ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోంగూర, దాని రుచిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆంధ్రామాత, పుంటికూర ఇలా ఏ పేరుతో పిలిచినా గోంగూర వంటకాలను మాత్రం లొట్టలేసుకుంటూ తినాల్సిందే. అంతటి మహత్తరమైన రుచి ఉంది ఈ ఆకూకురలో. రుచికి మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లో కూడా ఇది రారాజు లాంటిదనే చెప్పవచ్చు.
నోరూరించే వంటకాలు
గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, పులుసు ఇలా రకరకాలుగా దీన్ని ఆస్వాదించవచ్చు. గోంగూర నిల్వ పచ్చడిని కూడా ఉసిరి, పండు మిరపకాయ, అల్లం ఇలా అనేక కాంబినేషన్స్‌తో తయారు చేసుకోవచ్చు. ఇక నాన్ వెజ్ వంటకాల్లో గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, గోంగూర ఎండు రొయ్యలు అబ్బో.. ఈ లిస్ట్ పెద్దే. అసలు ఇన్ని రకాలుగా మనం ఆస్వాదించగలిగిదే ఒక్క గోంగూరతోనే నేమో!
గోంగూరతో ప్రయోజనాలు
గోంగూరలో విటమిన్ సీ, ఏ, బీ1, బీ2, బీ 9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, రైబోఫ్లేవిన్, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి.ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలు బలంగా మారతాయి. మూత్ర ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. జ్వరాలు ,వాపులకు చికిత్స చేస్తుంది.
అంతేనా గోంగూరతో జుట్టు ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది. జుట్టు రాలడం, చుండ్రు సమస్య తగ్గుతుంది. పొటాషియం, మెగ్నీషియం ఉండలం వల్ల హైబీపీ నియంత్రణలోకి వస్తుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారికి గోంగూర ఉపశమనం కలిగిస్తుంది. రేచీకటికితో ఇబ్బందిపడే వారు తరచూ గోంగూర తింటే మంచి ఫలితం ఉంటుంది.
గోంగూర పూలు, కాయలతో కూడా ఆరోగ్యప్రయోజనాలున్నాయంటే నమ్ముతారా. గోంగూర పూలను దంచి అరకప్పు రసం చేసి దాన్ని వడకట్టి దానిలో అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండుపూటలా తాగితే. కంటికి మంచిది. గోంగూరలో అధికంగా లభించే విటమిన్ ఏ, సీ కంటెంట్, ఇందులో ఉండే క్లోరోఫిల్స్ కేన్సర్ చికిత్సలో సహాయపడతాయి. మూత్రపిండాలు, మూత్ర నాళాల వ్యాధుల నివారణలో ఉపయోగ పడుతుంది. ఇంకా బరువు నియంత్రణలోనూ, మధుమేహాన్ని నియంత్రిచడంలోనూ సాయపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment