
డ్రగ్ మహమ్మారి అంతటా విస్తరిస్తోంది. ఓ పక్క గంజాయి.. మరో పక్క సింథటిక్ డ్రగ్స్.. ఇవి చాలవన్నట్లు దుర్వినియోగం అవుతున్న ఔషధాలు పేద, ధనిక తేడా లేకుండా యువతను బలి కోరుతున్నాయి. ముప్పేట ముంచుకొస్తున్న ముప్పు నుండి రేపటి తరాన్ని కాపాడుకుందాం. ‘నిషా ముక్త్ తెలంగాణ’ సాకారం దిశగా అడుగేద్దాం. వీటి కట్టడికి ఇప్పటికే పోలీస్, ప్రత్యేక విభాగాలు తమవంతు పనిని వేగిరం చేశాయి. ఇప్పటికే మన నగరం, పట్టణం, మన ఊరికి వచ్చిన డ్రగ్స్.. మన ఇంటికి, స్కూలు, కాలేజీకి రాకుండా అప్రమత్తమవుదాం.
ఆ దిశగా ‘సాక్షి’ మీకు.. నార్కోటిక్స్ బ్యూరోకు మధ్య వారధిగా నిలుస్తుంది. మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా, మాదకద్రవ్యాలపై సమాచారం తెలిసినా, కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు.. వీరిలో ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలుగా మారారనో, ఇతర సందేహాలు ఉన్నా.. వెంటనే 89777 94588 నంబర్‌కు వాట్సాప్ చేయండి. సందేశం, వాయిస్ మెసేజ్, ఫొటోల రూపంలో పంపండి. వీటిని ‘సాక్షి’ టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య దృష్టికి తీసుకువెళ్తుంది. ఆయన స్పందన మీకు చేరేలా చేస్తుంది. రండి.. అందరం కలిసి కమ్ముకుంటోన్న మత్తును వదిలిద్దాం..
– సందీప్ శాండిల్య
Comments
Please login to add a commentAdd a comment