Eradication
-
వివేచన హక్కుపై నిషేధమా?
మంచేదో చెడేదో, తప్పేదో ఒప్పేదో, నైతికతేదో అనైతికమేదో మనకు మనం నిర్ణయించుకోగల మన సామర్థ్యమే నిస్సందేహంగా మనల్ని తక్కిన జంతువులకు భిన్నంగా ఉంచుతోంది. ఇతరులను మనం ప్రమాదంలోకి నెట్టనంత వరకు మనకున్న ఈ వివేచన హక్కు అభేద్యమైనది. అదే సమయంలో, మనపై విధించిన పూర్తిస్థాయి నిషేధం ఏదైనా... అది మనల్ని మనిషిగా తక్కువ చేసేస్తుంది. ప్రభుత్వం నిజాయితీగా కనుక ధూమపాన నిర్మూలన జరగాలని కోరుకుంటూ ఉంటే సృజనాత్మకమైన, చిరస్మరణీయ ప్రచారాన్ని చేపట్టాలి. పొగతాగే వారికి నచ్చజెప్పి ఆ అలవాటును మాన్పించటానికి అవకాశాలు న్నాయి. కానీ దండనలతో మార్పు తేచ్చే ప్రయత్నాలు మాత్రం విఫలం అవుతాయి. బ్రిటన్‌లో గత ప్రభుత్వం ఇలాంటి నిష్ఫల ప్రయత్నమే చేసింది.అప్పుడు నాకు 16 ఏళ్లు ఉంటాయి. కానీ, నిన్ననే జరిగినంతగా ఆ సంగతి గుర్తుండి పోయింది. వీకెండ్ కోసం స్టోవ్ (యూఎస్‌లోని వమాంట్ రాష్ట్రంలో ఒక పట్టణం) నుండి వచ్చాను నేను. అందరం కలిసి టీవీ చూస్తున్నాం. కిరణ్ సిగరెట్ తాగుతూ ఉంది. ‘క్యారీ ఆన్’ (ప్రసిద్ధ బ్రిటిష్ కామెడీ సీరీస్)లోని ఒక చిత్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు సగం వరకూ రాగానే, మధ్యలో ఒక వాణిజ్య ప్రకటన మా దృష్టిని ఆకర్షించింది. ఇద్దరు బ్రిటిష్ పోలీసు అధికారులు రోడ్డు పక్కన ఉన్న ఒక కేఫ్‌ను దాటి నడుచుకుంటూ వెళుతుండగా, వారి చూపు ఒక అందమైన యువతిపైన పడుతుంది. ఎడమ చేతిలో పొడవాటి సిగరెట్‌తో ఉన్న ఆమె కొద్ది కొద్దిగా కాఫీని సిప్ చేస్తుంటుంది. ‘‘ఆమెను చూడు’’ అని మొదటి పోలీస్ ఆఫీసర్ గుసగుసగా అంటాడు. ‘‘సిగరెట్ తాగుతోంది కదా?’’ అని రెండో ఆఫీసర్. ‘‘ఆమె కాళ్లు నాకు నచ్చాయి.’’‘‘అవి, కాలుతున్న ఆమె సిగరెట్ పొడవంత ఉన్నాయి.’’‘‘ఆ పెదవులను ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది నాకు.’’‘‘కంపు కట్టే యాష్‌ట్రేని ముద్దు పెట్టుకున్నట్లా?’’ఆ డైలాగ్ తర్వాత ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ముందుకు సాగిపోతారు. ఆ అందమైన యువతి స్క్రీన్ వైపు చూసి నవ్వుతుంది. విడివడిన ఆమె పెదవుల మధ్య పలువరుస నికోటిన్ మరకలతో పొగచూరి, గోధుమ వర్ణంలో ఉంటుంది! ‘యాక్’ అని అసంకల్పితంగా అరిచేశాను నేను. నా వెన్నులో వణుకు పుట్టింది. కిరణ్ అయితే తను తాగుతూ ఉన్న సిగరెట్‌ను అప్పటికప్పుడు విసిరి పారేసింది. ఆ వీకెండ్లో ఆమె మళ్లీ సిగరెట్ తాగినట్లు నాకు గుర్తు లేదు.ఆ వాణిజ్య ప్రకటనకు రూపకర్తలు ఎవరో నాకు తెలియదు. ప్రభుత్వమే చెప్పి చేయించిందో, లేదా ఏదైనా ప్రైవేటు ట్రస్టుఅందుకు నిధులు సమకూర్చిందో కానీ అది మాత్రం చాలా ప్రభావ వంతంగా ఉంది. మన ప్రభుత్వం నిజాయతీగా కనుక ధూమపాన నిర్మూలన జరగాలని కోరుకుంటూ ఉంటే ఆ ప్రకటనలో ఉన్నట్లే సృజ నాత్మకమైన, చిరస్మరణీయ ప్రచారాన్ని చేపట్టాలి. పొగతాగే వారికి నచ్చజెప్పి ఆ అలవాటును మాన్పించటానికైతే అవకాశాలున్నాయి. కానీ దండనలతో వారిలో మార్పు తేచ్చే ప్రయత్నాలు మాత్రం విఫలం అవుతాయి. అందుకే ధూమపానాన్ని నిషేధించాలన్న నిర్ణ యాలు ఘోరమైన తప్పిదాలుగా మిగులుతున్నాయి. బ్రిటన్‌లో గత ప్రభుత్వం ఇలాంటి నిష్ఫల ప్రయత్నమే చేసింది. మన ప్రభుత్వం అలా ఎప్పటికీ చేయదనే ఆశిస్తున్నాను. మంచేదో చెడేదో, తప్పేదో ఒప్పేదో, నైతికతేదో అనైతికమేదో మనకు మనం నిర్ణయించుకోగల మన సామర్థ్యమే నిస్సందేహంగా మనల్ని తక్కిన జంతువులకు భిన్నంగా ఉంచుతోంది. ఇతరులను మనం ప్రమాదంలోకి నెట్టనంత వరకు మనకున్న ఈ వివేచన హక్కు అభేద్యమైనది. అది మన వ్యక్తిత్వాన్ని కూడా నిర్వచిస్తుంది. అదే సమ యంలో, మనపై విధించిన పూర్తిస్థాయి నిషేధం ఏదైనా... మానవత లోని అత్యవసరతల్ని నిరాకరిస్తుంది. అది మనల్ని తక్కువ చేసేస్తుంది. సరైన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం లేని పిల్లల్ని చూసి నట్లుగా మనల్ని చూస్తుంది. నిర్ణయించుకునే హక్కు నుండి మనం అవిభాజ్యంగా ఉండటం అన్న భావనతో ఇతరులు ఏకీభవించకపోవచ్చు. కానీ ఆ ఒకే ఒక్క కార ణమే ఆ హక్కును నిలబెడుతుంది. మీకు భిన్నంగా ఉండటమనే నా హక్కులోనే నా వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంది. అంతేకాదు, నాలోని ఆ భిన్న త్వం మీకు నచ్చకపోయినా మీరు గౌరవించాలనే నేను కోరుకుంటాను. పొగ తాగే విషయం కూడా ఇంతే. పొగ తాగకుండా ఉండేందుకు వెయ్యి మంచి కారణాలు ఉంటాయి. పొగ మాన్పించేందుకు నన్ను ఒప్పించటానికి పది లక్షల సానుకూల వాదనలు ఉంటాయి. కానీ అప్పటికి కూడా నేను పొగ తాగుతున్నానంటే మీరు నా మీద నిషేధం విధించకూడదు. నా ఇష్టాన్ని అడ్డుకోకూడదు. మీరిలా నా మంచి కోసమే చేస్తున్నారన్న మీ వాదన విచిత్రమై నది, నమ్మశక్యం కానిది. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అన్న దానిని నేను కాదనలేదు. నేనే కాదు, నాకు తెలిసిన ధూమమాన ప్రియులు ఎవరూ కూడా కాదనలేరు. అతిగా తినటం, మితిమీరిన వ్యాయామం, కళ్లకు ఒత్తిడి కలిగించుకోవటం, విపరీతంగా కోక్‌లు తాగటం... ఇవన్నీ కూడా హానికరం కాదని ఎవరూ అనరు. అయినప్ప టికీ వీటిల్లో దేనినైనా నేను ఇష్టపడితే కనుక, అప్పుడు కూడా నేను మాత్రమే సలహాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లే విషయాన్ని నిర్ణయించుకోవాలి. దాని వల్ల నేను ఇబ్బంది పడితే అలాగే కానివ్వండి. ఎందుకంటే నిర్ణయించుకునే హక్కులోనే ఆ నిర్ణయం వల్ల బాధ పడే హక్కు కూడా కలిసి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎలా ప్రవర్తించాలి? సమాధానం చాలా సరళమైనది, సూటిౖయెనది. నిషేధం విధించటం కాకుండా ఎవరికి వారు సిగరెట్‌కు దూరమయ్యేలా ప్రభావం చూపే చర్యలు తీసు కోవాలి. సిగరెట్ ప్యాకెట్ల మీద అతి పెద్ద, అత్యంత భయానకమైన ఆరోగ్య హెచ్చరికలను చేయవచ్చు. పన్నులను తరచుగా పెంచుతూ ఉండొచ్చు. (దీని వల్ల ఒక దశ తర్వాత ప్రభుత్వానికి రాబడి తగ్గవచ్చు లేదా ప్రతికూల ఉత్పాదకత సంభవించవచ్చు). ధూమపానానికి వ్యతి రేకంగా విస్తృత ప్రచారాన్ని చేపట్టేందుకు నిధులను అందజేయవచ్చు. ఈ మూడింటినీ నేను సమర్థిస్తాను. అంతేతప్ప ఎప్పుడూ కూడా ధూమపాన నిషేధానికి ప్రయత్నించకూడదు. వ్యక్తులు, సమూహాలు తాము కోరుకున్నప్పుడే తమకై తాము ఆ పనికి సంకల్పించటం జరుగుతుంది. వారి కోసం ప్రభుత్వమే ఆ పని చెయ్యకూడదు. మరింత స్పష్టంగా చెబుతాను. మంచి ప్రభుత్వాలు – పెద్దలు పిల్లల్లో పరిణతి తెచ్చే విధంగా – తమకు తాముగా నిర్ణయించుకునే అవకాశాన్ని, అవకాశంతో పాటుగా వచ్చే బాధ్యతను స్వీకరించే సమర్థతను తమ పౌరులకు అందిస్తాయి. ఆ విధంగా దేశం తన కాళ్ల మీద ఎలా నిలబడాలో నేర్చుకుంటుంది. ఇందుకు భిన్నంగా చెడు ప్రభుత్వాలు పెద్దల్ని కూడా పిల్లలుగా పరిగణిస్తూ వారికున్న నిర్ణయ అధికారాన్ని లాగేసుకుని తమ సొంత నిర్ణయాలను వారిపై అమలు చేస్తాయి. అలా దేశాలు కూలిపోవటం మొదలవుతుంది. అన్నట్లు, నేను పొగ తాగటం మానేసి చాలాకాలమే అయ్యింది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రండి.. ‘మత్తు’ వదిలిద్దాం
డ్రగ్ మహమ్మారి అంతటా విస్తరిస్తోంది. ఓ పక్క గంజాయి.. మరో పక్క సింథటిక్ డ్రగ్స్.. ఇవి చాలవన్నట్లు దుర్వినియోగం అవుతున్న ఔషధాలు పేద, ధనిక తేడా లేకుండా యువతను బలి కోరుతున్నాయి. ముప్పేట ముంచుకొస్తున్న ముప్పు నుండి రేపటి తరాన్ని కాపాడుకుందాం. ‘నిషా ముక్త్ తెలంగాణ’ సాకారం దిశగా అడుగేద్దాం. వీటి కట్టడికి ఇప్పటికే పోలీస్, ప్రత్యేక విభాగాలు తమవంతు పనిని వేగిరం చేశాయి. ఇప్పటికే మన నగరం, పట్టణం, మన ఊరికి వచ్చిన డ్రగ్స్.. మన ఇంటికి, స్కూలు, కాలేజీకి రాకుండా అప్రమత్తమవుదాం.ఆ దిశగా ‘సాక్షి’ మీకు.. నార్కోటిక్స్ బ్యూరోకు మధ్య వారధిగా నిలుస్తుంది. మీకు ఎలాంటి సహా య సహకారాలు కావాలన్నా, మాదక ద్రవ్యాలపై సమాచారం తెలిసినా, కుటుంబీకులు, బంధు వులు, స్నేహితులు, పరిచయస్తులు.. వీరిలో ఎవ రైనా డ్రగ్స్‌కు బానిసలుగా మారారనో, ఇతర సందేహాలు ఉన్నా.. వెంటనే 89777 94588 నంబర్‌కు వాట్సాప్ చేయండి. సందేశం, వాయిస్ మెసేజ్, ఫొటోల రూపంలో పంపండి. వీటిని ‘సాక్షి’ టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య దృష్టికి తీసుకువెళ్తుంది. ఆయన స్పందన మీకు చేరేలా చేస్తుంది. రండి.. అందరం కలిసి కమ్ముకుంటోన్న మత్తును వదిలిద్దాం..నోట్:పేరు, వివరాలను గోప్యంగా ఉంచాలని ఎవరైనా కోరితే... వారి అభిప్రాయాన్ని ‘సాక్షి’ కచ్చితంగా గౌరవిస్తుంది. – సందీప్ శాండిల్య -
రండి.. ‘మత్తు’ వదిలిద్దాం!
డ్రగ్ మహమ్మారి అంతటా విస్తరిస్తోంది. ఓ పక్క గంజాయి.. మరో పక్క సింథటిక్ డ్రగ్స్.. ఇవి చాలవన్నట్లు దుర్వినియోగం అవుతున్న ఔషధాలు పేద, ధనిక తేడా లేకుండా యువతను బలి కోరుతున్నాయి. ముప్పేట ముంచుకొస్తున్న ముప్పు నుండి రేపటి తరాన్ని కాపాడుకుందాం. ‘నిషా ముక్త్ తెలంగాణ’ సాకారం దిశగా అడుగేద్దాం. వీటి కట్టడికి ఇప్పటికే పోలీస్, ప్రత్యేక విభాగాలు తమవంతు పనిని వేగిరం చేశాయి. ఇప్పటికే మన నగరం, పట్టణం, మన ఊరికి వచ్చిన డ్రగ్స్.. మన ఇంటికి, స్కూలు, కాలేజీకి రాకుండా అప్రమత్తమవుదాం.ఆ దిశగా ‘సాక్షి’ మీకు.. నార్కోటిక్స్ బ్యూరోకు మధ్య వారధిగా నిలుస్తుంది. మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా, మాదకద్రవ్యాలపై సమాచారం తెలిసినా, కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు.. వీరిలో ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలుగా మారారనో, ఇతర సందేహాలు ఉన్నా.. వెంటనే 89777 94588 నంబర్‌కు వాట్సాప్ చేయండి. సందేశం, వాయిస్ మెసేజ్, ఫొటోల రూపంలో పంపండి. వీటిని ‘సాక్షి’ టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య దృష్టికి తీసుకువెళ్తుంది. ఆయన స్పందన మీకు చేరేలా చేస్తుంది. రండి.. అందరం కలిసి కమ్ముకుంటోన్న మత్తును వదిలిద్దాం..– సందీప్ శాండిల్య -
2025 నాటికి టీబీ సమూల నిర్మూలన: మైల్యాబ్ కీలక ఆవిష్కారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డయాగ్నోస్టిక్ కిట్స్ తయారీలోఉన్న మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్.. క్షయ వ్యాధిని గుర్తించేందుకు పాథోడిటెక్ట్ పేరుతో ఆర్టీ-పీసీఆర్ ఆధారిత కిట్‌ను రూపొందించింది. క్షయ చికిత్సలో వాడే రిఫాంపిసిన్, ఐసోనియాజిడ్ ఔషధాలు రోగిపై ఏ మేరకు పనిచేస్తాయో కూడా ఒకే పరీక్షలో తెలుసుకోవచ్చు. ఈ కిట్‌కు సీడీఎస్‌సీవో, టీబీ ఎక్స్పర్ట్ కమిటీ, ఐసీఎంఆర్ ఆమోదం ఉందని కంపెనీ తెలిపింది. క్షయవ్యాధికి సంబంధించి ఒకే పరీక్షలో రిఫాంపిసిన్, ఐసోనియాజిడ్‌లకు బహుళ ఔషధ నిరోధకతనుగుర్తించే మేడ్ ఇన్ ఇండియా టీబీ డిటెక్షన్ కిట్ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. పెద్ద ఎత్తున ఫీల్డ్ ట్రయల్స్ తర్వాత ఈ కిట్‌కు అనుమతినిచ్చినట్టు ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో TB నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఏకకాలంలో రెండు సమస్యల్ని పరిష్కరిస్తున్నామని మైల్యాబ్ ఎండీ హస్ముఖ్ రావల్ తెలిపారు.దేశంలో 2025 నాటికి టీబీనీ సమూలంగా నిర్మూలించాలనే ప్రధానమంత్రి దార్శనికతకు మద్దతు ఇవ్వడంలో కీలకమైనదిగా భావిస్తున్నారు. -
చెన్నైలో రౌడీలకు చెక్ పెట్టేందుకు పోలీసులు మాస్టర్ ప్లాన్!
సాక్షి ప్రతినిధి, చెన్న: చెన్నై మహానగరంలో పెచ్చుమీరి పోతున్న రౌడీల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఎగస్ట్రాలు చేస్తే ఎన్‌కౌంటర్‌కూ వెనుకాడకూడని నిర్ణయించినట్లు సమాచారం. చెన్నై ప్రజలను వణికించిన అయోద్దికుప్పన్, వీరమణి సహా పలువురు బడా రౌడీలను తుపాకీ తూటాలతో పోలీసులు మట్టుబెట్టారు. ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతున్నా.. కొత్త రౌడీలు పుట్టగొడుగుల్లా పుట్టుకుని వస్తూనే ఉన్నారు. వారిని అణిచివేసే చర్యలు చేపట్టడం పోలీసులకు దిన చర్యగా మారింది. పిన్న వయసులోనే నేరాలకు పాల్పడుతూ చాలా మంది యువకులు రౌడీలుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్నారు. ఆ ఘటనతో అప్రమత్తం.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చెన్నై మడిపాక్కంలో డీఎంకే నేత సెల్వంను చుట్టుముట్టి కిరాతకంగా హతమార్చిన నిందితులంతా 20 ఏళ్లలోపు వారే కావడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనతో మరింత అప్రమత్తమైన ఖ>కీలు.. చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ ఆదేశాల మేరకు నగరంలోని వెయ్యిమందికి పైగా రౌడీల జాబితాను సిద్ధం చేశారు. వీరి నేర చరిత్రను బట్టి ఏ ప్లస్, ఏ, బీ, సీ లుగా విభజించారు. అంతేగాక అజ్ఞాతంలో ఉన్నవారు, ఇటీవలే జైలు నుంచి విడుదలైన రౌడీల జాబితా, వారి నేర చరిత్రపై పూర్తి వివరాలను సేకరించాలని సూచించారు. నేర ప్రవృత్తికి దూరంగా మెలుగుతూ జీవనం సాగించకుండా, పోలీస్ హెచ్చరికలను ఖాతరు చేయకుండా హద్దుమీరే వారిని ఎన్కౌంటర్ ద్వారా హతమార్చవచ్చని ఇన్స్పెక్టర్లకు పోలీస్ కమిషనర్ పూర్తి అధికారాలను ఇచ్చేసినట్లు విశ్వసనీయమైన సమాచారం. ఇందుకు సంబంధించి పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ, చెన్నై నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అత్యంత కఠినమైన చర్యలను అమలు చేయనున్నామని తెలిపారు. రౌడీల అణచివేతతోపాటూ, రౌడీలకు ఆశ్రయం ఇచ్చినా, నేరాలకు సహకరించినా, పారిపోయేందుకు తోడ్పడినా.. అలాంటి వారిపై కూడా చర్యలు తప్పవని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. సాధారణ, పేరొందిన రౌడీలతోపాటూ 325 మంది బడా దాదాలను కూడా గుర్తించామని అన్నారు. వీరంతా సమష్టిగా నేరాలకు పాల్పడుతూ గ్యాంగ్స్టర్లుగా చలామణి అవుతున్నట్లు నిర్ధారణ కావడంతో వీరిని ప్రత్యేక జాబితాలో చేర్చామని వివరించారు. -
తలసేమియా నివారణకు గ్లోబల్ అలయన్స్ కృషి
చికాగో: ప్రపంచం ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవం (డిసెంబర్ 1) సందర్భంగా.. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులను నివారించటం కోసం అమెరికాకు చెందిన గ్లోబల్ స్ట్రాటజిక్ అలయన్స్ సంస్థ అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. చికాగోలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్లోబల్ స్ట్రాటజిక్ అలయన్స్ చైర్మన్ డాక్టర్ విజయ్ ప్రభాకర్ మాట్లాడుతూ.. