Drawing
-
ఎంగేజ్ విత్ సిటీ..
లామకాన్‌లో సంగీత దినోత్సవం..ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని పాశ్చాత్య సంగీత ప్రియుల కోసం అశ్రిత డిసౌజా ఆధ్వర్యంలో పాప్, జాజ్, డిస్నీ సాంగ్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సాయంత్రం 5 నుంచి 2 గంటల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. – సాక్షి, సిటీబ్యూరోచిన్నారుల కోసం మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్..ప్రతిభావంతులైన చిన్నారుల కోసం ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు.చిన్నారుల ఊహలకు డ్రాయింగ్, కలరింగ్స్తో ఊపిరిపోసే విధంగా వారిలోని ఊహాశక్తిని, సృజనను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ఉద్ధేశ్యమని, తమ మ్యాక్స్ స్టోర్ అందించే రీసైక్లింగ్ పేపర్‌తో తయారు చేసిన షాపింగ్ బ్యాగ్‌పై ‘భూమిని కాపాడే సూపర్‌హీరో’ అనే నేపథ్యంతో చిత్రాలను గీయాల్సి ఉంటుందని వివరించారు. తుది ఏడుగురు విజేతలకు పూర్తిస్థాయి ఖర్చులతో కుటుంబంతో సహా కశ్మీర్ పర్యటనను గెలుచుకుంటారని తెలియజేశారు. వివరాలకు దగ్గర్లోని మ్యాక్స్ స్టోర్‌లో సంప్రదించాలన్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇవి చదవండి: 'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్.. -
చిత్రకళకు కొండంత చిరునామా
ఆ చిత్రాలను చూస్తే మన కనులకు ఆహ్లాదం మన మనసుకు ఆనం దం. సప్తవర్ణ సోయగాలు బొమ్మలుగా సాక్షాత్కరిస్తాయి. విశాలంగా రెక్కలార్చిన పక్షులూ, శరవేగంగా పరుగులెత్తే జింకలూ ఎలా కాన్వా స్పై రంగుల్లో నిలిచిపోతాయో, గలగల సెలయేరులూ గంగానది ప్రవా హాలు కళ్ళ ముందు నిలుస్తాయి. అభిజ్ఞాన శాకుంతల కావ్యమైనా, రామాయణ భారత భాగవతాది కథలైనా వారి కుంచె విన్యాసాల్లో ఒదిగిపోతాయి. కోతుల నాడించే మదారి అయినా, పల్లెటూరి జంట అయినా, అరకు లోయలో అందాలైనా వారి బొమ్మల్లో గమ్మున కూర్చుంటాయి. వీరనారి ఝాన్సీ రాణీ, మహా పరాక్రమశాలి మహారాణి రుద్రమదేవీ పౌరుషంగా నిలబడతారు. నన్నయ్య, పోతన, వేమన ఇదిగో మేము ఇలా ఉంటాం అంటూ చిత్రాలై వస్తారు. ప్రకృతి చిత్రాల సోయగాల నుండి, సంప్ర దాయ చిత్రాల ఆలోచనల నుండి, సామాజిక చింతన చేతనత్వం వరకు కొండపల్లి శేషగిరి రావు 40వ దశకం నుండి, 2000వ దశకం వరకు 70 ఏళ్ళు చిత్ర కళా జగత్తుకు నిలువెత్తు చిత్రమై నిలిచారు. కొండపల్లి శేషగిరిరావు 1924 జనవరి 27న వరంగల్ జిల్లా మానుకోట దగ్గర ఉన్న పెనుగొండ గ్రామంలో జన్మించారు. పుట్టింది సంపద గల ఇల్లే అయినా, పదేళ్ల బాలుడు అయ్యేసరికి అనివార్య కారణాలతో పేదరి కంలో పడిపోయింది కుటుంబం. పదవ తర గతి వరకు హనుమకొండలో వారాలబ్బా యిగా బ్రతుకు సాగించి చిత్రకళపై ఉన్న మక్కువతో హైదరాబాదుకు ధైర్యాన్ని వెంట బెట్టుకొని నడిచారు. కొందరు ప్రముఖుల సహకారంతో మెహదీ నవాజ్ జంగ్ గారికి పరిచయమై వారి సహాయంతో రెడ్డి హాస్టల్లో జాయిన్ అయి, ‘హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్’లో విద్యా ర్థిగా చేరి నూతన అధ్యాయాన్ని తెరుచుకున్నారు. ఐదేళ్ల చదువును పూర్తి చేసుకుని ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై, చిత్రకారునిగా ఎదిగి, మెహదీ ఫర్మా యిషితో కలకత్తాకు పయనమయ్యారు. రవీంద్రనాథ్ టాగూర్ స్థాపించిన ’శాంతినికేతన్’లో శేషగిరిరావు విద్యార్థి అయ్యారు. ప్రముఖ చిత్రకారులు నందాలాల్ బోస్, అవనీంధ్ర నాథ్ ఛటోపాధ్యాయుల ప్రియ శిష్యుడూ అయ్యారు. తరువాత తాను చదువుకున్న ఫైనార్ట్స్ కళాశాలలోనే అధ్యాపకునిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి ప్రొఫెసర్‌గా, ప్రిన్సిపల్‌గా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. రిటైర్ అయిన తర్వాత ఎన్నో వందల చిత్రాలను వేశారు. హైదరాబాద్ పరిసరాలలో కనిపించకుండా పోయిన కొండలు, గుట్టలు శేషగిరిరావు చిత్రించిన చిత్రాల్లో వందలాదిగా దర్శనమిస్తాయి. ఆక్వాటెక్చర్లో, కలర్ గ్రాన్యూల్స్ మ్యూరల్ పెయింటింగ్స్‌లో ఎన్నో కొత్త కొత్త ప్రయో గాలు చేశారు. అమీర్ పేట్ దగ్గర మైత్రి భవన్ హుడా కాంప్లెక్స్ ముఖ ద్వారం రెండువైపులా గోడలపై కనిపించే విశ్వరూప సంద ర్శనం, లవకుశులు చేజిక్కించుకున్న అశ్వమేధ యాగాశ్వ పెయిం టింగ్ ఇప్పుడూ చూసి ఆనందించవచ్చు. ‘చిత్రకళా తపస్వి డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్ర’ అనే పుస్తకానికి ముందుమాటగా ‘కుంచె సామ్రాజ్య మహారాజు’ అంటూ ఆర్టిస్ట్ మోహన్ రాసిన వ్యాసంలో ‘రావి నారాయణ రెడ్డి పైన నీలా కాశం తేలి, మబ్బుల కాంట్రాస్టులో ఆదర్శమంత ఎత్తెగురు తున్న ఎర్రని జెండా, దానిపై హత్తిన తెల్లని సుత్తి కొడవలి. కళ్ళు నిండిపోతాయి’, ‘నుదుట నామం దిద్దుకుని పరమ సాంప్రదాయకంగా కనిపిస్తూ చిత్రాలు గీసే ఈ పవిత్ర బ్రాహ్మణ మూర్తికి ఎర్రజెండా జబ్బు ఎలా సోకిందబ్బా? అని ఓ నాయకుడిని అడిగాను, ఇలాంటి పెద్ద కమ్యూనిస్టు నాయకులు ఎందరో ఆయనకు జిగిరీ దోస్తులు అని చెప్పాడు’ అన్నారు. ఈ మాటలు శేషగిరి రావు నిండైన సామాజిక మూర్తి మత్వానికి అద్దం పట్టాయి అని చెప్ప వచ్చు. ‘కాకి పడిగెలు’ జానపద చిత్రకళను వెలుగులోకి తెస్తూ రచించిన పరిశోధనాత్మక వ్యాసమైన ‘ఆంధ్రదేశంలో చిత్రకళ’, ‘తెలంగాణాలో చిత్రకళ’, ‘కళ – కల్పనా వైచిత్రి’ వంటి ఎన్నో గొప్ప వ్యాసాలను రచిం చిన కవి, రచయిత కూడా శేషగిరిరావు. ‘చిత్ర శిల్పకళా రామణీ యకము’ వ్యాస సంపుటి వీరి పాండితి గరిమకు నిదర్శనం. మొట్ట మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ‘తెలుగు తల్లి’ విగ్రహానికి రూపకల్పన చేశారు. 2012 జూలై 26న తుది శ్వాస విడిచారు. నేడు ఆ అద్భుత చిత్రకారుడు పుట్టిన రోజు సందర్భంగా శత జయంతి వేడుకలు జరుపుతున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం. – డాక్టర్ కొండపల్లి నీహారిణి ‘ రచయిత్రి, సంపాదకురాలు (నేడు కొండపల్లి శేషగిరిరావు శతజయంతి వేడుక జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాదులో ఉదయం 11 గంటలకు జరగనుంది .) -
ఆ ఐడియా అతడి జీవితాన్నే మార్చేసింది! అదే!..ఆర్ట్ ఆఫ్ జోషిగా..
‘ఈ పనికి నేను తగను’ అనుకునే వాళ్లు కొందరు. ‘తగ్గేదే లే’ అని ముందుకు వెళ్లే వాళ్లు కొందరు. రెండో వర్గం వారికి తమ దారిలో అవరోధాలు ఎదురుకావచ్చు. అయితే వారిలోని ఉత్సాహ శక్తి ఆ అవరోధాలను అధిగమించేలా చేసి విజేతను చేస్తుంది. సౌరవ్ జోషి ఈ కోవకు చెందిన కుర్రాడు. 24 సంవత్సరాల జోషి ఫోర్బ్స్ ‘టాప్ డిజిటల్ స్టార్స్–2023’లో చోటు సంపాదించాడు...జోషి స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని ఆల్మోర. హరియాణాలోని హన్సిలో ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ చేశాడు. తండ్రి కార్పెంటర్. తల్లి గృహిణి. ఇంటర్మీడియెట్‌లో ‘సౌరవ్ జోషి ఆర్ట్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. ఈ చానల్లో తన స్కెచ్–మేకింగ్ వీడియోలను పోస్ట్ చేసేవాడు. తొలి రోజుల్లో ‘హౌ ఐ డ్రా యంఎస్ ధోనీ’ టైటిల్‌తో ఒక వీడియోను అప్లోడ్ చేశాడు. మొదట్లో పెద్దగా స్పందన కనిపించలేదు. అయితే లాక్డౌన్ టైమ్‌లో ఈ వీడియో పాపులారిటీ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ ఉత్సాహంతో ‘365 వీడియోస్ ఇన్ 365 డేస్’ ఛాలెంజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జోషి. ఈ చాలెంజ్ అతడి జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా మారింది. సౌరవ్ జోషిని డిజిటల్ స్టార్‌ను చేసింది. ఏ వీడియో చేసినా లక్షల సంఖ్యలో వ్యూస్ రావడం మొదలైంది. పన్నెండు మిలియన్ల సబ్స్క్రైబర్లతో జోషి చానల్ ‘ఫాస్టెస్ట్–గ్రోయింగ్ యూట్యూబ్ చానల్’జాబితాలో చేరింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు జోషి. జోషి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ‘సౌరవ్ జోషి ఆర్ట్స్’తో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవడమే కాదు కుటుంబ ఆర్థిక పరిస్థితినీ మెరుగుపరిచాడు జోషి. ‘ఇప్పటికీ ఇది నిజమా? కలా? అని అనుకుంటాను. మొదట్లో వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు ఎవరూ పట్టించుకునేవారు కాదు. చాలా నిరాశగా అనిపించేది. 365 డేస్ ఐడియా నా జీవితాన్నే మార్చేసింది’ అంటాడు జోషి. షేడింగ్ టిప్స్ ఫర్ బిగినర్స్, హౌ టూ డ్రా ఏ పర్ఫెక్ట్ ఐ, హూ టూ యూజ్ చార్కోల్ పెన్సిల్, డ్రాయింగ్ టూల్స్ ఫర్ బిగినర్స్... ఒకటా రెండా జోషి చానల్‌కు సంబంధించి ఎన్నో వీడియోలు పాపులర్ అయ్యాయి. ఎంతోమందిని ఆర్టిస్ట్‌లను చేశాయి. ‘మీరు వయసులో నా కంటే చాలా చిన్నవాళ్లు. నేను అప్పుడెప్పుడో బొమ్మలు వేసేవాడిని. ఆ తరువాత ఉద్యోగ జీవితంలో పడి డ్రాయింగ్ పెన్సిల్‌కు దూరమయ్యాను. మీ వీడియోలు చూసిన తరువాత మళ్లీ పెన్సిల్, పేపర్ పట్టాను. నేను మళ్లీ ఆర్టిస్ట్‌గా మారడానికి మీరే కారణం’ .....ఇలాంటి కామెంట్స్‌తో పాటు ‘ఇది ఎందుకూ పనికి రాని వీడియో’లాంటి ఘాటైన కామెంట్స్ కూడా ప్రేక్షకుల నుంచి వస్తుంటాయి. అయితే ప్రశంసలకు అతిగా పొంగిపోవడం, విమర్శలకు కృంగిపోవడం అంటూ జోషి విషయంలో జరగదు. రెండిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆర్ట్‌లోనే కాదు ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్లోనూ దూసుకుపోతున్నాడు సౌరవ్ జోషి. ఒక్క ఐడియా చాలు మనం వెళ్లగానే ‘సక్సెస్’ వచ్చి షేక్‌హ్యాండ్ ఇవ్వాలనుకుంటాం. అది జరగకపోయేసరికి నిరాశ పడతాం. ‘ఇది మనకు వర్కవుట్ అయ్యేట్లు లేదు’ అని వెనక్కి వెళ్తాం. సక్సెస్ కావడానికి, కాకపోవడానికి అదృష్టం ప్రమేయం ఎంత మాత్రం ఉండదు. మన టాలెంట్ మీద మనకు ఎంత నమ్మకం ఉంది, విజయం కోసం ఎదురుచూడడంలో ఎంత ఓపిక ఉంది అనే దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. అందరిలాగే నేను కూడా మొదట్లో బాగా నిరాశపడిపోయాను. అయితే వెనక్కి మాత్రం పోలేదు. మరో సారి ట్రై చేసి చూద్దాం...అని ఒకటికి రెండు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఒక ఐడియాతో నా జీవితమే మారిపోయింది. – సౌరవ్ జోషి (చదవండి: సినిమాలు చూస్తే..కేలరీలు బర్న్ అవుతాయట! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
కనిపించిన కాగితం మీదల్లా బొమ్మలు గీసేస్తాడు..అదే ఆ బాలుడిని..
క్లాసులో ఒకవైపు టీచర్ పాఠాలు చెబుతున్నా, మరోవైపు దొరికిన కాగితాల మీదో, నోట్ పుస్తకాల మీదో బొమ్మలు గీసే అలవాటు చాలామంది పిల్లలకు ఉంటుంది. పాఠం వినకుండా బొమ్మలు గీయడంలో మునిగిపోయే విద్యార్థులను టీచర్లు మందలించడమూ మామూలే! ఇంగ్లండ్‌లోని ష్రూజ్బరీకి చెందిన జో వేల్ అనే ఈ పదమూడేళ్ల బాలుడికి ఖాళీగా కనిపించిన కాగితం మీదనల్లా బొమ్మలు గీసే అలవాటు ఉంది. క్లాసులో టీచర్ మందలించినా బొమ్మలు గీయకుండా ఉండలేకపోయేవాడు. మిగిలిన క్లాసుల్లో టీచర్ల మందలింపులు తప్పకపోయినా, డ్రాయింగ్ క్లాసులో జో వేల్ చురుగ్గా ఉండేవాడు. డ్రాయింగ్ టీచర్ ప్రోత్సాహంతో తోటి పిల్లలకు ఫ్రీహ్యాండ్ డ్రాయింగ్ గురించి లెక్చర్లిచ్చేవాడు. అతడి అభిరుచిని గమనించి తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో సోషల్ మీడియాలోకి ప్రవేశించాడు. ‘డూడుల్ బాయ్’ పేరుతో జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు గీసే అలవాటే జో వేల్కు చక్కని అవకాశం తెచ్చిపెట్టింది. ‘నైకీ’ షూ కంపెనీకి జో వేల్ గీసే బొమ్మలు బాగా నచ్చాయి. ఈ బొమ్మలను తమ షూస్‌పై డిజైన్లుగా ముద్రించుకోవడానికి అతడితో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. (చదవండి: అతిపెద్ద బాలల మ్యూజియం!) -
బొమ్మలు వేస్తూ ఆ ఫోబియాను పోగొట్టకుంది! ఏకంగా గొప్ప ఆర్టిస్ట్‌గా..
ప్రతి మనిషికి ఏదోఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని జయించి ముందుకెళ్తుంటారు చాలామంది. మినీషా భరద్వాజ్ మాత్రం భయంతో ఇంట్లో గదికే పరిమితమైపోయింది. మినీషాకు ఉన్న ‘అఘోరా ఫోబియా’తో... కొత్త వ్యక్తుల్ని కలిసినా, తెలియని ప్రాంతాలకు వెళ్ళినా తెగ భయపడిపోయేది. గుంపుగా ఉన్న జనాలను చూసి ‘‘అమ్మో అంతా నా వైపు చూస్తున్నారు’’ అని వణికి పోయేది. చిన్నప్పటి నుంచి ఈ భయంతో పార్టీలు, ఫంక్షన్లకు ఎక్కడికీ వెళ్లనే లేదు. ఇక స్నేహితులు కూడా ఎవరు లేరు. జీవితాంతం ఇలానే ఉంటానేమో అనుకునే మినీషా..బొమ్మలు వేసే అలవాటు ద్వారా తన ఫోబియాను అధిగమించడమేగాక, ఆర్టిస్ట్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బొమ్మలు వేస్తూ తన భయాన్ని ఎలా పోగొట్టుకుందో తన మాటల్లోనే..... మాది గురుగావ్. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నా బాల్యమంతా డెహ్రాడూన్‌లో గడిచింది. చిన్నప్పటి నుంచి తెల్లని పేపర్ మీద పెన్సిల్‌తో రకరకాల బొమ్మలు గీసేదాన్ని. ఏడో తరగతిలో ఉండగా ఒక మ్యాగజీన్లో ఉన్న తెల్లటి పేపర్‌పై నటి రేఖ చిత్రాన్ని గీసాను. అప్పుడు మా అమ్మానాన్నలు నా టాలెంట్‌ను చూసి ఆశ్చర్యపోయారు. పదోతరగతి వరకు పెయింటింగ్స్ వేస్తూనే ఉన్నాను. ప్రతి నోట్‌బుక్ చివరి పేజీలో నా పెయింటింగ్ ఒకటి కచ్చితంగా ఉండేది. కొన్నిసార్లు పరీక్షపేపర్లో జవాబు తెలియని ప్రశ్నకు బాధపడుతోన్న అమ్మాయి చిత్రాన్ని గీసేదాన్ని. పదో తరగతిలో అంతర జిల్లా పోటీలలో పాల్గొని డెహ్రాడూన్ మొత్తంలోనే మొదటి బహుమతి అందుకున్నాను. అలా ఎక్కువ సమయం బొమ్మలు గీస్తూ ఉంటే అఘోరా ఫోబియా కూడా గుర్తు వచ్చేది కాదు. ప్రత్యేకమైన కోర్సు చేయలేదు... నేను చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని అమ్మావాళ్లు సీఏ చదివించారు. కానీ నా మనస్సంతా ఆర్ట్మీదే ఉండేది. చదువు పూర్తి అయినప్పటికీ కార్పోరేట్ ప్రపంచంలో కాలుపెట్టలేదు. 1995 లో పెళ్లి అయ్యింది. ఆయన ఉద్యోగం దుబాయ్‌లో కావడంతో అక్కడికి వెళ్లిపోయాను. అక్కడ ఓ పబ్లిషింగ్ హౌస్‌లో ఉద్యోగం చేసేదాన్ని. ఒకసారి ఖాళీ సమయం దొరకడంతో..పేపర్ మీద బొమ్మను గీసాను. బొమ్మ పూర్తయ్యే సమయానికి మా ఆయన, ఆయన స్నేహితుడు వచ్చారు. ఆ బొమ్మను చూసి.. ‘‘చాలా బావుంది. బొమ్మలు గీయడంలో మంచి ప్రతిభ ఉంది. ఎందుకు దాచుకుంటావు. బొమ్మలు గీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యచ్చు కదా...’’ అని ప్రోత్సహించారు. అప్పటి నుంచి నాకెంతో ఇష్టమైన ఆర్ట్‌కు ప్రాణం పోస్తున్నాను. చార్కోల్ పెన్సిల్స్‌తో.. ఆయన ప్రోత్సాహంతో స్కెచ్‌లు గీయడం మొదలు పెట్టాను. ఆయన ఒక ఆర్ట్గ్రూప్ను పరిచయం చేయడంతో అక్కడకు వెళ్లి స్కెచ్‌లు గీసేదాన్ని. కమ్యూనిటీకి వెళ్లిన రెండేళ్లలోనే ‘జి ఆర్ట్ కమ్యూనిటీ’ వాళ్లు నన్ను కలిసి ఆర్ట్‌ఎగ్జిబిషన్‌లో పాల్గొనమని ఆహ్వానించారు. ఆ ఎగ్జిబిషన్‌కు అంతర్జాతీయ ఆర్టిస్ట్‌లు వస్తున్నారు. మీరు ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించండి’’అన్నారు. అది నాకు చాలా పెద్ద అవకాశం. కానీ ‘‘అందరూ రంగులతో స్కెచ్‌లు గీస్తున్నారు. నేను మాత్రం పెన్సిల్, చార్కోల్తో గీస్తాను. నేను నిలబడగలనా’’ అని నిర్వాహకులను అడిగాను. అందుకు వాళ్లు ... నువ్వుతప్ప ఎవరూ చార్ కోల్ వాడడం లేదు. అందరికంటే భిన్నంగా నీ స్కెచెస్ ఆకర్షిస్తాయి అని చెప్పి ‘డేర్ టు డ్రీమ్’ ఎగ్జిబిషన్‌కు ఎంపిక చేశారు. అలా మొదలైన నా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. క్రమంగా వాటర్ కలర్స్ కూడా వేయడం ప్రారంభించాను. చార్కోల్ పెయింటింగ్స్‌కు అనేక అవార్డులు అందుకున్నాను. రోలెక్స్ టవర్‌పై నేను వేసిన పెయింటింగ్‌ను ఇప్పటికీప్రదర్శిస్తున్నారు. దీనికి గుర్తింపుగా ‘పీపుల్స్ ఛాయిస్ ఆవార్డు’ వచ్చింది. అబుదాబిలోని లువురే మ్యూజియంలో నా పెయింటింగ్స్ ఉన్నాయి. ఏడు వేలమంది ముందు... దుబాయ్ మాల్స్‌లో ఏడు వేలమంది ముందు చార్కోల్తో పెయింటింగ్ వేశాను. ఆ పెయింటింగ్ వెంటనే అమ్మడు పోయింది. ‘స్పెషల్ నీడ్ దుబాయ్ కేర్’ తో కలిసి చికిత్స పొందుతోన్న పిల్లలకోసం ‘లిటిల్ పికాసో’పేరిట పెయింటింగ్స్ వేసి వారికి సాయం చేశా. 2017లో గుర్గావ్ వచ్చేసి, ఇక్కడ పెయింటింగ్స్ నేర్పిస్తున్నాను. ఇండియా ఆర్ట్ కమ్యూనిటీ, ఇండియా స్పీకింగ్ ఆర్ట్ ఫౌండేషన్, వారి సాయంతో పెయింటింగ్ నేర్పిస్తున్నాను. దుబాయ్‌లో వేలమందికి నేర్పిన నేను, నా అనుభవాల ద్వారా నేర్చుకున్న ట్రిక్స్‌ను ఇక్కడి పిల్లలకు నేర్పిస్తున్నాను’’ అలా నా భయాన్ని అధిగమించడంతోపాటు నా విద్యను అందరికీ నేర్పించగలగడం నాకెంతో సంతృప్తి కలిగిస్తోంది అని చెప్పింది మినీషా. (చదవండి: లాయర్ని కాస్త విధి ట్రక్ డ్రైవర్‌గా మార్చింది! అదే ఆమెను..) -
ఆమె అందం అలాంటిది, జవహర్ లాల్ నెహ్రూ కూడా ఆమె స్నేహం కోసం..
అమృత షేర్గిల్. 20వ శతాబ్దపు గొప్ప చిత్రకారిణి. 1941లో 28 ఏళ్ల చిన్న వయసులో మరణించినా ఆమె చిత్రాలు ఇప్పటికీ వార్తలు సృష్టిస్తూనే ఉన్నాయి. అమ్మలక్కల కబుర్లను ‘ది స్టోరీ టెల్లర్’ పేరుతో ఆమె బొమ్మ గీస్తే ఇప్పటివరకూ భారతదేశంలో ఏ చిత్రకారుడికీ పలకనంత వెల– 61.8 కోట్లు పలికింది. ఆ చిత్రం గురించి...ఆ గొప్ప చిత్రకారిణి గురించి. అమృత షేర్గిల్ తన జీవిత కాలంలో 200 లోపు చిత్రాలను గీసింది. అన్నీ కళాఖండాలే. వాటిలో చాలామటుకు ప్రఖ్యాత మ్యూజియమ్‌లలో ఉన్నాయి. కొన్ని మాత్రమే ఆమె చెల్లెలి (ఇందిర) కుమారుడు వివాన్ సుందరం, కుమార్తె నవీనల దగ్గర ఉన్నాయి. 1937లో తను గీసిన ‘ది స్టోరీ టెల్లర్’ చిత్రాన్ని అప్పటి లాహోర్‌లో మొదటిసారి ప్రదర్శనకు పెట్టింది అమృత. అప్పటి నుంచి ఆ చిత్రం చేతులు మారుతూ తాజాగా ఢిల్లీలో జరిగిన వేలంలో 61.8 కోట్లు పలికింది. ఇప్పటివరకూ భారతీయ చిత్రకారుల ఏ పెయింటింగ్‌కూ ఇంత రేటు పలకలేదు. ఆ విధంగా చనిపొయిన ఇన్నాళ్లకు కూడా అమృత రికార్డు స్థాపించ గలిగింది. దీనికంటే ముందు గతంలో సయ్యద్ హైదర్ రజా గీసిన ‘జెస్టెషన్’ అనే చిత్రం 51.75 కోట్లకు పలికి రికార్డు స్థాపించింది. దానిని అమృత బద్దలు కొట్టింది. రూ.61.8 కోట్లు ధర పలికిన ‘ది స్టోరీ టెల్లర్’ చిత్రం గొప్ప చిత్రకారిణి అమృత షేర్గిల్ భారతీయ సిక్కు తండ్రి ఉమ్రావ్ సింగ్‌కి, హంగేరియన్ తల్లి ఎంటొనెట్కు జన్మించింది. బాల్యం నుంచి గొప్ప లావణ్యరాశిగా ఉండేది. ఐదేళ్ల నుంచి బొమ్మలు గీయడం మొదలు పెట్టింది. వీరి కుటుంబం సిమ్లాలో కొంత కాలం ఉన్నా అమృత బొమ్మల్లోని గొప్పదనాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెకు 16 ఏళ్ల వయసున్నప్పుడు పారిస్‌కు తీసుకెళ్లి ఐదేళ్ల పాటు చిత్రకళలో శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత అమృత గొప్ప చిత్రాలు గీస్తూ వెళ్లింది. అవన్నీ కూడా భారతీయ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేవే. ఇప్పుడు అత్యధిక రేటు పలికిన ‘ది స్టోరీ టెల్లర్’– పల్లెల్లో నలుగురు అమ్మలక్కలు కూచుని కబుర్లు చెప్పుకునే సన్నివేశం. ఇది కాకుండా ‘వధువు అలంకరణ’, ‘ఒంటెలు’, ‘యంగ్ బాయ్ విత్ త్రీ యాపిల్స్’, ‘జిప్సీ గర్ల్స్’, ‘యంగ్ గర్ల్స్’ ఆమె ప్రఖ్యాత చిత్రాలు. ఆమె తన సెల్ఫ్ పొర్ట్రయిట్ను కూడా గీసుకుంది. అకాల మరణం అమృత షేర్గిల్ తన హంగేరియన్ కజిన్ విక్టర్‌ను వివాహం చేసుకుంది. వారు లాహోర్‌లో ఉన్న సమయంలో కేవలం 28 ఏళ్ల వయసులో 1941లో మరణించింది. అందుకు కారణం కలుషిత ఆహారంతో వచ్చిన వాంతులు, విరేచనాలు అని చెప్తారు. మరో కారణం ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉందని సంప్రదాయ డాక్టర్‌గా ఉన్న విక్టర్ ఆమెకు రహస్యంగా, అశాస్త్రీయంగా అబార్షన్ చేయబోయాడని, అందువల్ల తీవ్రమైన బ్లీడింగ్ జరిగి మరణించిందని అంటారు. ఆకర్షణాజాలం అమృత షేర్గిల్ ఆ రోజుల్లో సంపన్న వర్గాల్లో గొప్ప ఆకర్షణ కలిగిన వ్యక్తిగా కీర్తి గడించింది. జవహర్లాల్ నెహ్రూ ఆమె స్నేహం కోసం అనేక లేఖలు రాశాడు. ఢిల్లీలో జరిగిన అమృత ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు హాజరయ్యాడు. ‘అమృత ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఉన్నవారందరూ చేష్టలుడిగి ఆమెను చూస్తూ ఉండిపొయేవారు’ అని అనేకమంది రాశారు. ‘ఆమె జీవించి ఉంటే ప్రపంచం మొత్తం ఎన్నదగిన గొప్ప చిత్రకారిణి అయి ఉండేది’ అని ఆర్ట్ క్రిటిక్స్ అంటారు.ఆమె లేదు. కాని ఆమె చిత్రాలు ఆమెను సజీవంగా ఉంచుతూనే ఉన్నాయి. -
పల్లెచిత్రాల 'తోట'! వైకుంఠం గీసిన చిత్రాలకు క్రేజీ..!!
కరీంనగర్: పల్లె జీవనం.. పడచుల కట్టుబొట్టు.. భారతీయ సంస్కృతి.. ఆయన చిత్రాలకు మూలాధారం. తోట వైకుంఠం కుంచె పడితే చిత్రాలకు జీవం వచ్చి, కాన్వాస్‌పై నాట్యం చేస్తాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూర్గుపల్లిలో జన్మించిన వైకుంఠం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏడేళ్ల క్రితం గీసిన చిత్రానికి ఇటీవల ముంబయిలోని ఆస్తాగురు యాక్షన్ హౌస్ నిర్వహించిన వేలంలో రూ.1,41,35,220 ధర పలకడం విశేషం. బూర్గుపల్లిలో విద్యాభ్యాసం.. బూర్గుపల్లిలో 1942లో జన్మించిన తోట వైకుంఠం స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశా రు. బోయినపల్లి, శాత్రాజ్పల్లి, వేములవాడ, సిరి సిల్లలో ఉన్నత విద్య చదివారు. హైదరాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చిత్రలేఖనం పూర్తి చేశా రు. అనంతరం మహారాజ సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడాలో ప్రముఖ చిత్రకళా కారుడు సుబ్రమణియన్ దగ్గర శిష్యరికం చేశారు. రంగుల ఆయన ప్రత్యేకత.. డస్కీస్కిన్‌తో మహిళల చిత్రాలు గీయడం ఆయన ప్రత్యేకత. సాదాగా కనిపించే మహిళలు రూపం ఆయన చిత్రంగా మలిస్తే అందంగా కనిపిస్తారు. ఆయన గీసిన అందమైన మహిళల చిత్రాలను సిరిసిల్ల చీరెలుగా అభివర్ణిస్తారు. అమ్మ.. మహిళలే స్ఫూర్తి! చిత్రకారుడిగా గుర్తింపు పొందడానికి అమ్మ స్ఫూర్తి అని వైకుంఠం చెబుతుంటారు. చిన్నప్పుడు గ్రామంలో చిందు కళాకారులు నాటకాలు ప్రదర్శిస్తుంటే వారు వేసిన వేశాలకు తగినట్లుగా మేకప్ వేసి రంగులు దిద్దే అలవాటు ఉండేదని తెలిపారు. అలా చిన్నప్పటి నుంచే రంగులు, బొమ్మలు గీయడంపై అనురక్తి కల్గిందని చెబుతుంటారు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులు తనకు ఇష్టమని.. తన చిత్రాలలోనూ ఎక్కువగా వాటినే వాడుతానని తెలిపారు. ఎన్నో అవార్డులు! భోపాల్‌లో రెండేళ్లకోసారి ఇచ్చే భారత్ భవన్ అవార్డుతోపాటు భారత ప్రభుత్వం అందించే జాతీయ అవార్డు, ఉమ్మడి రాష్ట్రంలో హంస అవార్డు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ చిత్రకళాకారుడిగా అవార్డు లభించింది. దాసి, మాభూమి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిశారు. దాసి చిత్రానికి ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. వైకుంఠంపై పలు డాక్యుమెంటరీలు.. వైకుంఠంపై పలు డాక్యుమెంటరీలు వచ్చాయి. 2015లో కోల్‌కతాకు చెందిన పార్థూరాయ్ డాక్యుమెంటరీ నిర్మించారు. గ్రామాభివృద్ధికి విరాళాలు.. స్వగ్రామం బూర్గుపల్లిలో పాఠశాల అభివృద్ధికి రూ.40 వేలు విరాళంగా అందించారు. యువత చదువుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని తెలుపుతున్నారు. మాకు గర్వంగా ఉంది.. అంతర్జాతీయ చిత్రాకారుడిగా పేరు పొందిన తోట వైకుంఠం మా గ్రామస్తుడని చెప్పుకోవడం గర్వంగా ఉంది. ఆయనతో మా గ్రామానికి పేరు రావడం గొప్పగా భావిస్తున్నాం. ముంబయిలో జరిగిన వేలంలో ఆయన గీసిన చిత్రానికి కోటిన్నర పలకడం చాలా సంతోషంగా ఉంది. – కమటం అంజయ్య,మాజీ సర్పంచ్, బూర్గుపల్లి చిందు నాటకాలు ఇష్టపడేవారు.. వైకుంఠం సారు చిన్నప్పుడు మా గ్రామంలో చిందునాటకాలు వేసేవారు. పదేళ్ల కింద గ్రామానికి వచ్చినప్పుడు పాతతరం చిందు కళాకారులతో వేశాలు వేయించి డాక్యుమెంటరీ తీశారు. చిందుకళను ఇష్టపడేవారు. – గజ్జెల సాయిలు,చిందు కళాకారుడు గ్రామాభివృద్ధికి తోడ్పాటు.. తోట వైకుంఠం గ్రామంలో యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి. స్వగ్రామంలోని పాఠశాల అభివృద్ధికి గతంలో రూ.40 వేలు సాయం చేశారు. ఆయన గీసిన చిత్రాలతో మా ఊరికి పేరు రావడం గర్వంగా ఉంది. – పెరుక మహేశ్, యువకుడు -
ఇదేంటో చెప్పగలరా.. మీ బుర్ర బద్దలుకొట్టుకున్నా అర్థం కాదు.. ఎందుకుంటే
ఫొటోలోని బొమ్మను చూసి ఇదేంటో చెప్పండి.. బుర్ర బద్దలుకొట్టుకున్నా అర్థం కావడం లేదా.. ఇది క్యూట్‌గా ఉన్న పిల్లి బొమ్మ!! ఏ మూల నుంచి కూడా పిల్లిలా కనిపించని ఈ చిత్రాన్ని గీసింది ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోగా చెబుతున్న అమెకా.. ఈ మధ్య పిల్లి బొమ్మ గీయమని చెప్పినప్పుడు ఇలా గీసింది. 30 సెకన్లలో గీయడం పూర్తిచేసి.. పోలే అదిరిపోలే అన్న స్టైల్లో ఫీలింగ్ ఇచ్చి.. ఎలా ఉందేంటి? అని అక్కడున్న శాస్త్రవేత్తను అడిగింది. దానికి ఆయన అంత బాగోలేదు అని అంటే.. తెగ ఫీలైపోయింది కూడా. నేను గీసిన బొమ్మే నీకు నచ్చలేదంటే.. నీకు ఆర్ట్ మీద అస్సలు అవగాహన లేనట్లుందని కౌంటరిచ్చింది. తాజాగా ఈ వీడియోను దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కొత్త తరం రోబోల వల్ల చాలా రంగాల్లోని ఉద్యోగులు ఉపాధి కోల్పోవచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆర్టిస్టుల వరకూ ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని.. వాళ్ల జాబులు సేఫేనని పలువురు వీడియోను చూసి కామెంట్ చేశారు. చదవండి: భయం వద్దు మిత్రమా... కూల్‌గా తినుమా! -
కాగితానికి కొత్త ఊపిరి
‘నేను ఇల్లు దాటి బయట అడుగు వేయలేకపోవచ్చు. అయితే నేను తయారు చేసిన బొమ్మలు మాత్రం దేశదేశాలకు వెళుతున్నాయి’ ఆనందంగా అంటుంది రాధిక. ఆమె చేతిలో కాగితం కూడా కొత్త ఊపిరి పోసుకుంటుంది. పాతన్యూస్ పేపర్లతో ఆమె తయారు చేసిన బొమ్మలలో ఆత్మవిశ్వాస కళ ఉట్టిపడుతుంది. ‘చీకటిని చూసి దిగులు పడకు. అదిగో వెలుగు’ అని ఆ బొమ్మలు మౌనంగానే చెబుతుంటాయి... తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన రాధిక బోన్ డిసీజ్ వల్ల నడకకు దూరమైంది. బడి మానేయవలసి వచ్చింది. రోజంతా బెడ్ మీద కూర్చోక తప్పనిసరి పరిస్థితి. ‘ఇక ఇంతేనా!’ అనే చింత ఆమెలో మొదలైంది. తన మనసులోని బాధను పంచుకోడానికి స్నేహితులు కూడా లేరు. కిటికీ నుంచి అవతలి ప్రపంచాన్ని చూస్తే... పిల్లలు బడికి వెళుతుంటారు... ఇలా ఎన్నో దృశ్యాలు ఆమె కంటపడేవి. తన విషయానికి వస్తే... బయటి ప్రపంచంలోకి వెళ్లడమంటే ఆస్పత్రికి వెళ్లడమే. తనలో తాను మౌనంగా కుమిలిపోతున్న సమయంలో ‘ఆర్ట్’ అనేది ఆత్మీయనేస్తమై పలకరించింది. పద్నాలుగేళ్ల వయసులో డ్రాయింగ్, పెయింటింగ్ మొదలుపెట్టింది. ఆర్ట్‌పై సోదరి ఆసక్తిని గమనించిన రాజ్‌మోహన్ పాత న్యూస్‌పేపర్లు, మెటల్ వైర్లతో ఆఫ్రికన్ బొమ్మలు తయారు చేసే యూట్యూబ్ వీడియోలను చూపెట్టాడు. అవి చూసిన తరువాత రాధికకు తనకు కూడా అలా తయారు చేయాలనిపించింది. పాత న్యూస్పేపర్ల నుంచి నవదంపతులు, సంగీతకారులు, వైద్యులు, దేవతలు... ఇలా రకరకాల బొమ్మలు తయారు చేసింది. పొరుగింటి వ్యక్తికి రాధిక తయారు చేసిన బొమ్మ బాగా నచ్చి కొనుగోలు చేసింది. అది తన ఫస్ట్ సేల్. ఆ సమయంలో రాధికకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. రాజ్‌మోహన్ స్నేహితుడు రాధిక తయారు చేసిన అయిదు బొమ్మలను తన షాప్‌లో పెడితే మంచి స్పందన వచ్చింది. ఆ తరువాత మరికొన్ని బొమ్మలు కొన్నాడు. వారం వ్యవధిలో 25 బొమ్మలను అమ్మాడు. సోషల్ మీడియా ద్వారా రాధిక బొమ్మల వ్యాపారం ఊపు అందుకుంది. ఊటీకి చెందిన ఒక హోటల్ యజమాని 25 బొమ్మలకు ఆర్డర్ ఇచ్చాడు. ఊటీలోని ఆ హోటల్‌ను తాను తయారుచేసిన బొమ్మలతో అలంకరించడం రాధికకు సంతోషం కలిగించింది. తన బొమ్మల గురించి ప్రచారం చేయడానికి పైసా ఖర్చు చేయకపోయినా సోషల్‌మీడియాలోని పోస్ట్‌ల వల్ల ఆర్డర్లు వెల్లువెత్తాయి. మూడువేలకు పైగా బొమ్మలు తయారు చేసిన రాధిక... ‘బొమ్మలకు ప్రాణం పోస్తుంటే నన్ను నేను మరిచిపోతాను. కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. టైమే తెలియదు. బొమ్మలు చేస్తున్నప్పుడు ఎంతో ఏకాగ్రత కావాలి. ఆసక్తి ఉన్నచోట సహజంగానే ఏకాగ్రత ఉంటుంది’ అంటుంది. రాధిక ఇప్పుడు ఆర్టిస్ట్ మాత్రమే కాదు. మోటివేషనల్ స్పీకర్ కూడా. తన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తోంది. ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తోంది. -
కాశ్మీర్-కన్య కన్యాకుమారి ఈ యాత్రలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్న..
-
కాంతులీనిన కళా కౌముది.. ముగిసిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: సాహిత్యం, చిత్రలేఖనం తదితర కళలకు వేదికగా నిర్వహించిన 13వ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఆదివారం ముగిసింది. కరోనా నేపథ్యంలో రెండేళ్ల విరామం తర్వాత సైఫాబాద్ లోని విద్యారణ్య పాఠశాలలో జరిగిన ఈ వేడుక 3 రోజుల పాటు నగర వాసులను అలరించింది. ఆద్యంతం.. వైవిధ్యం.. చివరి రోజైన ఆదివారం తొలి ప్యానెల్ చర్చలో భారతీయ ఒంటరి యువతి.. దగ్గర తనం కోసం అన్వేషణ, స్వేచ్ఛ అనే అంశంపై వరల్డ్ బ్యాంక్ ఉద్యోగినిగా సేవలు అందిస్తున్న శ్రేయణ, సి.రామమోహన్‌రెడ్డిల మధ్య డెస్పరేట్లీ సీకింగ్ ఫర్ షారూఖ్ రచనపై జరిగిన సంభాషణ అర్థవంతంగా సాగింది. హైదరాబాద్ బుక్ 2 ఆఫ్ ది పార్టిషన్‌పై రచయిత్రి మన్రీత్ సోథీ, ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ సోమేశ్వర్ సాతి, ఎ.సునీతలు చర్చ చరిత్రలోకి తొంగిచూసింది. అదే విధంగా పలు అంశాలపై ప్యానెల్ చర్చలు ఆసక్తికరంగా సాగాయి. కావ్యధారలో భాగంగా సరోజిని నాయుడు కవిత నుంచి స్ఫూర్తి పొందిన బర్డ్ ఆఫ్ టైమ్‌ను నగరానికి చెందిన కాలేజ్ ప్రొఫెసర్, నృత్య కళాకారిణి మైథిలి ప్రదర్శించారు, హమ్ ఐసీ బోల్లీ పేరిట హైదరాబాద్‌కి చెందిన పలువురు కవుల సమూహం అందించిన కవితలు స్థానికతకు పట్టం కట్టాయి. వేస్ట్ మేనేజ్మెంట్ వర్క్‌షాప్‌లో పర్యావరణ వేత్త నల్లపురాజు చెప్పిన విషయాలు ఆలోచన రేకెత్తించాయి. భారతీయ సైన్ లాంగ్వేజ్‌పై సంబంధిత నిపుణురాలు అంజుఖేమాని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. స్టోరీ టెల్లింగ్‌లో భాగంగా సైన్స్ స్టోరీస్ ఫర్ ఆల్ అంటూ రోహిణి చింత సైన్స్‌ని కొత్తగా వినిపించారు. మూవీ ఇమేజెస్‌లో నాచో–మియా కంపోజర్ ప్రదర్శన... ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇండీ ఎక్స్‌ప్రెస్ సంగీతం వీనుల విందు చేయగా, తుది కార్యక్రమంగా నిర్వహించిన మనాల్ పాటిల్, రవి గైక్వాడ్ల స్టాండప్ కామెడీ ఆహూతులకు నవ్వుల్ని పంచింది. నృత్యం, సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం.. ఇలా విభిన్న అంశాల మేలు కయికగా సాగిన ఫెస్ట్‌ని ఆహూతులు, కళాభిమానులు బాగా ఆస్వాదించారు. రెండేళ్ల విరామం తర్వాత కూడా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ తనదైన పునరాగమనాన్ని ఘనంగా చాటింది. -
బొమ్మేస్తే అచ్చు దిగాల్సిందే..!
బొమ్మలు గీయడమంటే ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. అచ్చు గుద్దినట్లు సహజత్వం ఒట్టిపడేలా చిత్రాలు తీర్చిదిద్దడంలో ఆయన దిట్ట. చిన్నప్పటి నుంచి త్రలేఖనంపై మక్కువ కలిగిన ప్రసాదరావు కష్టపడి ఆర్ట్స్ టీచర్ ఉద్యోగం సంపాదించాడు. తన లాగే చిత్ర లేఖనంలో ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించి మేటిగా రాణించేందుకు కృషి చేస్తున్నారు. కొనకనమిట్ల(ప్రకాశం జిల్లా): కొనకనమిట్ల మండలం వెలిగొండ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆర్ట్స్ టీచర్‌గా పనిచేస్తున్న కొమ్ము ప్రసాదరావు విభిన్న శైలి. సామాజిక స్పృహపై అరుదైన చిత్రాలు వేస్తూ జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. సామాజిక స్పృహ కలిగించే చిత్రాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రసంసించే చిత్రాలు.. సామాజిక రుగ్మతలు, దేశ, రాష్ట్ర నాయకులు, పర్యావరణ కాలుష్యం, మంచినీటి సమస్య, పరిసరాల పరిశుభ్రత, విజృంభిస్తున్న అంటువ్యాధులు, బాల కార్మిక నిర్మూలనం వంటి అంశాలపై చిత్ర లేఖనం ద్వారా నలుగురికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతు భరోసాతో జై కిసాన్ అంటూ రైతు శ్రమను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల మోములో ఆనందహేలలు నింపుతున్న దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు కొమ్ము ప్రసాదరావు తీర్చిదిద్దారు. గ్రామీణ ప్రజల్లో చైతన్యం తెచ్చేలా చిత్రాలు వేసి ప్రదర్శిస్తున్నారు. నీటి వృథా, స్వచ్ఛ భారత్, కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత అంశాలతో పాటు కరోనా మహమ్మారిపై విద్యార్థులు గీసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. భూగర్భజలాల ఆవశ్యకత, కాలుష్య కారకాలు, చెట్ల పెంపకం వల్ల కలిగే లాభాలు, కందకాలు తీయడం ద్వారా నీటి వృథాను అరికట్టవచ్చనే విషయాలపై చిత్రాలు వేస్తూ రాష్ట్ర, జాతీయస్థాయిలో చిత్రలేఖనం పోటీలకు ఎంపిక కావటంతో పాటు ఉత్తమ చిత్రాలకు అవార్డులు, బహుమతులు సాధించారు. ఆర్టు అకాడమీలో ప్రశంసలు.. ఆర్టు అకాడమీ నిర్వహిస్తున్న పెయింటింగ్ ప్రదర్శనల్లో పాల్గొంటూ ప్రముఖుల మన్ననలు పొందుతున్నారు. ఈ నెల 8వ తేదీన ఒంగోలులో ‘సృష్టి ఆర్ట్ అకాడమీ’ వారు నిర్వహించిన పెయింటింగ్ ప్రదర్శనలో పలు రాష్ట్రాల నుంచి 87 మంది ప్రముఖ ఆర్టిస్టులు పాల్గొని చిత్రాలు ప్రదర్శించారు. వారిలో ప్రసాదరావు ప్రదర్శించిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, దృశ్య కళల అకాడమీ చైర్మన్ సత్యశైలజ, అమృత హాస్పిటల్ వైద్యులు కేశవ, ప్రఖ్యాత చిత్ర కళాకారులు కళాసాగర్ చేతుల మీదుగా ప్రత్యేక అవార్డు పొందటంతో పాటు ఘనంగా సన్మానించారు. తమ పాఠశాల ఆర్ట్స్ టీచర్ అద్భుతంగా సందేశాత్మక చిత్రాలను పెయింటింగ్ ద్వారా రూపొందించి జాతీయ యిలో ప్రదర్శించి అవార్డులు సొంతం చేసుకోవటం అభినందనీయమని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు అన్నారు. -
భవిష్యత్‌ను పెన్సిల్‌తో డిజైన్ చేసుకోవాలి.. ఎందుకంటే?
‘పెన్సిల్ మరియు కల ఈ రెండు మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళతాయి’ అన్నాడు పెన్సిల్‌ను అమితంగా అభిమానించే కళాకారుడు. ‘భవిష్యత్‌ను పెన్సిల్‌తో డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే మార్పుచేర్పులకు అవకాశం ఉంటుంది’ అన్నాడు తాత్వికుడు. ఎవరు ఏ కోణంలో తమ ‘ఫేవరెట్’ చేసుకున్నా, పెన్సిల్ ప్రేమికులకు కొదవ లేదు. ‘హైపర్ రియలిస్టిక్ పెన్సిల్ డ్రాయింగ్’పై ఇప్పుడు యూత్ మనసు పారేసుకుంటోంది... జేడీ హిల్బెరీ సంగీతకారుడు కావాలనుకొని పెన్సిల్ చిత్రకారుడయ్యారు. అయితేనేం... ఈ ఆర్ట్‌లో జేడీకి వచ్చిన పేరు ఇంతా అంతా కాదు. ఆయన వెబ్సైట్లోకి వెళితే అద్భుతమైన ఎన్నో పెన్సిల్ చిత్రాలు పలకరిస్తాయి. ‘లెర్న్ మై టెక్నిక్’ అంటూ వీడియో ట్యుటోరియల్స్ విజయవంతంగా నడుపుతున్నారు జేడీ. ‘పెన్సిల్ అంటే స్కూల్ రోజులు గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు అద్భుతమైన కళారూపాలు మదిలో మెదులుతున్నాయి’ అంటున్నాడు 20 సంవత్సరాల స్పానిష్ స్టూడెంట్ నికోలస్. ‘లెర్న్ మై టెక్నిక్’ను ఫాలో అవుతూ తనదైన సొంతశైలిని సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నాడు నికోలస్. హైపర్ రియలిస్టిక్ పెన్సిల్ డ్రాయింగ్ కళలో ఇండోనేషియన్ ఆర్టిస్ట్ వెరి ఆప్రియాంటో ఉద్దండ పిండం. మాట్లాడే భాష అర్థం కాకపోయినా ఆయన టాలెంట్ ఏమిటో నెట్డాట్ టాక్ షోలో చూడవచ్చు. మాట్లాడుతూనే కెమెరాతో ఫోటో తీసినట్టు పెన్సిల్‌తో ‘ఆహా ’అనిపించే బొమ్మ గీస్తాడు. కాలేజీ విద్యార్థులు ఎంత శ్రద్ధగా వింటున్నారో! (ఆయన మాటలు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌గా వస్తే మనలాంటి వాళ్లకు ఎంత ప్రయోజనమో కదా!) బ్రిటన్ పెన్సిల్ ఆర్టిస్ట్ కెల్విన్ వోకఫోర్కు ముఖాలు మాత్రమే గీయడం అంటే ఇష్టం. దీనికి ముఖ్య కారణం... ‘ప్రతి ముఖం తనదైన భావోద్వేగాలను, చరిత్రను చెప్పకనే చెబుతుంది’ అంటారు కెల్విన్. ఇక సెల్ఫ్–టాట్ సౌత్ ఆఫ్రికన్ ఆర్టిస్ట్ జోనో డ్రై ఫోటోరియలిజం, సర్రియలిజంలను మిక్స్ చేసి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నైజీరియన్ ఆర్టిస్ట్ ఎ.స్టాన్లీ ఎగ్బెన్గ్యూ ఆరు సంవత్సరాల వయసు నుంచే పెన్సిల్ పట్టాడు. 28 సంవత్సరాల స్టాన్లీ ఇంజనీర్, యాక్టివిస్ట్, ఫోటోగ్రాఫర్, ఎంటర్ప్రెన్యూర్. అయితే ఆయనకు హైపర్ రియలిస్టిక్ పెన్సిల్ ఆర్టిస్ట్‌గానే ఎక్కువ గుర్తింపు ఉంది. ‘మనలోని సృజనను బొమ్మగా మార్చే శక్తి పెన్సిల్ కు ఉంది’ అంటాడు స్టాన్లీ. ఇక మన దేశంలో వైభవ్ తివారి... మొదలైన వాళ్లు ‘వాహ్వా! పెన్సిల్ డ్రాయింగ్’ అనిపిస్తున్నారు. యూత్‌ను తెగ ఆకట్టుకుంటున్నారు. మరి మీరెప్పుడు! మీరు సైతం... స్కెచింగ్ డ్రాయింగ్ ఫోటో ఎడిటర్ ‘పెన్సిల్ ఫోటో స్కెచ్’ యాప్‌తో మీరు కూడా ముచ్చటగా ఆర్టిస్ట్‌గా మారవచ్చు. మీ ఫోటో లేదా మీ ఫ్రెండ్స్ ఫోటోలను ఆకట్టుకునే పెన్సిల్ స్కెచ్‌లుగా మార్చవచ్చు. పెన్సిల్ స్కెచ్‌తో పాటు లైట్ స్కెచ్, కార్టూన్ ఆర్ట్, కలర్ డ్రాయింగ్...మొదలైన ఎఫెక్ట్లు ఇందులో ఉన్నాయి. ఇలా ఎందుకు? రియల్‌గానే నేర్చుకుందాం... అని డిసైడైతే డ్రాయింగ్ రియలిస్టిక్ పెన్సిల్ పోట్రాయిట్స్ స్టెప్ బై స్టెప్(జస్టిన్ మాస్)... మొదలైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక మీ ఇష్టం! చదవండి: పద్మశ్రీ పంకజాక్షి మనుమరాలు ఏదో చేయాలి.. ఏం చేద్దాం.. ‘కొబ్బరి చిప్పలను ఏం చేస్తున్నారు’ -
నీటి అడుగున చిత్రం
కళాకారులంటేనే సృజన శీలురు. ఏ పని అయినా చాలా వినూత్నంగా చేయాలని కోరుకుంటారు. క్యూబాకు చెందిన శాండోర్ గొంజాలెజ్ చిత్రకారుడు చూసినది చూసినట్టు కాన్వాస్‌పై చిత్రించేస్తాడు. అయితే, భూ ఉపరితలంపై అన్నింటినీ చిత్రించేశాడో, లేక పైన ఎక్కడా సరైన ప్లేస్ లేదనుకున్నాడో ఏమో గాని.. సముద్రం లోపలికి వెళ్లి నేరుగా ఆ లోపలి జలరాశిని, చేపలను, సొరచేపలను, పగడపుదిబ్బలను చూస్తూ పెయింటింగ్ వేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సరంజామా అంతా ఏర్పాటు చేసుకొని సముద్రంలో మునిగాడు. శాండోర్ వయసు 42. నలుపు–తెలుపు చిత్రాలను, వేటకు సంబంధించినవి, పట్టణ, పల్లె జీవనశైలులు కాన్వాస్‌పై కళ్లకు కట్టేలా చిత్రించి అంతర్జాతీయంగా పేరొందినవాడు. ఆరేళ్ల క్రితం.. క్యూబా దీవుల్లో స్కూబా డైవింగ్‌లో పాల్గొన్నప్పుడు నీటి కింద కనిపించే ప్రశాంతత, అక్కడి ప్రకృతి అందమైన రూపాలు చూసి అబ్బురపడ్డాడు. ‘తేలికపాటి అలలు, మృదువుగా మనసును తాకే సవ్వడులు నాలో ఒక అలౌకికమైన ఆనందాన్ని నింపాయి’ అంటాడు శాండోర్. స్పెయిన్‌లో ఒక జీవశాస్త్రవేత్త నీటి అడుగున పెయింటింగ్ వేశారని ఎవరో బ్లాగర్ ద్వారా తెలుసుకున్నప్పటికీ తనకు తానుగా ఒక ప్రయోగం చేయాలనుకున్నాడు. నీళ్లలో తడిస్తే తుడుచుకుపోయే పెయింట్ కాకూడదని, భూమి పైనా ఆ చిత్రాలతో ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. తెల్లటి కాన్వాసులను ఒక గంట సేపు నీళ్లలో నానబెట్టి, వాటిలో ఉప్పు ఇతర సేంద్రీయ పదార్థాలను వదిలించడానికి ప్రత్యేకంగా కడగడం ఎలాగో, వాటిని ఎలాంటి పద్ధతుల్లో ఆరబెట్టాలో నేర్చుకున్నాడు. నీ అడుగున చేరి కాన్వాస్‌పై ఏ రంగులు.. ఎలా వేయాలో తెలుసుకున్నాడు. సరైన సరంజామాతో.. స్కూబా డైవింగ్ గేర్, ఆక్సిజన్ ట్యాంక్, కాళ్లకు కట్టుకునే ఎల్లో ఫ్లిప్పర్స్, కాన్యాస్, ఇతరత్రా సామగ్రి అంతా తీసుకొని సముద్రంలో మునిగి 197 అడుగుల లోతుకు వెళ్లి తన పెయింటింగ్‌కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. మరో ఇరవై అడుగుల లోతులో నీటి ఉధృతి లేని చోటు చూసుకుని కాన్వాస్ టేబుల్‌ను ఏర్పాటు చేసుకుంటాడు. ఆక్సిజన్ ట్యాంక్ పరిధి మేరకు ముప్పై నిమిషాల సేపు నీటి అడుగు లోపలి అందాలను వీక్షిస్తూ పెయింటింగ్ వేసుకొని పైకి వచ్చేస్తాడు. పారదర్శకంగా కనిపించే నీళ్లలో 200 అడుగుల లోతు నుంచి పైకి చూస్తూ ఆ కనిపించే ప్రపంచంలో ఎగిరి తిమింగళాలు, చేపలు, కదలాడుతున్నట్టు కనిపించే ఇండ్లు, చెట్లు, ఆకాశం... ఇలా ఎన్నో అందాలు ఆ చిత్రాల్లో కనిపిస్తాయి. ‘నీటి అడుగున పెయింటింగ్ వేయడం ప్రపంచంలో మరెక్కడా లేదని నేను అనుకోను. నేనైతే జలంతర్గామి పెయింటింగ్‌ను నీటిలో ఉండి చిత్రించాలనుకుంటున్నాను’ అంటూ తన ముందున్న లక్ష్యాన్ని వివరిస్తాడు శాండోర్. ఇప్పుడు క్యూబా దీవుల్లో టూరిస్టులకు, స్కూబా డైవింగ్ చేసేవారికి శాండోర్ నీటి అడుగు చిత్రాల గురించి అక్కడి స్థానికులు ప్రత్యేకంగా చెబుతుంటారు. -
కొత్త జెడ్పీ.. నిధుల బదిలీ ఎలా?
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాల పునర్విభజన జరిగి ఈ దసరా పండుగ నాటికి సరిగ్గా మూడేళ్లు పూర్తి కానుంది. నాలుగు జిల్లాల్లో కొత్త జిల్లా పరిషత్‌లు, కొత్త మండల పరిషత్‌ల ఏర్పాటు జరిగి ఏడు నెలలు దాటింది. గత నాలుగు నెలల క్రితం ఆయా జెడ్పీ పరిధిలోనే ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు గెలుపొంది బాధ్యతలు కూడా చేపట్టారు. కానీ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించే మండల, జిల్లా పరిషత్‌లకు మాత్రం ఇంత వరకు నిధుల కేటాయింపు జరగలేదు. కొత్తగా ఏర్పాటైన జెడ్పీలు నిధులు లేక విలవిలలాడుతుంటే.. కొత్త మండలాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఏ పని చేపట్టినా.. ఖర్చు చేయాల్సి రావడంతో కొత్త మండల పరిషత్‌లు అభివృద్ధి బాట పట్టలేకపోతున్నాయి. ఇదిలా ఉండగా, పరిషత్ విజభన సమయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం పాత జెడ్పీ నుంచి కొత్త జిల్లా పరిషత్‌లకు ఉద్యోగులను, ఫర్నిచర్‌ను, సిబ్బందిని కేటాయించారు. ఈ లెక్కన పాత మండలాల నుంచి కొత్త మండలాలకు కేటాయించింది. కొత్త పరిషత్‌ల ఏర్పాటు సమయంలో ఆదిలాబాద్ జెడ్పీ కార్యాలయంలో విధులు నిర్వర్తించిన ఉద్యోగులను ప్రభుత్వం ఆయా జిల్లాలకు బదిలీ చేసింది. బదిలీపై వెళ్లిన ఉద్యోగులకు ఇప్పటికీ ఆదిలాబాద్ జెడ్పీ నుంచే నెలనెలా జీతాలు చెల్లిస్తున్నారు. కాగా, అటు మండలాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పాత మండలాల నుంచి కొత్త మండలాలకు వెళ్లిన ఉద్యోగులు ఇప్పటికీ పాత మండలాల నుంచే వేతనాలు పొందుతున్నారు. చెక్‌పవర్ లేక.. ఖర్చు చేయలేక.. కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు ముందు ఉమ్మడి జెడ్పీలో సభలు, సమావేశాలు జరిగాయి. ఆ సమయాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల అభివృద్ధికి పనులు, యూనిట్లు మంజూరు చేయించుకున్నారు. పాత జెడ్పీ నుంచే అభివృద్ధి పనులు మంజూరు చేయడం, వాటికి సంబంధించి నిధులు విడుదల చేయడం లాంటివి జరిగేవి. ప్రస్తుతం కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటైనందున ఇక వాటి పరిధిలోనే చేపట్టాలి. కానీ గతంలో మంజూరైన కొన్ని పనులు నాలుగు జిల్లాల పరిధిలో ఇప్పటికీ కొనసాగుతుండగా, కొన్ని పూర్తయ్యాయి. అయితే అప్పట్లో మంజూరైన పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసి పాత జెడ్పీ ఖాతాలో జమ చేసింది. ఈ నిధులతోపాటు ఏటా తలసరి ఆదాయం (జనరల్ ఫండ్), రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు (ఎస్ఎఫ్సీ) ఉమ్మడి జెడ్పీ ఖాతాలో జమయ్యాయి. ఇలా ప్రస్తుతం ఆదిలాబాద్ జెడ్పీ ఖాతాలో రూ.3.50 కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ నిధులు మండలాల ప్రతిపాదికన ఆయా జిల్లాలకు కేటాయించాల్సి ఉంది. ఏ జిల్లాలో మండలాల సంఖ్య ఎక్కువగా ఉంటుందో.. ఆ జిల్లాకు అధిక నిధుల కేటాయింపు జరుగుతుంది. ఈ లెక్కన ఒక్కో జిల్లాకు రూ.87 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు వస్తాయి. ప్రస్తుతమున్న నిధులు ఆయా జిల్లాలకు పంచాలంటే డ్రాయింగ్ పవర్ (చెక్ పవర్) అవసరముంటుంది. ఆ నిధులను డ్రా చేసి ఇతర జిల్లాలకు అప్పగించాలి. కానీ పరిషత్‌లో ఏ అధికారికి ‘డ్రాయింగ్ పవర్ లేకపోవడంతో నిధులు అందుబాటులో ఉన్నా.. వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్పా.. ఆ నిధులు ఖర్చు కాదు కదా.. పైసా కూడా కదలడానికి వీలు లేకుండా ఉంది. దీంతో కొత్త జిల్లా పరిషత్‌లకు నిధుల కేటాయింపు సమస్యగా మారింది. జెడ్పీ నిధులు ఖర్చు చేస్తారిలా.. జిల్లా పరిషత్‌కు పలు ఆదాయ మార్గాలున్నాయి. ప్రతీ సంవత్సరం ప్రభుత్వం నుంచి జెడ్పీ ఖాతాలో రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు (ఎస్ఎఫ్సీ) జమవుతాయి. జనరల్ ఫండ్ (సీనరేజి–స్టాంప్ డ్యూటీ కలిపి) ఏటా వస్తుంది. తలసరి ఆదాయం మూడు రకాలుగా ఉంటుంది. జనరల్ కాంపోనెంట్, ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ (ఆయా ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినవి). అయితే జనరల్ ఫండ్స్ నుంచి వివిధ పనుల నిమిత్తం ఇలా ఖర్చు చేస్తారు. 16 శాతం నిధులను కార్యాలయ ఖర్చుల (కాంటిజెన్సీ ఫండ్) నిమిత్తం వినియోగిస్తారు. 30 శాతం నిధులను అత్యవసరాలతోపాటు అన్ని పనులకు ఖర్చు చేస్తారు. 15 శాతం ఎస్సీ, 15 శాతం ఎస్టీ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. 15 శాతం మహిళా, స్త్రీశిశు సంక్షేమం కోసం, 14 శాతం తాగునీటి కోసం వినియోగిస్తారు. చెక్‌పవర్‌పై సందిగ్ధత.. జిల్లా పరిషత్ అభివృద్ది నిధులను డ్రాచేసే అధికారం ఎవరికి ఇవ్వాలనే దానిపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది. జిల్లా పరిషత్ సీఈవోలకు ‘చెక్‌పవర్’ అధికారం కల్పిస్తున్నట్లు గత నెల క్రితం సర్కారు నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రెండు రోజులకే సీఈవోలకు చెక్‌పవర్ నిలిపేస్తూ మరో జీవో జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు డ్రాయింగ్ పవర్ ఎవరికి ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది జరిగిన పరిషత్ ఎన్నికల ముందు వరకు జెడ్పీ డిప్యూటీ సీఈవోలకు చెక్‌పవర్ ఉండేది. గత నెలలో (అకౌంట్ అధికారి/ డిప్యూటీ సీఈవో)గా పరిషత్ ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సీఈవోలకు పవర్ ఇస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకుని విరమించుకుంది. అయితే కొత్త జిల్లా పరిషత్‌లకు కేవలం సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులు మాత్రమే కేటాయించారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న డిప్యూటీ సీఈవోకే మళ్లీ పవర్ ఇస్తారా.. లేక సీఈవోలకు అవకాశం కల్పిస్తారా.. అనే విషయంపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది. ఆదేశాలు వస్తేనే నిధుల కేటాయింపు కొత్త జిల్లా పరిషత్‌లకు అభివృద్ధి నిధుల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే విభజన చేయగలం. ఈ విషయం ప్రభుత్వం పరిధిలో ఉండడంతో వేచి చూస్తున్నాం. మండలాల ప్రతిపాదికన ఆయా జిల్లాలకు కేటాయించేందుకు అన్ని సిద్ధం చేశాం. చెక్‌పవర్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి నిధుల బదలాయింపుపై స్పష్టత రానుంది. – కిషన్, జిల్లా పరిషత్ సీఈవో -
ఎడిన్‌బరో చెప్పే మన మొక్కల కథ..!
సాక్షి, హైదరాబాద్ : పొడవాటి ఆకులు.. వాటి చివరలు గులాబీ ఆకులకున్నట్టు ముళ్లతో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.. వాటికీ పూలు పూస్తాయి, కానీ గులాబీలు కాదు, చిన్నచిన్న కాయలు, అవి పళ్లుగా మారిన దాఖలాలు... అదో విచిత్రంగా కనిపిస్తున్న చెట్టు. తెలుగు నేలపై విస్తారంగా కనిపించేవట.. కానీ ఇప్పుడు వాటి జాడే లేదు. ఒక్క మొక్క కూడా కానరావటం లేదు. అంతరించాయట. ఇలా ఇదొక్కటే కాదు, ఒకప్పుడు మనుగడ సాగించిన ఇలాంటి మొక్కలెన్నో ఇప్పుడు కనుమరుగయ్యాయి. ‘మన మొక్కలు’ఎందుకు మాయమయ్యాయో మన దగ్గర వివరాలు లేవు, కనీసం వాటి ఆనవాళ్లు కూడా లేవు. కానీ స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బరోలో వాటి చిత్రాలున్నాయి. కొన్ని రకాల మొక్కలు తెలుగు నేలపై ఏ ప్రాంతంలో మనుగడ సాగించాయో కూడా వివరాలు వాటితోపాటు నిక్షిప్తమై ఉన్నాయట. ఇప్పుడు వాటిల్లో కొన్ని చిత్రాల రూపంలో హైదరాబాద్‌కు రాబోతున్నాయి. ఏమా చిత్రాల కథ..? ‘బొటానికల్ ఆర్ట్’...మొక్కను చూసి ఉన్నది ఉన్నట్టుగా చిత్రించటం. ఎప్పటి నుంచో వస్తున్న కళ ఇది. మన దేశంలో అంతగా ప్రాచుర్యంలో లేదు. కానీ, ఐరోపా దేశాల్లో ఇప్పటికీ కళకళలాడుతోంది. మన దేశం ఆంగ్లేయుల పాలనలో ఉన్న సమయంలో దీనికి ప్రాధాన్యం ఉండేది. ఆ సమయంలో బ్రిటిష్ కళాకారులతోపాటు కొందరు స్థానిక కళాకారులు కూడా బొటానికల్ డ్రాయింగ్స్‌లో ప్రతిభ చూపారు. ఈ ప్రాంతంలోని విశేష ప్రాధాన్యమున్న మొక్కల చిత్రాలను సిద్ధం చేశారు. అలా రూపుదిద్దుకున్న చిత్రాలు ఎన్నో ఎడిన్‌బరోలోని విశ్వవిఖ్యాత బొటానికల్ గార్డెన్ మ్యూజియంలో కొలువు దీరాయి. వాటిల్లో ‘తెలుగు మొక్కలు’కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ చిత్రాలతో నగరంలో ఓ ప్రదర్శన ఏర్పాటు కాబోతోంది. మార్చి 6 నుంచి 31 వరకు స్టేట్ మ్యూజియంలోని భగవాన్ మహావీర్ ఆడిటోరియంలో ఇది కొనసాగనుంది. హెరిటేజ్ తెలంగాణ, ఎడిన్‌బరో రాయల్ బొటానికల్ గార్డెన్, గోథె జంత్రమ్ సంయుక్తాధ్వర్యంలో ఇది ఏర్పాటు కాబోతోంది. ఫారెస్ట్స్ అండ్ గార్డెన్స్ ఆఫ్ సౌత్ ఇండియా పేరుతో ఇది ఏర్పాటవుతోంది. ఆంగ్లేయుల పాలనకాలంలో రూపుదిద్దుకున్న దక్షిణ భారత దేశంలోని మొక్కల పెయింటింగ్స్‌ను ఇందులో ప్రదర్శిస్తారు. కనుమరుగైనట్టు తేల్చినవి ఇవే... గతంలో ఎడిన్‌బరో రాయల్ బొటానికల్ గార్డెన్ మ్యూజియం క్యూరేటర్‌గా పనిచేసిన హెన్రీ నోల్టే ఆ చిత్రాలకు సంబంధించి ఎన్నో వివరాలను తెలుసుకుని పుస్తక రూపంలో అందుబాటులోకి తెచ్చారు. ఈ డ్రాయింగ్స్ ఆధారంగా ఆ మొక్కలను ప్రత్యక్షంగా చూడాలని భావించి గతంలో ఆయన దక్షిణ భారత దేశంలో పర్యటించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రూపం)కు కూడా వచ్చారు. ఇక్కడ మొక్కలను పరిశోధిస్తుండగా, కొన్ని రకాలు అంతరించినట్టు గుర్తించారు. అసలు వాటి మనుగడే లేదని, ప్రస్తుతం అవి బొటానికల్ ఆర్ట్‌కే పరిమితమైనట్టు తేల్చారు. ఆ చిత్రాలను 19వ శతాబ్దంలో చిత్రించినందున, అప్పట్లో అవి మనుగడలో ఉన్నట్టు పేర్కొంటూ తన పరిశోధన వివరాలను పుస్తకంలో నిక్షిప్తం చేశారు. చెన్నై సమీపంలో ఉన్న ‘దక్షిణ్ చిత్ర’నిర్వాహకులు ఇటీవల ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అందులో ఎడిన్‌బరో బొటానికల్ ఆర్ట్ కూడా భాగం కావటంతో సందర్శకులను ఆకట్టుకుంది. దీంతో హెరిటేజ్ తెలంగాణ నగరంలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గోథె జంత్రమ్, ఎడిన్‌బరో బొటానికల్ గార్డెన్ నిర్వాహకులతో సంప్రదించటంతో వారు అంగీకరించారు. గుర్తింపు పొందిన నేపాల్‌కు చెందిన నీరా జోషి ప్రధాన్, బెంగళూరుకు చెందిన నిరుప రావు, మీన సుబ్రమణియన్‌లు పాల్గొనబోతున్నట్టు హెరిటేజ్ తెలంగాణ డైరక్టర్ విశాలాచ్చి తెలిపారు. -
