ఇంకా ముగ్గురు ఎక్కడ..?
చిన్నారులకు హర్మోన్‌గ్రోత్ ఇంజక్షన్లు ఇస్తుంది నలుగురు డాక్టర్లని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. కానీ ఇప్పటికే అనురాధ నర్సింగ్ హోం వైద్యుడు నర్సింహ పట్టుబడ్డాడు. ఇంకా ముగ్గురు వైద్యులు ఎవరు.. వారి ఆస్పత్రులు ఎక్కడ ఉన్నాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో ఒకరు భువనగిరి నుంచి గణేష్‌నగర్‌కు వచ్చి చిన్నారులకు ఇంజక్షన్లు ఇస్తున్నట్లు తెలిసిం ది.
యాదగిరిగుట్ట పట్టణంలోని మరో ఇద్దరు ఆర్‌ఎంపీ డాక్టర్లు ఈ దారుణాలకు సహకరిస్తు ఇంజక్షన్లు ఇస్తున్నారని సమాచారం. దీంతో ఆ ముగ్గురు వైద్యులు ఎవరు అనే చర్చ యాదగిరిగుట్ట పట్టణంలో జోరుగా సాగుతోంది. మరో రెండ్రోజుల్లో ఆ ముగ్గురు వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వ్యభిచారగృహాలకు సమీపంలోఆస్పత్రులు..
గణేష్‌నగర్‌లో ఉండే వ్యభిచార నిర్వాహకులకు అ త్యంత సమీపంలో అనురాధ నర్సింగ్ హోంతో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. దీంతో ఎక్కువగా ఈ ఆస్పత్రులకే వ్యభిచారగృహ నిర్వాహకులు వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దగ్గర్లో ఉన్న ఆర్‌ఎంపీలతో పరిచయం పెంచుకుని ఇలా ంటి నీచ సంస్కృతికి తెర తీసినట్లు స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతోంది.
అంతే కాకుండా మంగళగిరి, జగిత్యాల, ఉభయగోదావరి, వరంగల్ ప్రాంతా ల్లో ఉండే వ్యభిచార నిర్వాహకుల బంధువుల ద్వా రా ఈ ఇంజక్షన్లు తెలుసుకుని ఇక్కడి చిన్నారులకు ఇస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment