meetho sakshi
-
Meetho Sakshi: జీతాలే పెద్ద సమస్య.. ఒక రోజు సెలవు తీసుకుంటే రెండు రోజుల జీతం కట్
-
Meetho Sakshi: ఫ్రీ బస్సు.. మా ఆటోలన్ని ఖాళీ.. జర మా గోడు వినండి..
-
కరెంట్ లేదు.. నీళ్లు రావు
-
హైదరాబాద్‌లోని ఇందిరా నెహ్రూ నగర్లో నీటి సమస్య
-
ప్రభుత్వం మారినా అదే తీరు.. పబ్లిక్ కి శాపంగా లింగంపల్లి అండర్ పాస్ బ్రిడ్జి..
-
ఈ రోడ్డుపై వెళితే నడుము విరగాల్సిందే?
-
విపరీతమైన ట్రాఫిక్ సమస్య.. మెట్రో ఒకటే పరిష్కారం..
-
Meetho Sakshi: మేడ్చల్ రోడ్లపై నరకం..
-
చీకటి పడితే పాములు.. వర్షం పడితే దుర్గంధం.. నిజాంపేట్ లో నరక కూపం
-
బాచుపల్లిలో మీతో సాక్షి
-
20 ఏళ్లుగా ఉంటున్నాం.. మీరెవరు పొమ్మనడానికి..
-
ఇళ్లు వదిలి పోండి..
-
Meetho Sakshi: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మంచినీటి సమస్య
-
కంపు చుట్టూ మా బతుకులు కనువిప్పని ప్రభుత్వాలు
-
డ్రైనేజీతో డేంజర్ వర్షం పడితే నరకమే..
-
నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం.. కన్నీరు మిగిల్చిన హైడ్రా కూల్చివేతలు
-
పచ్చని గ్రామాలపై పరిశ్రమల పంజా అత్యంత ప్రమాదకరంగా గడ్డపోతారం
-
సమస్యలకు నిలయంగా మారిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
-
అతివకు అండగా..
ఆడ బిడ్డ.. ఇంటి నుండి బయటికొస్తే అడుగడుగునా వంకరచూపులే. బస్టాపు మొదలు కాలేజీ, కార్యాలయం, కార్ఖానా.. ప్రదేశం ఏదైనా అవకాశం దొరికితే వెకిలి చేష్టలు, వేధింపులు.. డబుల్ మీనింగ్ డైలాగులతో టార్చర్. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా..సెల్‌ఫోన్‌కు అసభ్య సందేశాలు, ప్రేమ పేరుతో పలకరింపులు, వద్దని తిరస్కరిస్తే ఫొటోల మార్ఫింగ్ లతో బ్లాక్‌మెయిలింగ్‌లు. ఇవీ.. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా నేటి మహిళను వెంటాడుతున్న అతిపెద్ద సమస్యలు. భయం, కుటుంబ పరువు ,ప్రతిష్ట, గౌరవం దృష్ట్యా అనేకమంది ఈ నిత్య వేధింపులను భరిస్తున్నారు. షీ టీమ్స్ లేదా పోలీసుల వద్దకు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నవారు కొందరే. అందుకే ‘సాక్షి’ ఇక మీ నేస్తం అవుతోంది. ఇంటా బయట, చదివే చోట, పని ప్రదేశంలో, ప్రయాణంలో, చివరకు ‘నెట్’ఇంట్లో.. ఇలా ఎక్కడ, ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నా 8977794588 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలపండి. మీ సమస్యల్ని ‘సాక్షి’ తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ దృష్టికి తీసుకెళ్తుంది. మూడో కంటికి తెలియకుండా మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది. భయం వీడండి..ధైర్యంగా ముందుకు కదలండి. వేధింపుల నుంచి విముక్తి పొందండి.నోట్: పేరు, వివరాలు గోప్యంగా ఉంచాలని కోరితే..వారి అభిప్రాయాలను ‘సాక్షి’ గౌరవిస్తుంది -
మత్తు వదిలిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: మత్తుపదార్థాలు రవాణా చేసే ముఠాలను కట్టడి చేయడంతోపాటు మత్తుపదార్థాలకు అలవాటుపడిన వారిని అందులోంచి బయటపడేసే వ్యూహంతో ముందుకు వెళితేనే మత్తు మహమ్మారిని తరిమికొట్టడం సాధ్యమవుతుందని నిపుణులు చెపుతున్నారు. మద్యం, కల్తీకల్లు, గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు బానిసలైన వారిని ఆ వ్యసనం నుంచి బయటపడేసేందుకు ఏర్పాటు చేసిన డీ–అడిక్షన్ సెంటర్లకు రోగుల సంఖ్య ఇటీవల పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతానికి