60 కేజీల బంగారం అవసరమని ప్రతిపాదనలు
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం బంగారు తాపడం పనులకు మోక్షం కలగనుంది. సుమారు 60 కేజీల బంగారంతో తాపడం పనులను చేపట్టనున్నారు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలని సంకల్పించారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ, ఉన్నతస్థాయి అధికారులు జరిపిన సమీక్షా సమావేశాల్లో యాదాద్రి ఆలయ రాజగోపురానికి బంగారు తాపడంపై చర్చించిన విషయం తెలిసిందే.
బంగారు తాపడం పనులను దాతలు ఇచ్చిన విరాళాలు, దేవస్థానం నిధులతో చేయనున్నారు. ఇప్పటికే దాతలు ఇచ్చిన నగదు సుమారు రూ.25 కోట్లు నగదు, 11 కిలోల బంగారం దేవస్థానం వద్ద ఉంది. దేవస్థానం హుండీలో భక్తులు సమర్పించిన బంగారం, వెండిని మింట్‌కు పంపించి ప్యూర్ గోల్డ్ (24 క్యారెట్లు)గా మార్చనున్నారు.
అయితే భక్తులు సమర్పించిన మిశ్రమ బంగారాన్ని ప్యూర్ గోల్డ్‌గా మార్చడం, వెండి ఆభరణాలను కరిగించి అందుకు సమానమైన సుమారు 25 కిలోల బంగారాన్ని మింట్ ద్వారా తీసుకోనున్నారు. రాజగోపురానికి 10,500 చదరపు అడుగుల మేరకు బంగారు తాపడం పనులకు అంచనా వేశారు. పనులు చేయడానికి రూ.6 కోట్లు మేకింగ్ చార్జీలు అవసరం అవుతాయని అంచనా వేశారు. గ్లోబల్ టెండర్ల ద్వారా బంగారు తాపడం తయారు పనులను అప్పగించనున్నారు.
సీఎం ఆమోదం పొందగానే పనులు: ఆలయ ఈవో భాస్కర్‌రావు
బంగారు తాపడం పనుల ఆమోదం ఫైలు సీఎంవోలో ఉంది. దేవాదాయ శాఖ నుంచి సీఎంకు ఫైల్ పంపించారు. సీఎం ఆమోదం లభించగానే పనులు ప్రారంభిస్తాం. స్వర్ణ తాపడం పనుల కోసం అవసరమైన ఖర్చును దేవస్థానం భరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment