Asaduddin Owaisi Meets His Fan While Bike Ride in Banjara Hills, Photo Viral - Sakshi
Sakshi News home page

ముందు బైక్‌... వెనకాల కాన్వాయ్‌.. అభిమానిని చూసి ఆగిన ఎంపీ

Published Wed, Nov 2 2022 1:59 PM | Last Updated on Wed, Nov 2 2022 3:44 PM

Asaduddin Owaisi Meets His Fan While Bike Ride in Banjara Hills - Sakshi

అభిమానిని పలకరిస్తున్న అసదుద్దీన్‌ ఒవైసీ

సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ మంగళవారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12 మీదుగా బైక్‌పై వెళుతుండగా రోడ్డు పక్క నుంచి ఎన్బీటీ నగర్‌ బస్తీకి చెందిన అభిమాని కనిపించాడు. దీంతో వెనుకాల కాన్వాయ్‌తో పాటు తన బైక్‌ను కూడా రోడ్డు పక్కన ఆపి అతడిని పలకరించారు. 


బైక్‌పై దూసుకెళ్తున్న అసదుద్దీన్‌ ఒవైసీ ఒక్కసారిగా బుల్లెట్‌ బండి దిగి రోడ్డుపై వెళుతున్న ఎన్బీటీ నగర్‌కు చెందిన శివకుమార్‌ను గుర్తు పట్టిన అసద్‌ ఆగడమే కాకుండా కుశలప్రశ్నలు వేశారు. అతడి తండ్రి ఒవైసీ పోటీ చేసినప్పుడు తాను బూత్‌ ఏజెంట్‌గా ఉండేవాడినని ఈ సందర్భంగా శివకుమార్‌ గుర్తు చేసుకున్నారు. స్వయంగా అసద్‌ బుల్లెట్‌ దిగి తనను పలకరించడంపట్ల శివకుమార్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ దృశ్యాన్ని అక్కడున్న వారంతా తమ సెల్‌ఫోన్లలో బంధించారు. (క్లిక్ చేయండి: ఫోర్జరీ కేసులో టీటీడీపీ ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు అరెస్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement