
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి ఎంతో ఖరీదు చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 256 గ్రాముల మల్టీపుల్ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. డ్రగ్స్ విలువ దాదాపు కోటీ పది లక్షలపైనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.

కాగా, డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్న పక్కా సమాచారంతో హైదరాబాద్ సిటీ పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో వివిధ రకాల డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. దాడుల్లో భాగంగా 256 గ్రాముల మల్టీ పుల్ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, ఇంటర్ స్టేట్ డ్రగ్స్ సప్లయర్‌తో పాటు డ్రగ్ డెలివరీ బాయ్‌ను అరెస్టు చేశారు. ఇక, పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపు కోటీ పది లక్షలకుపైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment