Rattle Snake
-
ఆరడుగుల త్రాచు.. అలవోకగా పట్టేశారు..
బంజారాహిల్స్: ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో చొరబడ్డ ఆరడుగుల పొడవైన త్రాచుపామును మరో విశ్రాంత ఐపీఎస్ అధికారి చాకచక్యంగా బంధించారు. దాన్ని సురక్షితంగా అటవీ శాఖాధికారులకు అప్పగించారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌రోడ్ నెం.72లోని ప్రశాసన్‌నగర్‌లో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ప్రశాసన్‌నగర్‌లోని ప్లాట్‌నెంబర్ 199లో విశ్రాంత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య నివాసం ఉంటున్నారు. ఇంట్లోని వాటర్‌ట్యాంక్ వద్ద సుమారు ఆరడగుల పొడవున్న త్రాచుపాము శుక్రవారం ఉదయం కనిపించింది. దీంతో కృష్ణయ్య కుటుంబం అదే కాలనీలో ఉంటున్న రిటైర్డ్ డీజీపీ రాజీవ్ త్రివేదికి సమాచారం అందించింది. రాజీవ్ త్రివేది... పామును నేర్పుతో ఓ బ్యాగులో బంధించారు. అటవీశాఖ అధికారులకు అప్పగించారు. -
జాతీయ రహదారిపై త్రాచు పాము హల్చల్..
-
జాతీయ రహదారిపై త్రాచు పాము హల్చల్..
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని మామిడికుదురు మండలం పాశర్లపూడి సెంటర్లో ఓ పాము హల్చల్ చేసింది. జాతీయ రహదారి 216పై వచ్చిన త్రాచు పాము సుమారు గంటపాటు కదలకుండా అలాగే ఉండిపోయింది. దీనిని చూసేందుకు జనాలు అధిక సంఖ్యలో గుమిగూడారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయ ఏర్పడింది. అనంతరం స్థానికులు కొట్టి చంపడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. (భయంకరమైన పామును ఎలా పట్టుకున్నారో చూడండి!) -
ఒకేచోట 45 రాటిల్ స్నేక్స్
-
‘ఇంటిని తగలబెట్టండి.. మీకు చాలా ధైర్యం ఉంది’
ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన పాముల్లో రాటిల్ స్నేక్ ఒకటి. దాన్ని చూడగానే గుండె గుభేలుమంటుంది. అలాంటిది ఒకటి కాదు, రెండు ఏకంగా 45 రాటిల్ స్నేక్స్‌ను ఒకే చోట చూస్తే.. ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ధైర్యం లేని వారైతే హార్ట్ ఎటాక్ వచ్చి పోయినా పోతారు. కానీ సదరు ఇంటి యజమాని మాత్రం ముందు భయపడ్డా.. ఆ తర్వాత తేరుకుని పాములు పట్టే కంపెనీకి సమాచారం అందించాడు. వారు వచ్చి ఆ పాములను జాగ్రత్తగా సురక్షితమైన చోటుకు చేర్చారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగింది సంఘటన. పేరు వెల్లడించడానికి ఇష్టపడని సదరు ఇంటి యజమాని మాట్లాడుతూ.. ‘మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికి వచ్చాను. బయట కేబుల్ మీద ఓ చిన్న రాటిల్ స్నేక్ కనిపించింది. దాంతో అక్కడకు వెళ్లి చూడగా దాదాపు 45 వరకూ రాటిల్ స్నేక్లున్నాయి. ఒక్కసారిగా అన్ని పాములను చూడ్డంతో చాలా భయమేసింది. కానీ ఎలాగొలా ధైర్యం కూడగట్టుకుని పాములు పట్టే సంస్థకు సమాచారం అందించాన’ని తెలిపారు. అంతేకాక దీనికి సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ‘మీ ఇంటిని తగలబెట్టండి.. మీరు చాలా ధైర్యవంతులు.. ఇది చూసి చాలా ఆందోళనకు గురయ్యాం’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
శరీరాన్ని రెండు ముక్కలు చేసినా వదల్లేదు
టెక్సాస్ : పాము పగబడితే పగతీర్చుకునే వరకు వదిలి పెట్టదంటారు. మరి అది నిజమో కాదో తెలియదు కాని అచ్చం అలాంటి ఘటనే టెక్సాస్ నగరంలో చోటుచేసుకుంది. శరీరాన్ని రెండు ముక్కలుగా నరికినా వేరుపడిన తలతోనే వ్యక్తిని కాటేసిందో పాము. పాము కాటుకు గురైన ఆ వ్యక్తి చావుతో పోరాడి వైద్యుల పుణ్యమా అని బతికి బట్ట కట్టాడు. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్ నగరానికి చెందిన మీలో, జెన్నీఫర్‌లు భార్యాభర్తలు. వాళ్లిద్దరూ ఇంటి పెరట్లో పని చేసుకుంటుండగా జెన్నీఫర్‌కు రాటిల్ స్నేక్ కంటపడింది. పామును చూసి భయపడ్డ ఆమె చేతిలో ఉన్న కత్తితో పామును రెండు ముక్కలుగా నరికింది. తర్వాత ఆ విషయాన్ని భర్త మీలోకి చెప్పింది. ముక్కలుగా నరికిన పాము చచ్చిందనుకున్న మీలో దాన్ని పడేయడానికి చేత్తో వేరుపడిన తల భాగాన్ని పట్టుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న రాటిల్ స్నేక్ అమాంతం అతని చేతిపై కాటు వేసింది. దీంతో అస్వస్థతకు గురైన మీలోను జెన్నీఫర్ ఆస్పత్రికి తరలించింది. అప్పటికే విషం శరీరం మొత్తం వ్యాపించటంతో అతన్ని బతికించటానికి వైద్యులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జెన్నీఫర్ మాట్లాడుతూ.. ‘‘మామూలుగా పాము కాటుకు గురైన వ్యక్తికి రెండు నుంచి మూడు డోసుల యాంటీ వీనమ్ ఇస్తారు. కానీ మీలోకు మాత్రం ఏకంగా 26 డోసులు ఇవ్వాల్సి వచ్చింది. ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నప్పటికీ కిడ్నీల పనితీరు కొద్దిగా బాగోలేద’’ని తెలిపింది. -
ఇలాంటి పోరు చూసి ఉండరు.. వైరల్
పాము, ముంగిసల పోరు గురించి తరచుగా వింటుంటాం. కానీ అందుకు భిన్నంగా పాము, ఓ పిల్లి ప్రత్యర్థులుగా మారి తమ ప్రాణాల కోసం పోరాడటం గురించి విన్నారా. అమెరికాలోని అరిజోనాలో సరిగ్గా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ లారా లక్కీ ఇటీవల ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియోను దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. భారీ సంఖ్యలో లైక్స్, షేర్లతో సోషల్ మీడియాలో రాటల్ స్నేక్, బాబ్ క్యాట్ (ఉత్తర అమెరికాలో ఓ రకం పిల్లి) భీకర పోరాటం వీడియో వైరల్ అవుతోంది. కాలిఫోర్నియాకు చెందిన లారీ లక్కీ దంపతులు అరిజోనాలోని స్కాట్స్‌డేల్ ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్నారు. మార్గం మధ్యలో వారికి ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. పాము, పిల్లి పోరాడుతున్నాయి. కొంతసేపు గమనించిన అనంతరం ఈ తతంగాన్ని వీడియో తీశారు. తొలుత పాము ఆ పిల్లి నుంచి తన ప్రాణాలు కాపాడుకునేందుకు కాటేయాలని చూసింది. కానీ తగ్గినట్లే కనిపించిన పిల్లి ఎట్టకేలకు పాముపై పట్టు దక్కించుకుంది. ఆ పిల్లి, పామును నోటకరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇలాంటి పోరు ఎక్కడా చూసి ఉండరంటూ లారీ లక్కీ తన ఫేస్బుక్లో పోస్ట్ చేయగా వీడియో వైరల్ అవుతోంది. -
పాము, ముంగిసల పోరు చూశాం కానీ..