supported
-
వాళ్లకు సారీ చెప్పారా? వీళ్లతో థ్యాంక్యూ అన్నారా?
365 రోజులు... జీవితమనే అంతులేని ప్రయాణంలో 2023వ సంవత్సరం ఈ 365 రోజులు మనకెన్నో జ్ఞాపకాలు, అనుభవాలు, సంతోషాలు, సవాళ్లు ఇచ్చి ఉంటుంది. ఈ ప్రయాణం మనం ఒక్కరమేచేయగలమా? ఎందరో సాయం చేసి ఉంటారు. వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్యూ చెప్పామో లేదో. ఇప్పుడు చెబుదామా. కొందరిని తెలిసో తెలియకో హర్ట్ చేసి ఉంటాం. ఎంత బాధ పడ్డారో ఏమో.. సారీ చెబుదామా. పాత సంవత్సరం అకౌంట్లు సెటిల్ చేసుకొని కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదామా? ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉంటాయి. ఎవరినో సలహా అడిగి ఉంటాం. హాస్పిటల్‌కు తోడు రమ్మని చెప్పి ఉంటాం. అప్పు అడిగి ఉంటాం. వారు ఇచ్చి ఉంటారు. ఆ హడావిడిలో వారికి సరైన థ్యాంక్యూ చెప్పి ఉండం. పట్టించుకోరులే అనుకుంటాం. కాని పట్టించుకుంటారు. మనకు ఈ సంవత్సరం ఇంత సాయం చేసిన వారికి ఈ సంవత్సరాంతంలో కాల్ చేసి, లేదా ఇంటికి వెళ్లి, ఈ సంవత్సరం ఫలానా టైమ్‌లో మీరు నాకు ఈ సాయం చేశారు... థ్యాంక్యూ అని చెప్పి చూడండి... వాళ్ల కళ్లల్లో నీళ్లు చిప్పిల్లుతాయి... మీ కళ్లల్లో కూడా. చెబుదామా? సాయం చేసిన వాళ్లు అవతలి వారి నుంచి కృతజ్ఞతను ఆశించరు కానీ అలాగని కృతజ్ఞత తెలియచేయడం కనీస బాధ్యత కదా! అసలు మేలు చేస్తేనే థ్యాంక్యూ చెప్పాలా? మీ ఇరుగున ఒక ఇల్లు, పొరుగున ఒక ఇల్లు ఉంటుంది. వారితో ఏ తగాదా గొడవా లేకుండానే హ్యాపీగా ఈ సంవత్సరం గడిచిపోయింది. వాళ్లను పలకరించి ‘ఈ సంవత్సరమంతా మనం స్నేహంగా ఉన్నాం. అందుకు థ్యాంక్యూ. వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ఉందాం’ అని చిన్న స్వీట్ ఇచ్చి చూడండి. ఆ మేజిక్ ఎలా ఉంటుందో. మీ ఆఫీస్‌లో కలీగ్స్‌తో ‘థ్యాంక్యూ... ఈ సంవత్సరమంతా మనం కలిసి మెలిసి పని చేసినందుకు’ అని టీకి పిలవండి... అదీ చిన్న మేజిక్ కాదు. ఒక సంవత్సరం దాటి వచ్చినందుకు ఎందరికో కృతజ్ఞత ప్రకటించాలి. తల్లిదండ్రులకు, తోడ బుట్టిన వారికి, మిత్రులకు... వీరున్నారనే ధైర్యం వల్లే కదా... ప్రతి రోజునూ చులాగ్గా దాటాం. వీరికి థ్యాంక్స్ చెప్పండి: ఈ సంవత్సరమంతా మనకు ఇంటి సాయం చేసిన పని మనిషికి, కారు డ్రైవర్‌కు, ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసిచ్చిన ఏజెంట్‌కు, పిల్లలకు ట్యూషన్ చెప్పిన టీచర్‌కు, అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌కు, ఫ్యామిలీ డాక్టర్‌కు... డబ్బు చెల్లించే పని చేయించుకుని ఉండొచ్చు. డబ్బు ఇచ్చినా అలాంటి పని చేసేవారు దొరకనప్పుడు తెలుస్తుంది వారి విలువ. అందుకే థ్యాంక్స్ చెప్పండి. బాగుంటుంది. ఇక మీకు సపోర్ట్‌గా నిలిచిన స్నేహితులకు కాల్ చేసి, వారు ఏ సందర్భంలో ఎంత సపోర్ట్ చేశారో చెప్పి థ్యాంక్స్ చెప్పండి. ఊళ్లో ఉన్న అమ్మా నాన్నలను ఎవరో ఒక పక్కింటి పిన్ని పలకరించి బాగోగులు గమనిస్తుంటుంది. ఆమెకు థ్యాంక్స్ చెప్పండి. మన పిల్లలను రోజూ ఆటకు పిలిచి వారితో స్నేహంగా ఆడుతున్న పిల్లలకూ థ్యాంక్స్ చెప్పండి. వారు ఇంకా విలువైన వారు. అన్నింటికి మించి మన పట్ల కనికరంగా ఉన్న ప్రకృతికి. కరుణతో ఉన్న రుతువులకి, తిన్న ప్రతి అన్నం ముద్దకి, మీరు విశ్వసించే ఈశ్వరునికి థ్యాంక్స్ చెప్పండి. వీరితో సారీ చెప్పండి: ఈ సంవత్సరం రెండు మూడుసార్లు కూడా వెళ్లి చూడటం కుదరని తల్లిదండ్రులకు, తోబుట్టువులకు, అన్నదమ్ములకు... ‘సారీ.. మీరంటే ఎంతో ప్రేమ... కాని కలవడం కుదరలేదు’ అని చెప్పండి. మనసు తేలిక అవుతుంది. ఎందరో స్నేహితులు, బంధువులు శుభకార్యాలకు పిలిచి ఉంటారు. వెళ్లి ఉండరు. వారికి పనిగట్టుకుని ఫోన్ చేసి సారీ చెప్పండి. ఇకపై తప్పక వస్తామని చెప్పండి. బాగా ఆత్మీయులు కొందరు స్వర్గస్తులై ఉంటారు. ఏదో కారణాన వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ఉండరు. ఇప్పుడు ఫోన్ చేసి వీలైతే కలిసి సహేతుకమైన కారణం చెప్పి సారీ చెప్పండి. కొందరు మీరు చేయదగ్గ సాయం అడిగినా మీరు నిర్లక్ష్యంతో చేసి ఉండరు. వారు బాధ పడిన విషయం కూడా మీకు తెలిసి ఉండదు. గుర్తు తెచ్చుకుని సారీ చెప్పండి. ఎవరికో ఏవో వాగ్దానాలు చేసి తప్పి ఉంటారు. సారీ చెప్పండి. భార్య భర్తను బాధించిన సందర్భాలకు, భర్త భార్యను కష్టపెట్టిన సందర్భాలకు తప్పక ఒకరికొకరు సారీ చెప్పాలి. పిల్లల్ని చిన్నబుచ్చిన సందర్భాలకు కూడా వారికి సారీ చెప్పాలి. చేజారిన బంధాలు, స్నేహాలు... పలచబడిన బాంధవ్యాలు కేవలం ‘థ్యాంక్యూ’, ‘సారీ’ అనే రెండు పదాలతో తిరిగి అతుక్కుంటాయి. రెండు మూడు రోజులు టైమ్ ఉంది. తెమిలి కూచుని ఇతరుల ఒప్పులను, మీ తప్పులను లిస్ట్ చేసుకుని ఎవరికి ఏం చెప్పాలో అది చెప్పి కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా మొదలెట్టండి. -
ద్రావిడ్ కు అండగా అశ్విన్.. రవిశాస్త్రి వ్యాఖ్యలకు కౌంటర్
-
పన్నీర్ సెల్వంకు పెరుగుతున్న మద్దతు
-
పైలేరియా నిర్మూలనకు సహకరించాలి
సంగెం : పైలేరియా నిర్మూలనకు ప్రజలు సహకరించాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ పైలేరియా, నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం పైలేరియా నివారణ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 17 మండలాల్లో పైలేరియా వ్యాధి వ్యాపించిందన్నారు. 2013 నుంచి ప్రతి ఏటా నివారణ మాత్రలు అందజేస్తున్నామని చెప్పారు. వ్యాధి లేనివారికి కూడా ముందు జాగ్రత్తగా ఈ మాత్రలు వేయడం వల్ల 2020 నాటికి పూర్తిగా నివారించవచ్చన్నారు. గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, రెండేళ్లలోపు పిల్లలు ఈ మాత్రలు వేసుకోవద్దని సూచించారు. నులిపురుగుల నివారణ మాత్రలను పిల్లలకు తప్పనిసరిగా వేయించాలన్నారు. దీర్ఘకాలిక సెలవులో ఉన్న సంగెం ఆసుపత్రి డాక్టర్ మహేశ్‌ను సరెండర్ చేశామని, త్వరలో స్త్రీల వైద్యనిపుణురాలిని నియమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర గాదేమ్, లక్ష్మన్, సంజీవరెడ్డి, డీఎంఓ పైడిరాజ్, జోనల్ వైద్యాధికారి జయశ్రీ, వైద్యాధికారి డాక్టర్ సుధీర్‌బాబు ఎంటామాలజిస్ట్ రామ్మూర్తి, ఎంపీపీ బొమ్మల కట్టయ్య, సర్పంచ్ రాయపురం మల్లికాంబ, ఎంపీటీసీ సభ్యురాలు కందకట్ట కళావతి పాల్గొన్నారు. -
అధికార పార్టీ అండ ఉంటే..
బొబ్బిలి రూరల్: నాయకుడి అండ ఉండి..మనోడు అని నాయకుడు భావిస్తే ఎలాంటి నిబంధనలూ వర్తించవు. ఈ క్రమంలోనే అవినీతి ఆరోపణలున్న ఉపాధిహామీ పథకం ఫీల్డు అసిస్టెంట్‌ను పునర్నియమించారు. మండలంలోని కోమటపల్లిలో వడ్డివెంకటరమణ అనే గ్రామీణఉపాధిహామీ పథకం ఫీల్డు అసిస్టెంట్ గతంలోఅనేక అవకతవకలకు పాల్పడ్డాడు. కోమటపల్లి-లింగంవలస పంచాయతీరాజ్ రోడ్డు పనుల్లో ఇతరుల పేరిట బిల్లులు స్వాహాచేశారనే ఆరోపణలతో 2014 మార్చి 4న విధుల్లో నుంచి తొల గించారు. టీడీపీ అధికారంలోకి రాగానే వెంకట రమణ తన ప్రయత్నాలను ప్రారంభించారు. చోటామోటా నాయకులను పట్టుకుని తన పని సాధించాడు. మళ్లీ తన ఉద్యోగం పొందాడు. ఈ ఏడాది ఆగస్టు 6న వెంకటరమణ రూ.7,500 అపరాధ రుసుము చెల్లించినందున ఆతనిని తిరిగి నియమిస్తున్నట్లు డ్వామా పీడీ గోవిందరాజులు నుంచి ఈనెల 10వతేదీన ఏపీఓ కె.కేశవరావుకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు సోమవారం నుంచి వెంకటరమణ విధుల్లో చేరారు. ఒక్కొక్కరికి ఒక్కోరూలా? సోషల్ ఆడిట్లో రూ.3,600 స్కాం రుజువైందని రంగరాయపురం ఫీల్డు అసిస్టెంట్ గేదెల శ్రీనివాసరావును ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలగించారు. నిజానికి సోషల్ ఆడిట్లో ఆరోపణలు వస్తే రికవరీ చేసి నిబంధనల మేరకు కొనసాగిస్తారు. అయితే శ్రీనివాసరావు సోదరుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నందునే కక్షసాధింపుగా ప్రభుత్వం తొలగించిందని, కోమట పల్లి ఫీల్డు అసిస్టెంట్‌కు ఒక రూలు రంగరాయపురం ఫీల్డ్ అసిస్టెంట్‌కు మరో రూలా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సర్కారుకు అండ!
ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు బుధవారం హైకోర్టులో చుక్కెదురైంది. ప్రైవేటు నర్సింగ్ కళాశాలల్లో శిక్షణ పొందిన విద్యార్థినులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు కల్పించవచ్చన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు హైకోర్టు మద్దతు ఇచ్చింది. ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థినుల పిటిషన్లు విచారణ యోగ్యం కాదంటూ తిరస్కరించింది.సాక్షి, చెన్నై: ప్రైవేటు నర్సింగ్ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలకు అర్హులుగా గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల్లో ఆగ్రహాన్ని రేపింది. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు కల్పించాలన్న నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూ వచ్చాయి. ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో చదువుకుని, శిక్షణ పొందిన వారికి ప్రభుత్వాస్పత్రుల్లో ఉద్యోగాలు కల్పించకుండా ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించాలని ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థినులు కోర్టును ఆశ్రయించారు. గత వారం తీర్పు వెలువడాల్సి ఉండగా, వాయిదా పడింది. దీంతో ఆవేదనకు లోనైన విద్యార్థినులు హైకోర్టు పైకి ఎక్కి ఆత్మాహత్యాయత్నం చేశారు. ఎట్టకేలకు విచారణ ముగియడంతో బుధవారం తీర్పు వెలువడింది. సర్కారుకు అండ: న్యాయమూర్తులు పాల్ వసంతకుమార్, సత్యనారాయణన్ల నేతృత్వంలోని బెంచ్ మధ్యాహ్నం తీర్పు వెలువరించింది. ప్రభుత్వ నర్సింగ్ క ళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినుల వాదనలను కోర్టు తోసి పుచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు అర్హత, ప్రతిభ ఉన్నవారందరూ ఉపయోగించుకోవచ్చని, పలానా వాళ్లకు ఇవ్వాలి, ఇవ్వకూడదన్న ఆంక్షలేమీ లేవన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థిస్తున్నామని, ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థినుల పిటిషన్లను తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. దీంతో ఆ విద్యార్థినులకు చుక్కెదురైనట్టు అయింది. తమకు సైతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సింగ్ ఉద్యోగాలు లభించనుండడంతో ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుంటూ, శిక్షణ పొందుతున్న విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ నర్సింగ్ విద్యార్ధినులు తదుపరి కార్యచరణకు సిద్ధం అవుతున్నారు. -
విభజనకు సహకరించడం సిగ్గుచేటు
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్:పజాకాంక్షను పట్టించుకోని సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు రాష్ట్ర విభజనకు సహకరించడం సిగ్గుచేటని సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శ్యామ్యూల్ విమర్శించారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో ప్రతినిధులు స్థానిక హిందూ కళాశాల సెంటర్లోని రాజకీయ జేఏసీ వేదికపై ఆదివారం రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా లయన్స్‌క్లబ్ సభ్యులకు సంఘీభావం పలికిన ఆచార్య శ్యామ్యూల్ మాట్లాడుతూ కేంద్ర మంత్రులు, ఎంపీలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడి ఓట్లేసి గెలిపించిన ప్రజలను నమ్మించి మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ విభజనకు వ్యతిరేకంగా పోరాడని ప్రజా ప్రతినిధులు, ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజాభీష్టంతో పనిలేకుండా అధికారం అనుభవించేందుకు సిగ్గు పడకపోవడం స్వార్ధ రాజకీయాలకు నిదర్శనమన్నారు. రిలే దీక్షలో కూర్చున్న లయన్స్ క్లబ్ సభ్యులు బాలస్వామి, లూకా, కేవీ నగేష్, రూప చంద్రరావు, ఈవీ ఫణికిషోర్, సీహెచ్ కృష్ణ ప్రసాద్, కోటేశ్వరరావు, డి.అప్పారావు, వాసిరెడ్డి కృష్ణమూర్తికి సమైక్యాంధ్ర జేఏసీ గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు, గ్రంధి పార్ధసారధి, వణుకూరి సరోజ, లింగాల సాయియాదవ్ సంఘీభావం తెలిపారు.