ఆలయ ప్రాశస్త్యం కొనసాగించాలి.. భక్తుల మనోభావాలను గౌరవించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
ఆలయ ప్రాశస్త్యం కొనసాగించాలి.. భక్తుల మనోభావాలను గౌరవించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు బోర్డు ఏర్పాటు
యాదాద్రి కాదు.. యాదగిరిగుట్టగానే వ్యవహరించాలి
తన పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రేవంత్
సాక్షి, యాదాద్రి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాదిరిగానే యాదగిరిగుట్ట దేవాలయా నికి బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆగమశాస్త్రా న్ని అనుసరిస్తూనే, భక్తుల మనోభావాలు దెబ్బతి నకుండా ప్రతిపాదనలతో సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా యాదగిరి గుట్టపై ఒకరోజు నిద్ర చేయాలనే భక్తులకు ఆచారా నికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేశారు.
అనంతరం యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధిపై యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటీడీఏ) అధికారులు, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్‌అండ్‌బీ, దేవాదాయ, ఇంజనీరింగ్ శాఖల సీనియర్ అధికారులు, భువనగిరి జిల్లా కలెక్టర్‌తో ప్రెసిడెన్షియల్ సూట్‌లో సమీక్షించారు. ఆలయానికి సంబంధించి చేపట్టిన పనులు, ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులు, చెల్లింపులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
ఆలయ పనుల్లో లోపాలుంటే సరిదిద్దండి..
యాదగిరిగుట్టకు తిరుపతి తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. యాదగిరి గుట్టకు సంబంధించిన టెంపుల్ కమిటీ, ఇతర కమిటీలను పునర్నిర్మించాలన్నారు. ఈ నెల 15లో గా ఆలయానికి సంబంధించిన మరికొన్ని అంశాలతో సమీక్షకు రావాలని అధికారులకు సూచించారు. ఆలయ మాడ వీధులు తరచూ పగుళ్లు రావ డం, కుంగడానికి కారణమేమిటని ఆరా తీశారు. కోతులు ఆయా చోట్ల బండలను తొలగిస్తున్నాయని అధికారులు వివరించారు. దీనితో ఆర్‌అండ్‌బీ, దేవాదాయ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్‌లు వెంటనే ఆల యాన్ని తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.
తాను మరోసారి ఆలయాన్ని తనిఖీ చేస్తానని, ఎక్కడైనా లోపాలు ఉంటే సరిచేయాలని సూచించారు. ఆలయ భూసేకరణకు సంబంధించి అన్ని కేసులను క్లియర్ చేయాలని.. రైతుల నుంచి వైటీడీఏ సేకరించిన భూములను ఎవరికీ తిరిగిచ్చే ది లేదని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న 101 ఎక రాలకు సంబంధించిన సుమారు రూ.70 కోట్ల పరి హారాన్ని చెల్లించేయాలని ఆర్థిక శాఖ కార్యద ర్శిని ఆదేశించారు. గోసంరక్షణకు పాలసీని ప్రత్యేకంగా రూపొందించాలని.. బెస్ట్ మోడల్ గోశాలగా అభి వృద్ధి చేయాలని అధికారులకు సీఎం సూచించారు.
పలు అంశాలపై ప్రజెంటేషన్లు..
ఆలయ దివ్యవిమాన గోపురం బంగారు తాపడం పనుల్లో భాగంగా.. చెన్నై స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ తయారు చేసిన బంగారు తాపడం శాంపిల్ రేకు లను సీఎం రేవంత్ పరిశీలించి బాగున్నాయన్నారు. ఇక వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధికి చేపట్టిన పనులు, పెండింగ్‌లో ఉన్నవి, వ్యయం, భవిష్యత్ ప్రణాళికలు, తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
విమాన గోపురానికి బంగారు తాపడం, వేద పాఠశాల నిర్మాణం వంటి అంశాలపై దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇక జిల్లా మెడికల్ కళాశాలకు మరికొంత స్థలం కావాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఆ మెడికల్ కాలేజీని దేవాలయ పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించాలని, దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
యాదాద్రికి బదులు యాదగిరిగుట్టనే..
ఆలయానికి సంబంధించిన అన్ని అంశాల్లో యాదాద్రి స్థానంలో యాదగిరిగుట్ట అని కనిపించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇక నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆలయానికి సంబంధించిన టికెట్లు, మిగతా అన్నింటిపై యాదగిరి గుట్ట అనే పదాన్ని వాడాలన్నారు. కాటేజీల నిర్మాణానికి దాతల సహకారం తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment