హైదరాబాద్: తనపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తున్న భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీ సులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... బీహార్‌కు చెందిన సందీప్ కుమార్ ఝా తెలంగాణ కేడర్‌లో ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్నారు.
అతడికి 2021 నవంబర్ 21న పల్లవి ఝాతో వివాహం జరిగింది. పెళ్ళి తర్వాత బంజారాహిల్స్‌లోని తన నివాసంలో 25 రోజులు మాత్రమే కాపురం చేసిన ఆమె తనతో పాటు కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేదన్నారు. అంతేగాక ఆమె సోదరుడు తన ఇంట్లో రూ. 65 వేలు తస్కరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అప్పటి నుంచి పల్లవి ఝా ఆమె తండ్రి ప్రమోద్ ఝా, సోదరుడు ప్రంజాల్ ఝా తనను వేధింపులకు గురి చేయడంతో పాటు తప్పుడు ఆరోపణలతో బీహార్‌లో కేసులు నమోదు చేయించారన్నారు. అంతటితో ఆగకుండా సొంతూరులోని తన ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను గాయపరిచారని అంతుచూస్తామని బెదిరించడంతో పాటు తనపై తప్పుడు ఆరోపణలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment