కుటుంబసభ్యులే గూఢచారులు! | Phone calls to TG NAB on drug affected children | Sakshi
Sakshi News home page

కుటుంబసభ్యులే గూఢచారులు!

Published Wed, Oct 16 2024 3:49 AM | Last Updated on Wed, Oct 16 2024 3:49 AM

Phone calls to TG NAB on drug affected children

టీజీ న్యాబ్‌కు డ్రగ్స్‌ బాధిత పిల్లలపై ఫోన్‌కాల్స్‌  

వారి ప్రవర్తన, కదలికలపై పోలీసులకు సమాచారం 

దీంతో వారిపై నిఘా పెట్టి పెడ్లర్ల పనిపడుతున్న ఖాకీలు 

హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్న ఓ యువకుడు డ్రగ్స్‌కు బానిసయ్యాడు. మత్తు ఇంజక్షన్‌ కావాలని రోజుకు రూ.500 ఇవ్వాలంటూ తల్లిదండ్రులను వేధించేవాడు. ఎన్నిసార్లు వద్దని వారించినా వినిపించుకోకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాడు.చివరకు ఆ యువకుడి తల్లిదండ్రులు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.

దీంతో యువకుడ్ని అదుపులోకి తీసుకొని పోలీసులువిచారించగా, ఈ మత్తుఇంజక్షన్లను బిహార్‌ నుంచికొరియర్‌ ద్వారా తెప్పించుకుంటున్నట్టు చెప్పాడు. లావాదేవీలు, కొరియర్‌లపై నిఘా పెట్టినపోలీసులు ఆ నెట్‌వర్క్‌నుబ్రేక్‌ చేసి స్థానిక పోలీసులకుఅప్పగించారు.  

సాక్షి, హైదరాబాద్‌: మాదక ద్రవ్యాల నుంచి తమ పిల్లలను రక్షించేందుకు తల్లిదండ్రులు తపన పడుతున్నారు. కుటుంబసభ్యులే పోలీసులకు గూఢచారులుగా మారుతున్నారు. మాదక ద్రవ్యాల బాధిత కుటుంబసభ్యులను విశ్వసిస్తున్న పోలీసులు, వారి సమాచారంపై నిఘా పెట్టి డ్రగ్స్‌ పెడ్లర్లు, నెట్‌వర్క్‌ల ఆట కట్టిస్తున్నారు. 

డీ–అడిక్షన్‌ సెంటర్లకు.. 
మత్తు మహమ్మారి నుంచి తమ పిల్లలను బయటపడేసి, వారిని మాములు మనుషులుగా మార్చాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్న తమ పిల్లలు ఉజ్వల భవిష్యత్‌ నాశనం చేసుకోవడమే కాకుండా నిత్యం తల్లిదండ్రులకు ఇంట్లో నరకం చూపిస్తున్నారు. గత నెల రోజుల్లో 20కు పైగా కుటుంబసభ్యులు తమ పిల్లల ప్రవర్తన గురించి తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో (టీజీ న్యాబ్‌)కు సమాచారం అందించారు. 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, వారికి మాదక ద్రవ్యాల గుర్తింపు కిట్స్‌ ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొంతమంది దగ్గర డ్రగ్స్, గంజాయి దొరకగా.. మరికొందరిలో డ్రగ్స్‌ తీసుకున్నట్టు పరీక్షల్లో తేలింది. మత్తుపదార్థాలు దొరికిన వారికి వినియోగదారుల కింద కేసులు నమోదు చేసి వారిని డీ–అడిక్షన్‌ కేంద్రాలకు పంపించారు. ఇలా కుటుంబ సభ్యుల నుంచి రోజుకు 3–5 కాల్స్‌ వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. 

సోషల్‌ మీడియాలో ప్రచారం.. 
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు డ్రగ్స్‌ నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలను తరిమికొట్టాలని ఇటీవల ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో సినీ హీరోలు, సెలబ్రిటీలతో లఘు చిత్రాలు చిత్రీకరించారు. జూనియర్‌ ఎనీ్టఆర్‌ రిలీజ్‌ చేసిన ఓ వీడియోకు ఒక్క రోజే 3.75 లక్షలు, మెగాస్టార్‌ చిరంజీవి వీడియోకు లక్షల్లో వ్యూస్‌ రావడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement