Ohri's Uppu Restaurant: Food Of Three Regions - Sakshi
Sakshi News home page

‘ఉప్పు’ రెస్టారెంట్‌లో మూడు ప్రాంతాల వంటకాలు

Published Wed, May 24 2023 11:02 AM | Last Updated on Wed, May 24 2023 1:48 PM

Food of three regions in Uppu Restaurant - Sakshi

బంజారాహిల్స్‌: గోంగూర మటన్, రొయ్యల వేపుడు, కోడిపులుసు, నాటుకోడి ఫ్రై తదితర స్పైసీ రుచులతో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఓహిరీస్‌ హోటల్‌ ఉప్పు రెస్టారెంట్‌లో నగర ఆహార ప్రియుల జిహా్వచాపల్యాన్ని తీర్చే వంటకాలు నోరూరిస్తున్నాయి. వీటితో పాటు ఐస్‌క్రీంతో బెల్లంపాకం, పాలజున్ను, బెల్లం ఐస్‌క్రీం, కులీ్ఫ, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

తెలంగాణ, కోనసీమ, రాయలసీమ సంప్రదాయ వంటకాలను ఇక్కడ ఆస్వాదించవచ్చునని ఓహిరీస్‌ గ్రూప్‌ ఎండీ అమర్‌ ఓహిరి, జనరల్‌ మేనేజర్‌ సపతాదిప్రాయ్‌ తెలిపారు. ప్రతిరోజూ ప్రత్యేకమైన రీతిలో విభిన్నమైన శాఖాహార, మాంసాహార రుచులను ఇక్కడ అందిస్తున్నామన్నారు. రాయల్‌ థీమ్‌తో మెనూను ప్రత్యేకంగా తీర్చిదిద్దామన్నారు. రాజమండ్రి నాన్‌వెజిటేరియన్‌ థాలి, ఉప్పు స్పెషల్‌ రాయల్‌ థాలి వంటివి ఆహార ప్రియులను ఆకట్టుకుంటాయన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement