ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన పాముల్లో రాటిల్ స్నేక్ ఒకటి. దాన్ని చూడగానే గుండె గుభేలుమంటుంది. అలాంటిది ఒకటి కాదు, రెండు ఏకంగా 45 రాటిల్ స్నేక్స్‌ను ఒకే చోట చూస్తే.. ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ధైర్యం లేని వారైతే హార్ట్ ఎటాక్ వచ్చి పోయినా పోతారు. కానీ సదరు ఇంటి యజమాని మాత్రం ముందు భయపడ్డా.. ఆ తర్వాత తేరుకుని పాములు పట్టే కంపెనీకి సమాచారం అందించాడు. వారు వచ్చి ఆ పాములను జాగ్రత్తగా సురక్షితమైన చోటుకు చేర్చారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగింది సంఘటన.
పేరు వెల్లడించడానికి ఇష్టపడని సదరు ఇంటి యజమాని మాట్లాడుతూ.. ‘మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికి వచ్చాను. బయట కేబుల్ మీద ఓ చిన్న రాటిల్ స్నేక్ కనిపించింది. దాంతో అక్కడకు వెళ్లి చూడగా దాదాపు 45 వరకూ రాటిల్ స్నేక్‌లున్నాయి. ఒక్కసారిగా అన్ని పాములను చూడ్డంతో చాలా భయమేసింది. కానీ ఎలాగొలా ధైర్యం కూడగట్టుకుని పాములు పట్టే సంస్థకు సమాచారం అందించాన’ని తెలిపారు. అంతేకాక దీనికి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో అప్లోడ్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ‘మీ ఇంటిని తగలబెట్టండి.. మీరు చాలా ధైర్యవంతులు.. ఇది చూసి చాలా ఆందోళనకు గురయ్యాం’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment