gongura
-
గోంగూర మజాకా : బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోంగూర, దాని రుచిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆంధ్రామాత, పుంటికూర ఇలా ఏ పేరుతో పిలిచినా గోంగూర వంటకాలను మాత్రం లొట్టలేసుకుంటూ తినాల్సిందే. అంతటి మహత్తరమైన రుచి ఉంది ఈ ఆకూకురలో. రుచికి మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లో కూడా ఇది రారాజు లాంటిదనే చెప్పవచ్చు.నోరూరించే వంటకాలు గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, పులుసు ఇలా రకరకాలుగా దీన్ని ఆస్వాదించవచ్చు. గోంగూర నిల్వ పచ్చడిని కూడా ఉసిరి, పండు మిరపకాయ, అల్లం ఇలా అనేక కాంబినేషన్స్‌తో తయారు చేసుకోవచ్చు. ఇక నాన్ వెజ్ వంటకాల్లో గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, గోంగూర ఎండు రొయ్యలు అబ్బో.. ఈ లిస్ట్ పెద్దే. అసలు ఇన్ని రకాలుగా మనం ఆస్వాదించగలిగిదే ఒక్క గోంగూరతోనే నేమో!గోంగూరతో ప్రయోజనాలు గోంగూరలో విటమిన్ సీ, ఏ, బీ1, బీ2, బీ 9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, రైబోఫ్లేవిన్, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి.ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలు బలంగా మారతాయి. మూత్ర ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. జ్వరాలు ,వాపులకు చికిత్స చేస్తుంది.అంతేనా గోంగూరతో జుట్టు ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది. జుట్టు రాలడం, చుండ్రు సమస్య తగ్గుతుంది. పొటాషియం, మెగ్నీషియం ఉండలం వల్ల హైబీపీ నియంత్రణలోకి వస్తుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారికి గోంగూర ఉపశమనం కలిగిస్తుంది. రేచీకటికితో ఇబ్బందిపడే వారు తరచూ గోంగూర తింటే మంచి ఫలితం ఉంటుంది.గోంగూర పూలు, కాయలతో కూడా ఆరోగ్యప్రయోజనాలున్నాయంటే నమ్ముతారా. గోంగూర పూలను దంచి అరకప్పు రసం చేసి దాన్ని వడకట్టి దానిలో అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండుపూటలా తాగితే. కంటికి మంచిది. గోంగూరలో అధికంగా లభించే విటమిన్ ఏ, సీ కంటెంట్, ఇందులో ఉండే క్లోరోఫిల్స్ కేన్సర్ చికిత్సలో సహాయపడతాయి. మూత్రపిండాలు, మూత్ర నాళాల వ్యాధుల నివారణలో ఉపయోగ పడుతుంది. ఇంకా బరువు నియంత్రణలోనూ, మధుమేహాన్ని నియంత్రిచడంలోనూ సాయపడుతుంది. -
గోంగూరతో మిర్చి.. బజ్జీ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
గోంగూర బజ్జీ కావలసినవి: తాజా గోంగూర – కప్పు; సెనగపిండి – కప్పు; బియ్యప్పిండి – మూడు టేబుల్ స్పూన్లు; కారం – టీస్పూను; పసుపు –పావు టీస్పూను; ఇంగువ – చిటికెడు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – పావు కేజీ. తయారీ విధానమిలా: ∙గోంగూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙సెనగపిండిలో బియ్యప్పిండి, ఇంగువ, కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ∙కొద్దిగా నీళ్లు పోసి చిక్కగా కలుపుకోవాలి. చివరిగా టేబుల్ స్పూన్ నూనె వేసి కలపాలి ∙ఇప్పుడు గోంగూర ఆకులను ఈ పిండిలో ముంచి మరుగుతోన్న నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్‌లోకి మారేంత వరకు వేయించి తీసేయాలి ∙నూనె ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే బజ్జీలను టిష్యూ పేపర్ మీద వేసి, నూనెను పేపర్ పీల్చుకున్న తరువాత సర్వ్ చేసుకోవాలి. -
‘ఉప్పు’ రెస్టారెంట్లో మూడు ప్రాంతాల వంటకాలు
బంజారాహిల్స్: గోంగూర మటన్, రొయ్యల వేపుడు, కోడిపులుసు, నాటుకోడి ఫ్రై తదితర స్పైసీ రుచులతో బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఓహిరీస్ హోటల్ ఉప్పు రెస్టారెంట్లో నగర ఆహార ప్రియుల జిహా్వచాపల్యాన్ని తీర్చే వంటకాలు నోరూరిస్తున్నాయి. వీటితో పాటు ఐస్‌క్రీంతో బెల్లంపాకం, పాలజున్ను, బెల్లం ఐస్‌క్రీం, కులీ్ఫ, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తెలంగాణ, కోనసీమ, రాయలసీమ సంప్రదాయ వంటకాలను ఇక్కడ ఆస్వాదించవచ్చునని ఓహిరీస్ గ్రూప్ ఎండీ అమర్ ఓహిరి, జనరల్ మేనేజర్ సపతాదిప్రాయ్ తెలిపారు. ప్రతిరోజూ ప్రత్యేకమైన రీతిలో విభిన్నమైన శాఖాహార, మాంసాహార రుచులను ఇక్కడ అందిస్తున్నామన్నారు. రాయల్ థీమ్‌తో మెనూను ప్రత్యేకంగా తీర్చిదిద్దామన్నారు. రాజమండ్రి నాన్వెజిటేరియన్ థాలి, ఉప్పు స్పెషల్ రాయల్ థాలి వంటివి ఆహార ప్రియులను ఆకట్టుకుంటాయన్నారు. -
అట్లతద్దోయ్ ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్ మూడట్లోయ్..
రాయవరం: అట్లతద్దోయ్ ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్ మూడట్లోయ్.. అంటూ మహిళలు ఆటపాటలతో కోలాహలంగా జరుపుకునే పండగ అట్లతద్ది. ముఖ్యంగా వివాహమైన అనంతరం నవ వధువు అట్లతద్ది పండగను తప్పనిసరిగా చేసుకోవడం ఆనవాయితీ. మాంగళ్య బలం కోసం గౌరీదేవిని భక్తితో కొలిచే ఈ పర్వదినాన్ని ఆశ్వీ యుజ మాసం బహుళ తదియ నాడు నోయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. గ్రామీణ ప్రాంతాల్లో అట్లతద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ నెల (అక్టోబర్) 12న అట్లతద్ది పర్వదినం సందర్భంగా పూజకు ఏర్పాట్లు చేసుకునే పనిలో మహిళలు నిమగ్నమై ఉన్నారు. ఇస్తినమ్మ వాయనం.. మహిళలు నోచే నోముల్లో అతి ముఖ్యమైనది అట్లతద్ది పండుగ. వేకువజామునే లేచి స్నానపానాదుల అనంతరం ఐదు గంటల లోపుగా భోజనం చేసి వ్రతాన్ని ప్రారంభిస్తారు. మజ్జిగ అన్నం, గోంగూర పచ్చడి, నువ్వులపొడి, ఉల్లిపాయల పులుసు, గడ్డపెరుగుతో భోజనం చేస్తారు. అనంతరం సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. కొత్తగా పెళ్లైన యువతులు తప్పనిసరిగా అట్లతో వాయనాలు ఇస్తారు. సాయంత్రం సమయంలో కాలువ వద్దకు వెళ్లి కాలువలో మట్టిని, వరిదుబ్బులను, నవధాన్యాలతో తయారుచేసిన జాజాల బుట్టలను గౌరీదేవిగా భావించి పూజలు చేస్తారు. నీళ్లలో గౌరమ్మ.. పాలల్లో గౌరమ్మ అంటూ పాటపాడుతూ పూజ అనంతరం వాటిని కాలువలో కలుపుతారు. అట్లతద్దికి ఐదురోజుల ముందుగా చిన్నచిన్న బుట్టల్లో మట్టి వేసి అందులో మెంతులు, పెసలు, కందులు, పత్తి తదితర నవధాన్యాలను వేస్తారు. అట్లతద్ది రోజున మొలకలు వచ్చే విధంగా చూస్తారు. వీటినే జాజాలు అంటారు. ఉయ్యాల ఊగుతూ.. గోరింటాకు పెట్టుకుంటూ.. అట్లతద్ది రోజున మహిళలు తప్పనిసరిగా ఉయ్యాల ఊగుతారు. అదేవిధంగా అట్లతద్దికి ముందురోజున మహిళలు గోరింటాకు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. కాలువల వద్దకు వెళ్లే సమయంలో పెళ్లిపీటలపై కట్టుకున్న పట్టుచీరను తప్పనిసరిగా ధరిస్తారు. ఉదయం నుంచి కటిక ఉపవాసం చేసే మహిళలు సాయంత్రం పూజ అనంతరం చంద్రదర్శనం కోసం వేచిచూస్తారు. చంద్రుడు కనిపించాక పూజ చేసుకున్న అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు. రాయవరం, మండపేట, కపిలేశ్వరపురం, రామచంద్రపురం, కె.గంగవరం, కాజులూరు మండలాల పరిధిలోని 120 గ్రామాల్లో అట్లతద్ది నోముకు మహిళలు సిద్ధమవుతున్నారు. నోముకు అవసరమైన పూజా సామగ్రిని సిద్ధం చేసుకునే పనిలో మహిళలు ఉన్నారు. ఏటా నోచుకుంటాం ఏటా తప్పనిసరిగా అట్లతద్ది నోము నోచుకుంటాను. ఈ ఏడాది నోముకి ఇప్పటికే జాజాలు సిద్ధం చేసుకున్నాం. పూజకు అవసరమైన ఏర్పాట్లలో ఉన్నాం. – పులగం శివకుమారి, గృహిణి, రాయవరం సౌభాగ్యం కోసం సౌభాగ్యం కోసం గౌరీదేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తాం. అట్లతద్ది రోజు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి అమ్మవారిని పూజించడం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ వేడుక మహిళలకు ప్రత్యేకం. – కొప్పిశెట్టి లక్ష్మి, గృహిణి, అద్దంపల్లి, కె.గంగవరం మండలం వాయనాలు ప్రధానం హిందూ సంప్రదాయంలో అట్టతద్దికి పెళ్లైన ఏడాది నవ వధువులు వాయనాలు తీర్చుకోవడం ఈ పర్వదినంలో ప్రధానమైన ప్రక్రియ. అట్లతద్దిని మన ప్రాంతంలో సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం అనాదిగా వస్తోంది. – విలపర్తి ఫణిధర్‌శర్మ, అర్చకులు, రాయవరం -
Gongura: షుగర్, రేచీకటి ఉన్నవాళ్లు గోంగూరను తిన్నారంటే...
Health Benefits Of Gongura Leaves: ఆంధ్రమాతగా... శాకంబరీ వర ప్రసాదంగా పేరొందిన గోంగూరను తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే గోంగూరలో చాలా ఔషధ గుణాలున్నాయి. గోంగూరలోని పీచు పదార్ధం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని కొవ్వును నియంత్రిస్తుంది. వారానికి ఒక్కసారైనా గోంగూరతో పప్పు లేదా పచ్చడి చేసుకుని తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. తరచూ గోంగూరను తినడం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం... ►గోంగూరలో పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు అదుపులో ఉంటుంది. ►రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి, చక్కెర శాతాన్ని తగ్గించే శక్తి గోంగూరకు ఉంది. మధుమేహంతో బాధపడేవారు ఆహారంలో గోంగూరను తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ►గోంగూరలో విటమిన్ ఎ, బి 1, బి 2, బి 9 తో పాటు సి విటమిన్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. విటమిన్ ఎ వల్ల కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ►బీకాంప్లెక్స్, సి విటమిన్లతో దంత సమస్యలు దూరంగా ఉంటాయి. దీనిలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎముకలు పటిష్టంగా ఉంటాయి. చదవండి: విటమిన్ బి12 లోపం ఉందా..? ల్యాబ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇలా చేస్తే తెలుస్తుంది..! ►అలాగే ఫోలిక్ యాసిడ్, మినరల్స్ కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులను నివారించడానికి గోంగూర ఉపయోగ పడుతుంది. ►దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్లు ఏదో ఒక రూపంలో గోంగూరను తీసుకుంటే సహజ ఔషధంలా పనిచేస్తుంది. ►రేచీకటి ఉన్నవారు తరచూ గోంగూరను తీసుకోవాలి. అలాగే గోగుపూలను దంచి రసాన్ని తీసుకుని వడపోసి తాగడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ►కొందరికి కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల అలెర్జీలు వస్తుంటాయి. అటువంటి వాటిలో గోంగూర కూడా ఒకటి. కాబట్టి శరీరానికి సరిపడని వారు మినహా మిగిలిన అందరూ నిరభ్యంతరంగా గోంగూరను తీసుకోవచ్చు. చదవండి: Health Tips: జీలకర్రను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగుతున్నారా.. అయితే -
గోంగూరతో చికెన్, మటన్.. అద్భుతః అనాల్సిందే
ఆవకాయ తరువాత తెలుగువారు అధికంగా ఇష్టపడే గోంగూరను ఏ కూరలో వేసి వండినారుచి అమోఘంగా ఉంటుంది. ఘాటు మసాలాలతో ఘుమఘుమలాడే మాంసాహారాన్ని పుల్లని గోంగూరతో వండితే అద్భుతః అనాల్సిందే. గోంగూర చికెన్ ఫ్రై కావలసినవి: గోంగూర – రెండు కట్టలు. పెద్ద ఉల్లిపాయ – ఒకటి సన్నగా తరుక్కోవాలి, పచ్చిమిరపకాయలు – ఐదు, కరివేపాకు – రెండు రెమ్మలు, జీలకర్ర – అరటీస్పూను, గరం మసాలా – అర టీస్పూను, ఆయిల్ – నాలుగు టీస్పూన్లు, నెయ్యి – టేబుల్ స్పూను. మ్యారినేషన్ కోసం.. చికెన్ – అరకేజీ, నిమ్మరసం – అర టీస్పూను, కారం – టీ స్పూను, ధనియాల పొడి – అర టీస్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు – టీ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ. ► ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి మ్యారినేషన్ కోసం తీసుకున్న పదార్థాలన్నీ కలిపి అరగంటపాటు నానబెట్టాలి. ► స్టవ్ మీద పాన్ పెట్టి టీ స్పూను ఆయిల్ వేసి గోంగూరను వేసి వేయించి, చల్లారనివ్వాలి. ► తరువాత వేయించిన గోంగూర, పచ్చిమిరపకాయలను మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ► నానబెట్టిన చికెన్ మిశ్రమాన్ని మూతపెట్టి మీడియం మంట మీద పదినిమిషాలు ఉడకనివ్వాలి. ► మధ్యలో కలుపుతూ చికెన్‌లో వచ్చిన నీళ్లు మొత్తం ఇగిరిపోయేంత వరకు ఉడికించాలి. ► ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టి నెయ్యి, మూడు స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కాక ఉల్లి తరుగు, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించాలి. ► ఇవి వేగాక ఉడికిన చికెన్, గరం మసాలా వేసి మరో ఐదు నిమిషాలు వేగనివ్వాలి. ► ఇప్పుడు గోంగూర పేస్టు వేసి చికెన్ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసి, అవసరమైతే మరికాస్త వేసుకుని, ఆయిల్ పైకి తేలేంత వరకు చికెన్‌ను వేయిస్తే గోంగూర చికెన్‌ఫ్రై రెడీ. గోంగూర మటన్ కర్రీ కావలసినవి: మటన్ – అరకేజి, పసుపు – చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్టు – టీ స్పూను, పెద్ద ఉల్లిపాయ – ఒకటి, ఆయిల్ – ఆరు టీ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, కారం – మూడు టీ స్పూన్లు, ధనియాల పొడి – టీ స్పూను, జీలకర్ర పొడి – అర టీ స్పూను, పచ్చిమిరపకాయలు – ఐదు, గోంగూర – మీడియం సైజు ఐదు కట్టలు, కొత్తిమీర – చిన్న కట్ట ఒకటి, గరం మసాలా పొడి – టీ స్పూను, షాజీరా – టీ స్పూను, యాలకులు – రెండు, లవంగాలు – రెండు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క. తయారీ: ► మటన్‌ను శుభ్రంగా కడిగి కుకర్‌లో వేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం అరకప్పు నీళ్లు పోసి ఒకసారి అన్నీ కలిపి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ► స్టవ్ మీద పాన్ పెట్టి ఆరు టీస్పూన్ల ఆయిల్ వేసి దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ► కొద్దిగా ఉప్పువేసి గోల్డెన్ బ్రౌన్ రంగు మారేంత వరకు వేయించాలి. ► తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మంచి వాసన వచ్చేంతరకు వేయించాక, పసుపు, పచ్చిమిరపకాయలు, కడిగి పెట్టుకున్న గోంగూర వేసి మూత పెట్టి, మధ్యమధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. ► ఇప్పుడు ఉడికిన మటన్ వేసి ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకుని గరం మసాలా, తరిగిన కొత్తి మీర వేసి 10 నిమిషాలు ఉడికిస్తే గోంగూర మటన్ కర్రీ రెడీ. గోంగూర పచ్చి రొయ్యల ఇగురు కావలసినవి: పచ్చిరొయ్యలు – అరకేజి, గోంగూర – మూడు కట్టలు, పెద్ద ఉల్లిపాయలు – రెండు, ఎండు మిరపకాయలు – పన్నెండు, పచ్చిమిరపకాయలు – మూడు, వెల్లుల్లి తరుగు – రెండు టీ స్పూన్లు, ఆవాలు – టీస్పూను, జీలకర్ర – టీస్పూను, పసుపు – అర టీస్పూను, ఆయిల్ – నాలుగు టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ► ముందుగా గోంగూరను ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి దోరగా వేయించి పేస్టులా చేసి పక్కన బెట్టుకోవాలి. ► రెండు పెద్ద ఉల్లిపాయలు, జీలకర్ర, పది ఎండు మిరపకాయలను మిక్సీజార్‌లో వేసి పేస్టు చేసి పెట్టుకోవాలి. ► స్టవ్ మీద పాన్ పెట్టుకుని నాలుగు టీస్పూన్ల ఆయిల్ వేసి కాగాక ఆవాలు వేయాలి. ► ఆవాలు వేగాక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి తరుగు, మిగిలిన ఎండు మిరపకాయలు వేసి వేయించాలి. ► ఇప్పుడు ఉల్లిపాయ పేస్టు వేసి ఐదు నిమిషాలు వేగనిచ్చి, తరువాత కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలను వేయాలి. ► రొయ్యలు వేసిన ఐదు నిమిషాల తరువాత రుచికి సరిపడా ఉప్పువేసి ఉడికించాలి. రొయ్యలు ఉడికిన తరువాత గోంగూర పేస్టు వేసి బాగా కలపాలి. ► అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు పోసి నూనె పైకి తేలేంత వరకు ఉడికిస్తే గోంగూర పచ్చిరొయ్యల ఇగురు రెడీ. -
ఆకుకూరలు దివ్యౌషధాలు
ఆకు కూరలు రకరకాలు. ఒకే ఆకు కూరను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఉదాహణకు... గోంగూరనే పుంటి కూర అని కూడా అంటారు. పేరును బట్టి పోల్చకపోయినా, ఆకుల్ని కంటితో చూస్తే, ‘ఓహో’ ఇదేనా! అనిపిస్తుంది. ఒకే ఆకు కూరలో చిన్న చిన్న అంతర్భేదాలు కూడా ఉండొచ్చు. ఉదా: చిన్న మెంతి, పెద్ద మెంతి, గోంగూర – తెలుపు/ఎరుపు. ఆకు కూరలన్నింటిలోనూ ఎంతో కొంత పోషక విలువలు ఉంటాయి. చాలా వాటిలో ఔషధ విలువలు కూడా నిక్షిప్తమై ఉంటాయి. ప్రాంతీయపు అలవాట్లను బట్టి కొన్ని ఆకు కూరలను నిత్యం ఆహారంలో తింటుంటాం. కొన్నింటిని అవసరాన్ని బట్టి ఔషధాలుగా మాత్రమే వినియోగిస్తాం. సామాజిక స్పృహతో సక్రమ ప్రచారం చే స్తే, పోషకానికైనా, ఔషధానికైనా ఇవి పేదలపాలిట వరప్రసాదాలని చెప్పక తప్పదు. 1. మత్సా్యక్షి (పొన్నగంటి కూర) మేధ్య రసాయనం (మెదడుకి బలం), నేత్య్రం (కంటికి మంచిది). ‘‘కుమారాణాం వపుర్మేధా బలబుద్ధి వివర్ధనాః’’ అన్నాడు సుశ్రుతాచార్యుడు. 2. మూషిక (ఆజ) పర్ణి (ఎలుక చెవి కూర) జ్వరాలకు, కడుపులోని నులి పురుగులకు మంచిది. దీని మొత్తం మొక్క కషాయంగా గాని, ఆకుల పసరుగా గాని సేవించవచ్చు. దీని వేరును స్త్రీ గర్భకోశ రోగాలలో వాడతారు. 3. అపామార్గ (ఉత్తరేణు) పైల్స్, అజీర్ణం, చర్మ రోగాలు, విరేచనాలు, మూత్ర విసర్జనలో మంట మరియు క్లిష్టత, స్త్రీలలో తెల్ల బట్ట, నిద్ర లేమి, జంతువుల విష రోగాలు మొదలగు వాటిలో చక్కటి గుణకారి. అపామార్గ క్షారం క్లిష్టమైన వ్రణాలను మాన్పుతుంది. అపామార్గపు ‘వేరు’ ను యోనిలో ఉంచితే స్త్రీలలో కష్ట ప్రసవం జరగకుండా సుఖ ప్రసవమౌతుంది. వేరును దంచి ముద్దగా చేసి ప్రసవ సమయంలో ఉదర, జననాంగాల వెలుపల లేపనం చేసినా సుఖప్రసవమౌతుంది.‘‘అపామార్గ శిఫాం యోని మధ్యే నిక్షిప్య ధారయేత్ సుఖం ప్రసూయతే నారీ భేషజస్యాస్య యోగతః’’ గమనిక: అకాలంలో మొలిచినవి, దూషితమైనవి, పాతవిౖయెనవి తినరాదు. పాత. లూత. దూష్య, పరువంబు కానట్టి కలుష ధరణియందు మొలచినట్టి అపరిశుభ్రమైన ఆకుకూరలెపుడు తినగవలదు సుమ్మి! మనగ నరుడ! – డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారు చేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయిం చవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. mail: familyvantakalu@ gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, -
దేశసేవలో గోంగూర...
తిండి గోల ఆంధ్రమాతగా తెలుగువారి మదిని కొల్లగొట్టిన గోంగూర పుట్టుపూర్వోత్తరాలు ఎట్టివో ఎవరూ కనిపెట్టలేకపోయారు. బైటి దేశం నుంచి వచ్చిందే అని కొందరు, కాదు కాదు మనదే అని కొందరు వాదులాడుకున్నా పచ్చడి దగ్గరకొచ్చేసరికి అంతా ఒక్కటైపోయారు. పుల్లపుల్లగా కాస్త వగరుగా శాకమైనా, మాంసమైనా వంటకాలకు రుచిని తెచ్చే పుంటికూర గురించి ఫుల్స్టాప్ లేకుండా ఎన్ని పేజీలైనా రాసేయొచ్చు. ఇది బెండ కుటుంబానికి చెందింది. నార పంటగా వాడుకలో ఉంది. క్యాల్షియం, ఇనుము, విటమిన్ ఎ, సి, రైబోఫ్లెవిన్, ఫోలిక్యాసిడ్తో పాటు పీచు సమృద్ధిగా ఉండే ఆకుకూర. గోగు నారతో సంచులు, తాళ్లు... తయారుచేస్తారు. మెట్ట, మాగాణీ భూముల్లో గోగు పంటలు సాగు జరుగుతుంది. విదేశాలకు పచ్చడి రూపాన గోంగూర ఎగుమతి అవుతుంది. అయితే, గణాంక వివరాలు ఇవ్వగలిగినంత గణీనయమైన ఎగుమతి వ్యాపారం కానప్పటికీ మన గోంగూర ఎంతో కొంత విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పరోక్షంగా దేశసేవ చేస్తూనే ఉంది. మనదేశంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లో విరివిగా కనిపిస్తోంది. చత్తీస్ఘడ్, మణిపురి, పంజాబ్‌లలో కనిపిస్తున్న గోంగూర బంగ్లాదేశ్‌లోనూ సాగుచేస్తున్నారు. చైనాలో వేసవి పంటగా గోంగూర పచ్చగా వర్థిల్లుతోంది. వింతేమిటంటే తెలుగు ప్రజలలో గోంగూరుకు ఎంత పేరుందో సౌత్ ఆఫ్రికాలోనూ అంతేపేరుంది. . -
సెలబస్ : ఇంగ్లిష్ మీడియమ్ ఇల్లు
ఆవకాయా, గోంగూర, ముద్దపప్పూ, పూతరేకూ... గొబ్బిళ్లూ, ఉగాది పచ్చడీ... అట్లతద్దీ, అచ్చతెనుగూ... ఇవన్నీ మన ఆస్తులు. కేవలం మన తెలుగువారి ఆస్తిపాస్తులు. ఇవి మన సంస్కృతి, సంప్రదాయం. ఇంకా మన ఆచార వ్యవహారాలతో పాటూ పెనవేసుకుపోయిన సంపదలు. ఇవి క్రమంగా మన కంటికీ, ఇంటికీ... తెలుగు మనిషికీ, మనసుకీ దూరమైపోతుంటే పెల్లుబికిన వేదనలోంచీ, ఆత్మ సంవేదనలోంచీ పుట్టుకొచ్చిన కవిత ఇది. ఖండాంతరాలు దాటిపోయినా ఖండచాపుతాళం గతి మారనట్లే... తెలుగునాట, తమిళనాట... ఏ నాటనున్నా నాటరాగం ఆరోహణావరోహణలు మారనట్లే... మన తెలుగుతనమూ మారదు. మారకూడదు సుమ్మీ! ఏమంటారు? తెలుగు సినీ గీత రచయితల్లో వనమాలిది ఓ ప్రత్యేకస్థానం. అయితే ఆయనలో గీత రచయితే కాదు... ఓ కవి కూడా ఉన్నారన్న విషయం చాలామందికి తెలియదు. వనమాలి కలం కొమ్మకి పూసిన కవితాసుమాల్లో ఇది ఒకటి... అక్షరాభ్యాసం రోజే ఓం నమః శివాయః ఓ మూలకి ఒదిగిపోతాయి! ఉదయాన్నే పాకెట్ పాల పొదుగుల్ని పిండుకునే ముంగిట్లో సుప్రభాత గీతమేదీ వినిపించదు ముత్యమంత ముగ్గయినా కనిపించదు హుందాగా ఇంగ్లిష్ పేపర్ని తిరగేసే చేతులు తెలుగు నాలికతో వార్తలు వల్లెవేస్తుంటాయి గుక్కపట్టి ఏడ్చే పాపాయిని జోకొట్టడానికి ఆ ఇంట్లో జో అచ్చుతానందలుండవు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్లే అక్కడ జోలపాటలవుతాయి! పురిటిలోనే కేర్‌మనే పాపాయికి డబ్బాపాలే ‘కేర్’ఆఫ్ అడ్రసవుతాయి నాజూకు తల్లి హయాంలో సిరులొలికే పసికందుకు సెరిలాకులే గోరుముద్దలౌతాయి! బువ్వ తినే బుజ్జాయికి నిత్యం టీవీతెరలే అమ్మ చూపే నిండుచందమామలు! అక్కడ పిల్లలకీ, కుక్కపిల్లలకీ ఒకే రకం ముద్దుపేర్లు! ఇంటిపేరు అవధానులయినా ఇప్పుడు మాత్రం అవసానదశే! తలకట్టు విరిగిన అక్షరాలు తలకిందులైన ‘తెల్గూ’ వాక్యాలు అక్కడ ఫ్యాషన్! జీన్సూ, టీ షర్టుల్లో ఎదిగిన కూతుర్ని చూసుకుని మిడిసిపడే ‘మిడిమిడి’ల్ క్లాసులు ఓణీల్నీ పరికీణీల్నీ ఓరకంటయినా చూడవు! అక్కడ వాలుజడ ఒయ్యారాలు పోదు నలనల్లని కాటుక కనుదోయి చేదు! ‘నిధి చాల సుఖమ’నే ఆ లోగిలి త్యాగయ్య సన్నిధిని కోరదు అదివో... అల్లదివో... అక్కడెక్కడో తిరిగే అన్నమయ్యని ఆ గడపలోకి రానివ్వదు అది అక్షరాలా తెలుగువారిల్లు స్వాతంత్య్రం వచ్చినా అదింకా ‘తెల్ల’వారిల్లు!