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధుల బారిన పడిన చిన్నారులకు చికిత్స అందించటం కోసం విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు. సికిల్‌సెల్ వ్యాధి రూపుమాపడానికి ‘ఎండ్‌తాల్‌నౌ’ పనిచేస్తోందని విజయ్ ప్రభాకర్ తెలిపారు. ‘ఎండ్‌తాల్‌నౌ’ అంటే తలసేమియాను అంతమొందించడమే అని ఆయన పేర్కొన్నారు. ఇక తలసేమియా వ్యాధిని నివారించడానికి సహదేవ్ పౌండేషన్ విరాళాలు సేకరించిందని ‘ఎండ్‌తాల్‌నౌ’ సహ వ్యవస్థాపకుడు ప్రదీప్ కండిమల్లా కొనియాడారు. తలసేమియా వ్యాధిని నివారించడానికి 10,000 మంది రక్త దానం చేశారని పేర్కొన్నారు. భారీ ఎత్తున రక్తదానం చేయటంతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు లభించిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ నర్మదా కుప్పుస్వామి మాట్లాడుతూ.. సికిల్ సెల్ వ్యాధిని అంతమొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తలసేమియా వ్యాధి బారిన పడిన చిన్నారులు పదేళ్లు కూడా బతకలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎమిరేట్స్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రకాశం టాటా మాట్లాడుతూ.. ‘ఎండ్‌తాల్‌నౌ’ చేస్తున్న సేవలను అభినందించారు. చిన్నారులను రక్షించడమే ‘ఎండ్‌తాల్‌నౌ’ లక్ష్యమన్నారు. ఇక గ్లోబల్ స్ట్రాటజిక్ అలయన్స్ (జీఎస్ఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ అజిత్ సింగ్ మాట్లాడుతూ.. జీఎస్ఏ ప్రతి ఏడాది డిసెంబర్ 1న తలసేమియా వ్యాధి నివారించడానికి ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సంగీత గాయకులు ప్రవీణ్ జలగామ, ఆయన తనయుడు శిశిర్ రాఘవ జలగామ తమ సంగీతం ద్వారా తలసేమియా వ్యాధి నివారించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కాగా ఈ కార్యక్రమాన్ని అశోక్ పగడాలా నిర్వహించగా.. స్వదేశ్ మీడియాకు చెందిన ఉగందర్ నగేష్, సాయి రవిసురుబొట్ల, చార్లెస్ రూటెన్‌బర్గ్ రియాల్టీ ఆఫ్ సొల్యూషన్స్, ప్రొఫెషనల్ మోర్ట్గేజ్ సొల్యూషన్స్, అశోక్ లక్ష్మణన్, సంతిగ్రమ్ కేరళ ఆయుర్వేద నేపర్‌విల్లే, డాక్టర్ సుద్దేశ్వర్ గుబ్బా, అనికా దుబేలు స్పాన్సర్లుగా వ్యవహరించారు. -
ఓట్ల తొలగింపుపై స్పష్టత ఇవ్వాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి గుంటూరు (నెహ్రూనగర్): తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిళ్ళ మేరకే గుంటూరు కార్పొరేషన్లో ఓట్లు తొలగించారని, ఓట్ల తొలగింపులో పారదర్శకత లోపించిందని, ఏ ప్రతిపాదికన ఓట్లు తొలగించారో స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి గుంటూరు నగర కమిషనర్ నాగలక్ష్మిని కోరారు. శుక్రవారం ఓట్ల తొలగింపుపై కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై సానూకూలంగా స్పందించిన కమిషనర్ ఓట్ల తొలగింపు విషయంలో పొరపాట్లు జరగకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి భయంతో వైఎస్సార్సీపీకి పట్టున్న ప్రాంతాల్లో ఓట్లు తొలగించారంటూ ధ్వజమెత్తారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు అన్నారు. గతంలో డీలిమిటేషన్ ప్రక్రియలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతను పక్కన పెట్టిన తరుణంలో జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అక్షింతలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. అధికార నేతలకు తలొగ్గి, వారి మెప్పుకోసం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే అధికారులపై కూడా న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. -
‘ఈ–కోలి’ నివారణకు చర్యలు
‘సాక్షి’ ఎఫెక్ట్ సీతానగరం (తాడేపల్లి రూరల్) : సీతానగరం వద్ద కృష్ణా నీటిలో ఈ–కోలి బ్యాక్టీరియా ఉన్నట్టు ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. పబ్లిక్ హెల్త్, పంచాయతీ రాజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రాత్రి పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాట్లు చేశారు. నది నుంచి లీడింగ్ కెనాల్‌కు నీరు వచ్చే ప్రాంతంలో క్లోరిన్ కలిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సీతానగరం ఒకటో నంబర్ ఘాట్‌లో క్లోరిన్ కలిపేందుకు అవసరమైన మోటార్లు, పైపుల ఏర్పాటుకు అధికారులు సన్నద్ధమయ్యారు. లీడింగ్ చానల్లో భక్తులు స్నానం ఆచరించేందుకు నీరు వదలగానే దానిలో క్లోరిన్ కలపనున్నట్టు తెలిపారు. -
పైలేరియా నిర్మూలనకు సహకరించాలి
సంగెం : పైలేరియా నిర్మూలనకు ప్రజలు సహకరించాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ పైలేరియా, నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం పైలేరియా నివారణ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 17 మండలాల్లో పైలేరియా వ్యాధి వ్యాపించిందన్నారు. 2013 నుంచి ప్రతి ఏటా నివారణ మాత్రలు అందజేస్తున్నామని చెప్పారు. వ్యాధి లేనివారికి కూడా ముందు జాగ్రత్తగా ఈ మాత్రలు వేయడం వల్ల 2020 నాటికి పూర్తిగా నివారించవచ్చన్నారు. గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, రెండేళ్లలోపు పిల్లలు ఈ మాత్రలు వేసుకోవద్దని సూచించారు. నులిపురుగుల నివారణ మాత్రలను పిల్లలకు తప్పనిసరిగా వేయించాలన్నారు. దీర్ఘకాలిక సెలవులో ఉన్న సంగెం ఆసుపత్రి డాక్టర్ మహేశ్‌ను సరెండర్ చేశామని, త్వరలో స్త్రీల వైద్యనిపుణురాలిని నియమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర గాదేమ్, లక్ష్మన్, సంజీవరెడ్డి, డీఎంఓ పైడిరాజ్, జోనల్ వైద్యాధికారి జయశ్రీ, వైద్యాధికారి డాక్టర్ సుధీర్‌బాబు ఎంటామాలజిస్ట్ రామ్మూర్తి, ఎంపీపీ బొమ్మల కట్టయ్య, సర్పంచ్ రాయపురం మల్లికాంబ, ఎంపీటీసీ సభ్యురాలు కందకట్ట కళావతి పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలనకు నిధులు
అభివృద్ధి చెందిన దేశాలకు భారత్ పిలుపు నైరోబీ: అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పేదరికాన్ని నిర్మూలించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ఉదారంగా మరిన్ని నిధులివ్వాలని పశ్చిమ దేశాలకు భారత్ పిలుపునిచ్చింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల తలసరి ఆదాయంలో భారీ వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో పేదరికాన్ని అంతమొందించేందుకు తొలుత నిర్దేశించుకున్న సాయంకన్నా అధికంగా నిధులివ్వాలని కోరింది. అప్పుడే 2015 తర్వాత అమలు చేసేందుకు నిర్దేశించుకున్న ఎజెండా కార్యరూపం దాలుస్తుందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఇక్కడ జరిగిన ఐక్యరాజ్య సమితి తొలి పర్యావరణ సదస్సులో భారత్ తరఫున హాజరైన కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రసంగించారు. అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే చేసిన వాగ్దానం మేరకు తమ స్థూల జాతీయాదాయంలో(జీఎన్ఐ) నిర్దేశిత శాతాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి సాయం కింద(ఓడీఏ) తక్షణమే ఇవ్వాల్సిన అవసరముందన్నారు. పేదరిక నిర్మూలన పథకాల అమలుకు సాయం చేసేందుకు ఆయా దేశాలు ముందుకు రావాలని కోరారు. ఇప్పటికే హామీ ఇచ్చిన 0.7% జీఎన్ఐ నిధులు సహా అదనపు నిధులు ఇవ్వాలన్నారు.