భిన్నంగా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల గురించి అవగాహన పెరుగుతుండటంతో డీ–అడిక్షన్ సెంటర్లలో చేరే రోగుల సంఖ్యా పెరుగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డీ–అడిక్షన్ సెంటర్ల పనితీరును టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఇటీవలే పరిశీలించి ఓ నివేదికను తయారు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 డీ–అడిక్షన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తుండగా.. ఐదు సెంటర్లు పూర్తిగా మూతపడినట్టు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా డీ–అడిక్షన్‌కు ప్రాధాన్యం పెరగడంతోనషాముక్త భారత్ అభియాన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో డీ–అడిక్షన్ సెంటర్లను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటిల్లో కనీసం 10 చొప్పున బెడ్లు అందుబాటులోకి తెచ్చారు. మద్యం బానిసలే ఎక్కువ.. డీ–అడిక్షన్ సెంటర్లలో చేరుతున్న రోగులలో ఎక్కువ మంది మద్యానికి బానిసలైన వారే ఉంటున్నారు. తర్వాత పెద్ద సంఖ్యలో గంజాయి బానిసలు ఉంటున్నారు. 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు 12 వరకు డీ–అడిక్షన్ సెంటర్లలో చేరిన రోగుల సంఖ్య ఆధారంగా చూస్తే.. హనుమకొండలోని డీ–అడిక్షన్ కేంద్రంలో 1,067 మంది మద్యానికి బానిసలైన వారుండగా, గంజాయి రోగులు 344 మంది ఉన్నారు. ఆదిలాబాద్ సెంటర్లో 781 మంది మద్యానికి బానిసలైన వారు చేరగా.. 53 మంది గంజాయి బాధితులు ఉన్నారు.ఎల్బీనగర్లోని సెంటర్లో 933 మంది మద్యానికి బానిసలైన రోగులు, 39 మంది గంజాయికి బానిసలైన రోగులున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో 850 మంది మద్యం బానిసలు, 30 మంది గంజాయికి బానిసలైన రోగులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని సెంటర్లో 722 మంది మద్యానికి బానిసలైన వారు.. 24 మంది గంజాయికి అలవాటుపడిన వారున్నారు. ఖమ్మం జిల్లా మధిర‡ సెంటర్లో 427 మంది రోగులు మద్యానికి బానిసలైన వారుండగా, 23 మంది గంజాయి నుంచి డీ–అడిక్షన్ కోసం చేరారు. డీ–అడిక్షన్ సెంటర్లు అంటే..? మద్యం, గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు బానిసలైన వారికి ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు అవసరమైన వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందించి వారిని తిరిగి ఆరోగ్యవంతులుగా మార్చే కేంద్రాలను డీ–అడిక్షన్ సెంటర్లుగా వ్యవహరిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆధ్వర్యంలో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ (ఎన్ఏపీడీడీఆర్) పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రులలో డీ–అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. -
నిషా ముక్త్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు, ప్రజలు.. అంతా కలిసి పని చేస్తేనే రాష్ట్రం నుంచి మాదకద్రవ్యాలను తరిమేయడం సాధ్యమవుతుందని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ ఏఎన్‌బీ) డైరెక్టర్ సందీప్ శాండిల్య స్పష్టం చేశారు. ‘నిషా ముక్త్ తెలంగాణ’(మత్తు రహిత తెలంగాణ) కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా పాఠశాలలు, కళాశాలలపై ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు.గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్‌ను కట్టడి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. గంజాయి సహా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడానికి, ప్రజల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేయడానికి ‘సాక్షి’చేపట్టిన ‘మీతో సాక్షి’క్యాంపెయినింగ్‌కు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది తమ ప్రశ్నలను వాట్సాప్ ద్వారా పంపారు. వీటికి సందీప్ శాండిల్య సమాధానాలు ఇచ్చారు. ‘మీతో సాక్షి’కి వచ్చిన ప్రశ్నలకు శాండిల్య సమాధానాలు..ప్రశ్న: మత్తు పదార్థాలకు అలవాటు పడిన పిల్లల్ని ఎలా గుర్తించాలి? డీ అడిక్షన్ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏమైనా కేంద్రాలున్నాయా? – వేణుగోపాలరావు, ఖమ్మం వన్ టౌన్సమాధానం: నలుగురిలో కలవకుండా దూరంగా ఉండటం, చదువులో వెనకబడటం, గతంలో ఉత్సాహంగా పాల్గొన్న కార్యక్రమాల విషయంలో ఇప్పుడు విముఖత చూపడం, ఖర్చు ఎక్కువ చేయడం, ఆ డబ్బు కోసం చోరీలు చేయడం, కేవలం ఒకరిద్దరితోనే ఎక్కువగా తిరుగుతూ ఉండటం, కుటుంబంతో కలిసి ఫంక్షన్లకు వెళ్లకుండా ఒంటరిగా ఉండటం, ముఖంపై చిరునవ్వు మాయం కావడం, కుటుంబీకుల కళ్లలోకి చూసి మాట్లాడలేక పోవడం.. ఇవన్నీ గంజాయి/డ్రగ్ బానిసల లక్షణాలు. ఇలాంటివారి కోసం నిషా ముక్త్ తెలంగాణ ప్రాజెక్టులో భాగంగా 26 ఆస్పత్రులతో పాటు 11 డీ అడిక్షన్ కేంద్రాలు పని చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులను సంప్రదిస్తే వాటి వివరాలు తెలుస్తాయి.ప్రశ్న: మా ఫ్లాట్ ఎదురుగా ఉండే నా స్నేహితురాలి కుమారుడి ప్రవర్తనలో కొత్తగా మార్పు కనబడుతోంది. ఇతను జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. స్కూల్ నుంచి రాగానే బాత్రూమ్లోకి వెళ్లి గంటల తరబడి ఉంటున్నాడు. నిద్రలో ఉలిక్కి పడుతున్నాడు. ఒక రోజు బ్యాగ్‌లో ఏదో పౌడర్ ఉన్న ప్యాకెట్ దొరికింది. ఆ బాలుడి విషయంలో ఏం చేయాలి? – ఓ మహిళ, మణికొండసమాధానం: ఎవరైనా గంజాయి, డ్రగ్స్‌కు బానిసయ్యారనే అనుమానం ఉంటే వారికి 12 ప్యారామీటర్ టెస్ట్ చేయించాలి. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు ప్రముఖ డయాగ్నస్టిక్ సెంటర్లలో ఈ పరీక్ష చేస్తారు. మీరు చెప్తున్న బాలుడి విషయంలో ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాం. ‘87126 71111’కు కాల్ చేసి చిరునామా ఇతర వివరాలు చెప్పండి. ఓ మహిళా అధికారిని పంపి విషయం తెలుసుకుని, బాలుడికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కరిస్తాం. ఆ బాలుడు మాదకద్రవ్యాలకు బానిసయ్యాడని తెలిస్తే అతడి పైన కాకుండా అతడిని ఈ ఊబిలోకి దింపిన వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: మాకు సమీపంలో ఉన్న కాలేజీ ఆవరణలో చీకటి పడిన తర్వాత యువత పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. వాళ్లు సిగరెట్లు తాగుతూ గంజాయితో పాటు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా అనుమానం ఉంది. దీనిపై చర్యలు తీసుకోగలరా? – పేరు, వివరాలు గోప్యంగా ఉంచాం సమాధానం: అలాంటప్పుడు మీరు వెంటనే ‘100’లేదా ’87126 71111’కు ఫోన్ చేయండి. లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. మేము కూడా ఆ ప్రాంతంపై నిఘా వేసి ఏం జరుగుతోందో తెలుసుకుంటాం. మీ పేరు, ఇతర వివరాలు గోప్యంగా ఉంచుతాం.ప్రశ్న: మా ప్రాంతంలో ఉన్న కల్లు దుకాణం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేకమంది ఇక్కడకు వస్తుంటారు. ఆ దుకాణంలో విక్రయించే కల్లులో ఏదైనా కలుపుతున్నారేమోనని అనుమానం ఉంది. – పేరు, వివరాలు గోప్యంగా ఉంచాంసమాధానం: దీనిపై ఏఎన్‌బీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆరా తీస్తుంది. అలాంటిది ఏమైనా ఉన్నట్టు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటుంది.ప్రశ్న: గంజాయి అలవాటు సిగరెట్ నుంచి మొదలవుతుంది. పాఠశాలల పరిసరాల్లో ఉన్న దుకాణాల్లో సిగరెట్లు అమ్మకుండా తనిఖీలు ఏమైనా చేస్తున్నారా? – వంశీకృష్ణ, విద్యారి్థ, మోడల్ స్కూల్, మందమర్రిసమాధానం: సిగరెట్ ఇతర పొగాకు ఉత్పత్తుల (కోటా్ప) చట్టం–2023 ప్రకారం విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు విక్రయించే దుకాణాలు ఉండకూడదు. అలాంటి దుకాణాలపై జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విక్రేతలకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.ప్రశ్న: ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి రాకుండా నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? – మిట్టపల్లి యుగంధర్, హెచ్ఎం, ఎంపీపీ స్కూల్ దూళికట్ట, పెద్దపల్లి జిల్లాసమాధానం: గంజాయికి దాన్ని పండించే ప్రాంతంలోనే చెక్ చెప్పాలని నిర్ణయించాం. టీఎస్ ఏఎన్‌బీ నేతృత్వంలో త్వరలో విశాఖపట్నంలో జరిగే మూడు రాష్ట్రాల అధికారులు, రాజకీయ నాయకుల భేటీలో గంజాయి కట్టడికి ప్రత్యేక కార్యాచరణ ఖరారు చేస్తాం. ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా గంజాయి పండించే ప్రాంతాలను గుర్తించనున్నాం. సరిహద్దు చెక్‌పోస్టుల్లో ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నాం.ప్రశ్న: మాదకద్రవ్యాల కట్టడికి సారా వ్యతిరేక ఉద్యమం మాదిరిగా ఉద్యమం రావాలి. దీనికోసం టోల్ ఫ్రీ నంబర్ ఏదైనా అందుబాటులో ఉందా? – స్వాతి, మహిళా సంఘం నాయకురాలు, సుల్తానాబాద్సమాధానం: అలాంటప్పుడు మీరు వెంటనే ‘100’లేదా ’87126 71111’కు ఫోన్ చేయండి. లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. మేము కూడా ఆ ప్రాంతంపై నిఘా వేసి ఏం జరుగుతోందో తెలుసుకుంటాం. మీ పేరు, ఇతర వివరాలు గోప్యంగా ఉంచుతాం.ప్రశ్న: గ్రామాల్లో మత్తు పదార్థాల నిషేధ కమిటీలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందా? – రాంచందర్ భీంవంశీ, ప్రజాకవి, ఉపాధ్యాయులు, జహీరాబాద్సమాధానం: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 7,500 యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేశాం. ఆయా స్కూళ్లు, కాలేజీల్లో ఇవి పని చేస్తున్నాయి. ప్రతి బుధవారం మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గ్రామీణ స్థాయిలో ఉన్న అన్ని విభాగాలు, అధికారులు, గ్రామ పెద్దలతో కలిసి పని చేస్తున్నాం.అనూహ్య స్పందన..(నోట్: మీతో ‘సాక్షి’పిలుపునకు అనూహ్య స్పందన వచ్చింది. రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు ప్రశ్నలు వేశారు. కొందరు తమకు తెలిసిన సమాచారం ఇచ్చారు. వీటిల్లోని సున్నితాంశాలు, కీలక సమాచారాన్ని టీజీ ఏఎన్‌బీకి అందించాం. అనేక ప్రశ్నలు సారూప్యత కలిగి ఉండటంతో వాటిల్లో కొన్నింటినే ఎంపిక చేశాం)ఆ తండ్రికి వందనం..తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిన ప్రత్యేక నంబర్ 87126 71111కు నిత్యం కీలక సమాచారం అందుతోందని సందీప్ శాండిల్య తెలిపారు. ఆ సమాచారం ఆధారంగా ఛేదించిన కేసుల్లో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. వాటిని ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ప్రజారోగ్యానికి చేటు చేస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ–సిగరెట్లను నిషేధించింది. అయితే నగరానికి చెందిన ఓ విద్యార్థి ఆన్లైన్లో వీటిని ఖరీదు చేస్తున్నాడు. రహస్యంగా తన వద్ద ఉంచుకుని స్నేహితులతో పాటు తోటి విద్యార్థులకు విక్రయిస్తున్నాడు. తన కుమారుడు చేస్తున్న ఈ వ్యవహారం చట్ట విరుద్ధమని భావించిన అతడి తండ్రి ఏఎన్‌బీకి సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అధికారులు అతనితో పాటు ఇతర విక్రేతలు, వినియోగదారులైన 30 మందిని గుర్తించారు. రూ.లక్షల విలువైన ఈ–సిగరెట్లు స్వా«దీనం చేసుకున్నారు. అందరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు.‘సరుకు’దొరకకున్నా అరెస్టు.. నానక్‌రామ్‌గూడలోని ఓ ఇంట్లో గంజాయి విక్రయాలు భారీగా సాగుతున్నట్లు సమాచారం ఇచ్చిన యువకుడు దీనికి సాక్ష్యంగా వీడియోను పంపాడు. ఏఎన్‌బీ అధికారులు వెళ్లి దాడి చేసే సమయానికి అప్రమత్తమైన భార్యాభర్తలు తమ ఇంట్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేశారు. అయితే ఉన్నతాధికారులు తమ వద్ద ఉన్న వీడియోను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. ఓ సందర్భంలో వారి కుమార్తె ‘సరుకు’అందిస్తున్నట్లు కనిపించింది. స్కూల్ యూనిఫాంలో ఉన్న ఆమెను మైనర్‌గా గుర్తించారు. జువైనల్ జస్టిస్ యాక్ట్‌లోని సెక్షన్ 78 ప్రకారం సిగరెట్లు, మద్యం, మాదకద్రవ్యాలను చిన్నారుల చేతికి ఇవ్వకూడదు. దీని ఆధారంగా భార్యాభర్తలపై కేసు నమోదు చేసి ఏఎన్‌బీ జైలుకు పంపింది.రివర్స్ మెకానిజంతో...డార్క్‌వెబ్‌పై నిఘా ఉంచడం, అందులో జరిగే డ్రగ్స్ క్రయవిక్రయాలను అడ్డుకోవడం సాధ్యం కాదు. దీంతో ఏఎన్‌బీ రివర్స్ మెకానిజం మొదలెట్టింది. ఏ దేశంలో ఉన్న సప్లయర్‌కి ఆర్డర్ ఇచ్చినా అది పార్సిల్ రూపంలో వచ్చి పెడ్లర్‌కు చేరాల్సిందే. దీంతో వివిధ కొరియర్ సంస్థలు, ఎయిర్ కార్గో ద్వారా వచ్చే పార్సిళ్లను ట్రాక్ చేయడం మొదలెట్టారు. ఈ క్రమంలో ఇటీవల ఖమ్మంలో డ్రగ్స్ గుట్టు రట్టు చేశారు. -
మత్తు వదలరా!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మత్తు ఒక వ్యసనం. అది ఏ రూపంలోనైనా ఉండొచ్చు. గంజాయి, మద్యం, కల్తీకల్లు, హషీశ్, వైట్నర్ లాంటి ద్రావణాలు మత్తు కలిగిస్తూ మనుషుల విక్షణ హరించివేస్తున్నాయి. వీటికి బానిసైన వారు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారు. జనారణ్యంలో తిరిగే మానవ బాంబుల్లా తయారవుతున్నారు. అంతేకాదు.. డబ్బు కోసం కుటుంబ సభ్యులను పీడించడం, వేధించడం.. చివరకు చంపడానికి కూడా వెనుకాడడం లేదు. అందుకే, ఇలాంటి వారిని గుర్తించి వీలైనంత వరకు మార్పు తెచ్చేలా రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో(టీజీ ఏఎన్‌బీ) నడుం బిగించింది. అందుకే, మత్తుకు బానిసైన వారిని గుర్తించి చికిత్స అందించే దిశగా ఏర్పాట్లు చేసింది. ఇందు కోసం ప్రతీప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఒక డి–అడిక్షన్ సెంటర్ ఏర్టాఉ చేసింది. చికిత్స చేసేందుకు 10 బెడ్లు సిద్ధం చేసింది.ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారంటే..మత్తుకు బానిసైన వారిలో పరివర్తన తెచ్చేలా వైద్య చికిత్స అందించేందుకు డి–అడిక్షన్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రతీప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రత్యేక విభాగం, పదేసి పడకలు సిద్ధం చేసింది. కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, జగిత్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, రాజన్న సిరిసిల్లలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. వాస్తవానికి ఈ ఏర్పాట్లు గతేడాది సెప్టెంబరులోనే మొదలయ్యాయి. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ మహమ్మారిని తరిమేయాలన్న లక్ష్యంతో వ్యసనపరులను గుర్తించి చికిత్స అందించాలని నిర్ణయించింది. తద్వారా వ్యసనపరుల సంఖ్యను వీలైనంతగా తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించింది.గ్రామస్థాయి నుంచి గుర్తింపు..మత్తుకు బానిసైన వారికి తప్పకుండా వైద్య చికిత్స అందించాలని గత జూన్ 6న అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. వీరితోపాటు పోలీసులు కూడా క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం సినిమా హాళ్లతోపాటు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ డ్రగ్స్‌పై ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. గంజాయి వినియోగం పట్టణాల నుంచి గ్రామస్థాయికి పాకింది. అందుకే, వ్యసనపరులను గుర్తించేందుకు ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, పీహెచ్సీ, మెప్మా సిబ్బంది, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు(ఏఈవో), పంచాయతీ సిబ్బంది, అధికారులు, వార్డు సభ్యులను ఇందులో భాగస్వాములను చేస్తోంది. పాఠశాలల సిబ్బంది, విద్యార్థి నాయకులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా వ్యసనపరులను గుర్తించి మెడికల్ కాలేజీలకు తీసుకువెళ్తారు. మత్తుకు బానిసైన వారికి అక్కడ మానసికంగా కౌన్సెలింగ్ ఇస్తారు. వైద్య చికిత్స చేస్తారు. వ్యసనం బాగా ముదిరిన కేసులను హైదరాబాద్‌కు తరలిస్తారు.వ్యసనపరులకు వైద్యం..మత్తు పదార్థాలకు బానిసలైన వారికి వైద్యచికిత్స అందించేందుకు ప్రభుత్వం ఒక్కో మెడికల్ కాలేజీలో పది పడకలు కేటాయించింది. గంజాయికి బానిసలైన వారిని గుర్తించి ఆస్పత్రికి తీసుకొస్తే సైకియాట్రిస్ట్‌తో చికిత్స చేయిస్తారు. మందులు అందజేస్తారు. వ్యసనపరులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తారు. మానసిక సమస్యలు అధికంగా ఉంటే హైదరాబాద్‌కు రెఫర్ చేస్తారు. – డాక్టర్ వీరారెడ్డి, సూపరింటెండెంట్, జీజీహెచ్, కరీంనగర్ -
స్మగ్లింగ్ కేరాఫ్ కొరియర్స్
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులో తయారైన మాదకద్రవ్యం ఎఫిడ్రిన్‌ను నగరంలోని అక్బర్‌బాగ్ నుంచి కొరియర్ ద్వారా ఆస్ట్రేలియా పంపాలని చూసిన ముఠాను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు.⇒ ఢిల్లీలోని ఓ కొరియర్ సంస్థ హిమాయత్‌నగర్‌లోని వ్యాపారికి వజ్రాలను పార్శిల్ చేసింది. వీటిని కొరియర్ ఉద్యోగులే తస్కరించడంతో ఏళ్లుగా జరుగుతున్న అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది.⇒ ఓ కొరియర్ సంస్థ ద్వారా హాంకాంగ్ వెళ్తున్న ఓ పార్శిల్‌ను ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ అధికారులు స్కానింగ్ చేశారు. ఫలితంగా అందులో రూ.5 లక్షల విలువైన ఎర్ర చందనం ఉన్నట్లు తేలడంతో అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.⇒ హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్‌కు కొరియర్ ద్వారా అక్రమంగా ఎఫిడ్రిన్ రవాణా చేస్తున్నారంటూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కు (డీఆర్ఐ) సమాచారం అందింది. శనివారం ఓ కొరియర్ కార్యాలయంలో సోదాలు చేసి మూడు కేజీలు స్వాధీనం చేసుకున్నారు.