ఆరడుగుల త్రాచు.. అలవోకగా పట్టేశారు..  | Hyderabad: Retired IAS officer Caught Long Rattlesnake | Sakshi
Sakshi News home page

ఆరడుగుల త్రాచు.. అలవోకగా పట్టేశారు.. 

Published Sat, Oct 15 2022 1:37 AM | Last Updated on Sat, Oct 15 2022 1:37 AM

Hyderabad: Retired IAS officer Caught Long Rattlesnake - Sakshi

బంజారాహిల్స్‌:  ఒక రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఇంట్లో చొరబడ్డ ఆరడుగుల పొడవైన త్రాచుపామును మరో విశ్రాంత ఐపీఎస్‌ అధికారి చాకచక్యంగా బంధించారు. దాన్ని సురక్షితంగా అటవీ శాఖాధికారులకు అప్పగించారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌రోడ్‌ నెం.72లోని ప్రశాసన్‌నగర్‌లో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ప్రశాసన్‌నగర్‌లోని ప్లాట్‌నెంబర్‌ 199లో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కృష్ణయ్య నివాసం ఉంటున్నారు.

ఇంట్లోని వాటర్‌ట్యాంక్‌ వద్ద సుమారు ఆరడగుల పొడవున్న త్రాచుపాము శుక్రవారం ఉదయం కనిపించింది. దీంతో కృష్ణయ్య కుటుంబం అదే కాలనీలో ఉంటున్న రిటైర్డ్‌ డీజీపీ రాజీవ్‌ త్రివేదికి సమాచారం అందించింది. రాజీవ్‌ త్రివేది... పామును నేర్పుతో ఓ బ్యాగులో బంధించారు. అటవీశాఖ అధికారులకు అప్పగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement