ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన పాముల్లో రాటిల్ స్నేక్ ఒకటి. దాన్ని చూడగానే గుండె గుభేలుమంటుంది. అలాంటిది ఒకటి కాదు, రెండు ఏకంగా 45 రాటిల్ స్నేక్స్‌ను ఒకే చోట చూస్తే.. ఆ మనిసి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ధైర్యం లేని వారైతే హార్ట్ ఎటాక్ వచ్చి పోయినా పోతారు. కానీ సదరు ఇంటి యజమాని మాత్రం ముందు భయపడ్డా.. ఆ తర్వాత తెరుకుని పాములు పట్టే కంపెనీకి సమాచారం అందించాడు. వారు వచ్చి ఆ పాములను జాగ్రత్తగా సురక్షితమైన చోటుకు చేర్చారు.