పైలేరియా నిర్మూలనకు సహకరించాలి
Published Thu, Aug 11 2016 12:22 AM | Last Updated on Sat, Mar 23 2019 7:54 PM
సంగెం : పైలేరియా నిర్మూలనకు ప్రజలు సహకరించాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ పైలేరియా, నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం పైలేరియా నివారణ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 17 మండలాల్లో పైలేరియా వ్యాధి వ్యాపించిందన్నారు. 2013 నుంచి ప్రతి ఏటా నివారణ మాత్రలు అందజేస్తున్నామని చెప్పారు. వ్యాధి లేనివారికి కూడా ముందు జాగ్రత్తగా ఈ మాత్రలు వేయడం వల్ల 2020 నాటికి పూర్తిగా నివారించవచ్చన్నారు. గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, రెండేళ్లలోపు పిల్లలు ఈ మాత్రలు వేసుకోవద్దని సూచించారు. నులిపురుగుల నివారణ మాత్రలను పిల్లలకు తప్పనిసరిగా వేయించాలన్నారు. దీర్ఘకాలిక సెలవులో ఉన్న సంగెం ఆసుపత్రి డాక్టర్ మహేశ్‌ను సరెండర్ చేశామని, త్వరలో స్త్రీల వైద్యనిపుణురాలిని నియమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర గాదేమ్, లక్ష్మన్, సంజీవరెడ్డి, డీఎంఓ పైడిరాజ్, జోనల్ వైద్యాధికారి జయశ్రీ, వైద్యాధికారి డాక్టర్ సుధీర్‌బాబు ఎంటామాలజిస్ట్ రామ్మూర్తి, ఎంపీపీ బొమ్మల కట్టయ్య, సర్పంచ్ రాయపురం మల్లికాంబ, ఎంపీటీసీ సభ్యురాలు కందకట్ట కళావతి పాల్గొన్నారు.
Advertisement