మానవహారం నిర్వహిస్తున్న డీఎస్సీ అభ్యర్థులు, మోకాళ్లపై యాదాద్రి మెట్లు ఎక్కుతూ..
యాదగిరిగుట్ట: 2008లో డీఎస్సీకి హాజరై ఉద్యోగాల కోసం 13 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నామని డీఎస్సీ 2008 బీఈడీ మెరిట్ క్యాండిడేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన అభ్యర్ధులకు ఉద్యోగా లు ఇచ్చి న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో వరంగల్‌లో జరిగిన సభలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెలువరించినా ప్రభుత్వం సాను కూలంగా నిర్ణయం ప్రకటించకపోవడం బాధాకరమన్నారు.
ప్ర భుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ 2008 డీఎస్సీ అభ్య ర్థులు యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం ప్రదర్శన, మానవ హారం నిర్వహించారు. అనంతరం మోకా ళ్ళపై యాదాద్రీశుడి ఆలయ మెట్లు ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉమా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పు ను అనుసరించి డీఎస్సీ–2008లో నష్టపోయిన అభ్యర్థులకు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చేలా ప్రతి పాదనలు సిద్ధం చేసిందన్నా రు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
మానవహారం నిర్వహిస్తున్న డీఎస్సీ అభ్యర్థులు
Comments
Please login to add a commentAdd a comment