⇒ ఈ ఉదంతాలే కాదు.. తెరపైకి రాకుండా చాపకింద నీరులా కొరియర్స్ ద్వారా సాగిపోతున్న బంగారం, వజ్రాలు, ఎర్రచందనం, మాదకద్రవ్యాల దందాకు నగరంలో కొదవేలేదు. ఏళ్లుగా ‘బులియన్ మార్కెట్’ అక్రమ దందా సాగుతుండగా.. కొన్నేళ్లుగా ఎర్ర చందనాన్నీ కొరియర్స్ ద్వారా దేశం దాటించడం మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకూ కొరియర్స్‌ను వాడుతున్నారని వెలుగులోకి వచ్చింది.అవి ఇక్కడికి.. ఇవి అక్కడికి..హోల్‌సేల్‌గా బంగారాన్ని కిలోల లెక్కన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు, వజ్రాలను ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ తీసుకువచ్చి రిటైలర్స్‌కు, జ్యువెలరీ దుకాణ యజమానులకు విక్రయిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో తీసుకుని రావడానికీ వెనుకంజ వేస్తున్న వ్యాపారులు ఏకంగా పార్శిల్స్ చేసి పంపిస్తున్నారు. అలాగే నగర శివార్లతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల్లోనూ ఖాయిలా పడ్డ ఫార్మా పరిశ్రమలు అనేకం ఉన్నాయి. వీటితో పాటు కొందరి ఇళ్లూ డ్రగ్స్ కార్ఖానాలుగా మారిపోతున్నాయి. ప్రధానంగా ఎఫిడ్రిన్, ఆల్ఫాజోలం తదితరాలు వీటిలో తయారవుతున్నాయి. వీటి ధర ఇక్కడ కిలో రూ.లక్షల్లో ఉండగా.. విదేశీ విపణిలో మాత్రం రూ.కోట్లు పలుకుతోంది. దీంతో ఆ సరుకులు కొరియర్స్ ద్వారా సిటీకి వస్తుండగా.. ఎఫిడ్రిన్, సూడో ఎఫిడ్రిన్ వంటి డ్రగ్స్ సిటీ నుంచి బయటకు వెళ్లిపోతున్నాయి.ఆర్థిక లావాదేవీలకు అక్రమ మార్గంలో..వీటిలో ఏవి ఎటు వచ్చినా, వెళ్లినా... చెల్లింపులు మాత్రం నేరుగా, బ్యాంకు ఖాతాల ద్వారా సాగించరు. దీనికి అనేక మంది వ్యాపారులు, స్మగ్లర్లు అక్రమ ద్రవ్య మార్పిడైన హుండీ, హవాలాలను ఆశ్రయిస్తున్నారు. నగరంలో ఉన్న ఏజెంట్లకు డబ్బు అప్పగించే వ్యాపారులు, అది చేరాల్సిన వ్యక్తి వివరాలు చెప్పి కమీషన్ ఇస్తే చాలు. గంటలోపే డెలివరీ అయిపోతుంది. ఇక్కడకు రావాలన్నా ఇదే పంథా కొనసాగుతోంది. ఈ విధానమే తమకు సురక్షితమని భావిస్తున్న స్మగ్లర్లు, వ్యాపారస్తులు దీన్నే అవలంబిస్తున్నారు. నగరంలోని బేగంబజార్, పాతబస్తీ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ రోజూ రూ.కోట్లలో ఈ అక్రమ ద్రవ్యమార్పిడి బిజినెస్ నడుస్తోందని పోలీసులే అంగీకరిస్తున్నారు. ప్రతి రూ.లక్షకు కేవలం రూ.300 నుంచి రూ.600 వరకు మాత్రమే కమీషన్‌గా ఉండటం వీరికి కలిసి వస్తోంది. ఏవైనా ఉదంతాలు చోటు చేసుకున్న సందర్భంలో మాత్రమే ఏజెన్సీల రికార్డుల్లోకి ఈ వ్యవహారాలు ఎక్కుతున్నాయి. డ్రగ్స్ రవాణా వ్యవహారాల్లో పాత్రధారులు మినహా సూత్రధారులు దొరుకుతున్న సందర్భాలు లేవు.అన్నీ స్కానింగ్ సాధ్యం కాదుకొరియర్ పార్శిల్స్ ద్వారా డ్రగ్స్, పేలుడు పదార్థాలు, డబ్బు, నగలు, మానవ అవయవాలు, మత్తు పదార్థాలు తదితరాలను పార్శిల్ చేయడంపై పూర్తి నిషేధం ఉంది. అయినా పట్టుబడిన నిందితులు చెప్పిన వివరాలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ప్రకారం అనేక కొరియర్స్ ద్వారా ఈ రవాణా జరుగుతోంది. ఇలాంటి అంశాల్లో పూర్తి వివరాలను వెలికితీసే అవకాశం పోలీసు, ఏజెన్సీలకు ఉండట్లేదు. ఎయిర్‌కార్గో ద్వారా రవాణా అయ్యే ప్రతి పార్శిల్‌ను స్కానింగ్ చేయడం, క్షుణ్ణంగా పరిశీలించడం సాధ్యం కాదు. సంబంధిత విభాగంలో ఆ సాంకేతిక పరిజ్ఞానం, మానవవనరులు లేవు. నిరంతర నిఘా, ప్రతి కేసులోనూ మూలాలను అన్వేషించడం ద్వారానే ఇలాంటి వాటికి చెక్ చెప్పగలం.– శ్రీనివాస్, కస్టమ్స్ విభాగం మాజీ అధికారి -
డార్క్ వెబ్‌లో హెరాయిన్ ఆర్డర్.. స్పీడ్ పోస్ట్‌లో డెలివరీ!
ఖమ్మం క్రైం: సాధారణంగా మానవ కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతుంటుందన్న విషయం తెలిసిందే. కానీ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణా, సరఫరాపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో డ్రగ్స్ బానిసలు కొత్తదారులను ఆశ్రయిస్తున్నారు. తాజా గా ఓ యువకుడు డార్క్ వెబ్‌లో ఆర్డర్ పెట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్న ఉదంతం ఖమ్మంలో వెలుగుచూసింది.అస్సాం నుంచి: ఖమ్మం టూటౌన్ ప్రాంతానికి చెందిన ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ మత్తుపదార్థాలకు అలవాటు పడ్డాడు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న అతను అక్కడ పోలీసు నిఘా ఎక్కువగా ఉండటంతో ఖమ్మంకు తెప్పించుకుంటే ఎవరికీ అనుమానం రాదని భావించాడు. ఇందుకోసం హ్యాకర్లు, మాఫియా, విమెన్ ట్రాఫికింగ్, ఆయుధాల స్మగ్లింగ్ చేసేవారు ఉపయోగించే డార్క్ వెబ్ (తమ గుర్తింపు, జాడను ఇతరులకు తెలియనివ్వకుండా ఇంటర్నెట్లోని హిడెన్ వెబ్సైట్లను ఉపయోగించేందుకు అవకాశం కల్పిస్తుంది) ఎంచుకున్నట్లు సమాచారం. ఆపై తన క్రెడిట్ కార్డు, ఇతర యాప్‌లు వాడకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేసి హెరాయిన్‌ను అస్సాంలోని సిల్పుకురి నుంచి బుక్ చేసుకున్నాడు.యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిఘాతో..: డ్రగ్స్ ఆన్లైన్లో విక్రయిస్తుండగా కొందరు తెప్పించుకుంటున్నారనే అను మానంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన సాంకేతిక బృందం కొన్నాళ్లుగా నిఘా వేసింది. ఇందులో భాగంగా గ త నెల 31న ఖమ్మం యువకుడు డ్రగ్స్ బు క్ చేసుకున్నట్లు పసి గట్టింది. స్పీడ్ పోస్ట్ పార్సిల్ నంబర్‌ను హెరాయిన్ సరఫరా దారు ఖమ్మం యువ కుడికి పంపడంతో అస్సాంలో పార్సిల్ మొదలైనప్పటి నుంచి నిఘా వేసింది. ఈ నెల 8న ఖమ్మం చేరుకున్న పార్సిల్‌ను 9న ఆ యువకుడికి డెలివరీ చేస్తుండగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులతోపాటు ఖమ్మం టూటౌన్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఆ పార్సిల్లో మ్యాగజైన్ మాత్రమే ఉండటంతో తొలుత యువకుడు బుకాయించాడు. అనంతరం అధికారులు మ్యాగజైన్‌లోని ఒక్కో పేజీని పరిశీలిస్తుండగా మధ్యలో ఓ కాగితానికి టేప్ వేసి ప్లాస్టిక్ కవర్లో ఉంచిన 2 గ్రా ముల హెరాయిన్ బయటపడింది. దీంతో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. దాన్ని సరఫరా చేసిందెవరు? రాష్ట్రంలో ఇంకా ఎవరెవరు తెప్పించుకున్నారనే కోణంలో ప్రశ్నించారు. యువకుడి కెరీర్ దృష్ట్యా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తుపదార్థాల విక్రయం జరి గినట్లు తెలిస్తే 87126 71111 లేదా 1908 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. -
HYD: కొరియర్ చేస్తుండగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో డీఆర్ఐ అధికారులు శనివారం(ఆగస్టు10) భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్‌కు డ్రగ్స్ కొరియర్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.రూ. 60 లక్షల విలువైన 3 కిలోల ఎఫెడ్రిన్ సూడోఎఫెడ్రిన్ ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ప్యాకెట్లలో డ్రగ్స్ పొడిరూపంలో ఉన్నాయి. అరెస్టు చేసిన వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.