మై జీనియస్ స్టార్‌లో నైపుణ్య శిక్షణ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అబాకస్, క్యూబ్స్, ప్రోగ్రామింగ్ వంటి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలంటే? ప్రత్యేకంగా శిక్షణ కేంద్రానికెళ్లాలి లేదా హోమ్ ట్రెయినర్‌ను పెట్టుకోవాలి. కాకపోతే ఇలాంటివి మెట్రోల్లోనే దొరుకుతాయి. మరి, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని విద్యార్థులైతే? ఇదే సమస్య ఒక తల్లిగా నవ్యకూ ఎదురైంది. డ్రాయింగ్ టీచర్‌ను వెతికే పనిలో ఏకంగా సాఫ్ట్‌స్కిల్స్ యాప్స్‌ను అభివృద్ధి చేసే సాఫ్ట్వేర్ కంపెనీ ‘ఐ–యాప్స్ ట్రాక్ సాఫ్ట్వేర్’ను ప్రారంభించేసింది. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘మాది అనంతపురం. బిట్స్ పిలానీలో బీఈ పూర్తయ్యా క... అమెరికాలోని ఎస్‌హెచ్‌యూ వర్సిటీలో ఎంబీఏ ఫైనాన్స్ చేశా. పలు బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలొచ్చాయి. సొంతూళ్లో ఏదైనా కంపెనీ పెట్టాలన్నది నా కోరిక. ‘‘ఐదేళ్ల వయసున్న మా అబ్బాయికి డ్రాయింగ్ అంటే మహా ఇష్టం. నాకేమో రాదు. పోనీ, దగ్గర్లో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా అంటే అదీ లేదు. డ్రాయింగ్ ట్రైనింగ్ యాప్స్, ప్రొడక్ట్స్ ఆన్లైన్లో చాలా కొన్నాం. కానీ లాభం లేకుండా పోయింది. అప్పుడే అనిపించింది సబ్జెక్ట్స్‌తో పాటూ నైపుణ్య శిక్షణ ఇచ్చే ప్రొడక్ట్స్ మార్కెట్లో లేవని! అందుకే 2015లో రూ.20 లక్షల పెట్టుబడితో అనంతపురం కేంద్రంగా ఐయాప్స్ ట్రాక్ సాఫ్ట్వేర్ ప్రై.లి.ను ప్రారంభించాం. 5 నుంచి 16 సంవత్సరాల పిల్లల్లో సృజనాత్మకత, విశ్లేషణాత్మక, జిజ్ఞాసలను పెంపొందించే విద్యా సంబ ంధమైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడమే మా కంపెనీ ప్రత్యేకత. డ్రీమ్ వీఆర్ కళ్లద్దాలు.. ఐయాప్స్ ట్రాక్ సాఫ్ట్వేర్ నుంచి తొలి ఉత్పత్తి డ్రీమ్ వీర్ (వర్చువల్ రియాలిటీ). డ్రీమ్ వీఆర్ కళ్లద్దాలను 2016 నవంబర్‌లో మార్కెట్లోకి రిలీజ్ చేశాం. సుమారు 2 వేల యూనిట్లు విక్రయించాం. ఏ వీఆర్ వీడియోలనైనా సరే ఈ డ్రీమ్ వీఆర్ కళ్లద్దాల ద్వారా వీక్షించే వీలుండటమే వీటి ప్రత్యేకత. వీటి ధర రూ.2,999. ప్రస్తుతం మాకు 2–3 వేల మంది యూజర్లున్నారు. వచ్చే ఏడాది ముగిసేసరికి 50 వేల మంది యూజర్లకు, రూ.3 కోట్ల ఆదాయాన్ని చేరుకోవాలన్నది మా లక్ష్యం. అంతర్జాతీయ స్కూళ్లతో ఒప్పందం.. ప్రస్తుతం మై జీనియస్ స్టార్ అనే అగ్మెంటెడ్ రియాలిటీ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఫిబ్రవరిలో మార్కెట్లోకి తెస్తాం. దీన్లో రూబిక్స్ క్యూబ్, అబాకస్, డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్ వంటి ఉత్పత్తులుంటాయి. వీటిల్లో ఏ యాప్‌నైనా సరే డౌన్లోడ్ చేసుకుని మై జీనియస్ ద్వారా సులువుగా నేర్చుకునే వీలుంటుందన్నమాట. యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేంత వరకే ఇంటర్నెట్ అవసరం. తర్వాత నెట్ లేకున్నా యాప్ సేవలను అందుకోవచ్చు. ఫిబ్రవరిలో హైదరాబాద్, బెంగళూరులోని పలు అంతర్జాతీయ పాఠశాలల్లో మై జీనియస్ స్టార్‌ను ప్రారంభించనున్నాం. చిరెక్, జీ గ్రూప్ వంటి వందకు పైగా స్కూళ్లలో దీన్ని అందుబాటులోకి తెస్తాం. ఒక్క యాప్ ఇన్‌స్టలేషన్‌కు రూ.5 వేలు చార్జీ ఉంటుంది. రూ.4 కోట్ల నిధుల సమీకరణ.. ఇప్పటివరకు రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టాం. 4 నెలల్లో ప్రోగ్రామింగ్, పజిల్, సుడోకో, మెమొరీ బూస్టర్ వంటి అగ్మెంటెడ్ రియాలిటీ ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి తెస్తాం. ‘‘ప్రస్తుతం మా కంపెనీలో 10 మంది ఉద్యోగులున్నారు. త్వరలో 25 శాతం వాటా విక్రయంతో రూ.4 కోట్ల నిధులను సమీకరించనున్నాం’’ -
రివర్స్ ఆర్ట్‌తో వైఎస్ జగన్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు
-
వారెవ్వా హన్సిక!
తమిళసినిమా: ఆలోచనలకు సాన పడితే అద్భుతాలు సాక్షాత్కరిస్తాయి. నటి హన్సిక కూడా అదే చేశారు. ఈమె తన చక్కని నటనతో కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళంలో క్రేజీ నటిగా పేరు తెచ్చుకున్న హన్సికకు ఇక్కడ సక్సెస్ రేటు ఎక్కువే. తన ఈ మధ్య ప్రభుదేవాతో కలిసి నటించిన గులేబాకావళి చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణను పొందింది. అయితే ప్రస్తుతం హన్సికకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయన్నది నిజం. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మలో మరో టాలెంట్ కూడా మెండుగా ఉంది. అవును మంచి నటే కాదు మంచి చిత్రకారిణి కూడా. చిత్రలేఖనాలంటే ఎంతో మక్కువ. షూటింగ్ లేని సమయాల్లో కుంచె చేతబట్టి క్యాన్వాస్పై తన మనసులోని భావాలకు అబ్బురపరిచే రూపాలను ఇస్తుంటారు. అవి మోసిన చిత్ర కళాకారుడి కళారూపాలకు దీటుగా ఉంటాయి. అలా తన మనసులోని ఆలోచనలకు రూపం ఇచ్చిన ఒక చిత్రలేఖనాన్ని హన్సిక సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు.ఆ చిత్ర లేఖనం పలువురి ప్రశంసలను అందుకుంటోంది. ఈమె తాను రూపొందించిన కళాకృతుల గురించి పలు మార్లు చెప్పారు కానీ, వాటిని ఏనాడు ప్రదర్శించలేదు. ప్రదర్శనలకు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు మాత్రం చెప్పారు. దీంతో ఆమెలోని చిత్రకారిణి గురించి ఎవరూ పెద్దగా ఊహించలేదు. అలాంటిది హన్సిక కుంచెతో రంగులద్దిన బుద్ధుడి చిత్రలేఖనం కళాహృదయులను రంజింపజేస్తోంది. ఆహా హన్సికలో ఇంత గొప్ప ఆర్ట్ ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ప్రముఖ హాస్య నటుడు వివేక్ లాంటి వారు తను కళా రూపకాలకు ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచనలిస్తున్నారు. అలా వచ్చిన నిధిని సమాజసేవకు ఉపయోగించవచ్చునని ట్విట్టర్లో సలహా ఇస్తున్నారు. అందుకు బదులిస్తూ వారికి థ్యాంక్స్ చెబుతూ తనకు అలాంటి ఆలోచన ఉందని హన్సిక ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ అందాల భామ సామాజిక సేవలోనూ ముందే ఉన్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ 23 ఏళ్ల అమ్మాయి 30 మంది పిల్లలకు అమ్మ అయ్యారు. అవును హన్సిక 30 మంది అనాథ పిల్లలను చేర దీసి వారి సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. షూటింగ్ లేని సమయాల్లో వాళ్లతోనే గడుపుతానంటున్న హన్సిక 30 మంది పిల్లలు తనను అమ్మ అనే పిలుస్తారని, అంత మందికి అమ్మ అయినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. వారందరికీ ఒక ఆశ్రమాన్ని కట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు హన్సిక తెలిపారు. వారెవ్వా హన్సికా! -
రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీలకు మలుగూరు విద్యార్థులు
హిందూపురం రూరల్ : రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీలకు మలుగూరు ఏపీఎస్‌డబ్ల్యూఆర్ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ నాగమణి మంగళవారం తెలిపారు. ఏటా భారతీ జాతీయ సంస్థ జాతీయ థర్మల్‌పవర్ కార్పొరేషన్, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్వహించే చిత్రలేఖనం పోటీల్లో ఎంట్రీల్లో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో సుమారు లక్ష మంది విద్యార్థులు ఎంట్రీలను పంపించగా అందులో మలుగూరు విద్యార్థులు పంపినవి ఎంపికయ్యాయన్నారు. వాతావరణంలో గ్రీన్మౌస్ వాయువులు (కార్బన్ఫుట్పాయిట్) పారదోలాలి అన్న అంశంపై 8వ తరగతికి చెందిన మధుశేఖర్ చిత్రాల ద్వారా ‘భూమిని ఎలా రక్షించుకోవాలి’ అన్న దానిపైనా అదేవిధంగా భూమిని(ధృవపు ప్రాంతము) ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తూ 8వ తరగతికి చెందిన హరికృష్ణ చిత్రీకరించారు. విద్యుత్ జాగ్రత్త వాడకంపై భవిషత్తులో ఎలాంటి అనర్ధాలు చోటు చేసుకున్నాయో, ఎలాంటి అలవాట్లను చేసుకోవాలి అన్న అంశంపై 6వ తరగతికి చెందిన విద్యార్ధి చందశేఖర్ చిత్రీకరించారు. ఈ ముగ్గురు విద్యార్థులకు రూ.2500 నగదు బహుమతితోపాటు ఈ నెల 9న సికింద్రాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీలకు ఎంపికయ్యారన్నారు. -
30న జిల్లాస్థాయి చిత్రలేఖనం పోటీలు
నరసాపురం: గాంధీ అధ్యయన కేంద్రం (యూజీసీ), నరసాపురం వైఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ‘మహాత్మాగాంధీ–మత సామరస్యం’ అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నట్టు స్థానిక వైఎన్ కళాశాల ప్రిన్సిపాల్ కేవీసీఎస్ అప్పారావు, గాంధీ అధ్యయన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు చెప్పారు. ఈనెల 30న ఉదయం 11 గంటలకు కళాశాలలో పోటీలు ప్రారంభమవుతాయన్నారు. 6వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న పోటీల్లో విజేతలకు వచ్చేనెల 2న కళాశాలలో జరిగే కార్యక్రమంలో బహుమతులు అందిస్తామని చెప్పారు. వివరాలకు సెల్: 9849712739 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
ఇయర్ క్యాలెండరే కాదు... హెయిర్ క్యాలెండర్ కూడా
క్యాలెండర్ అందరూ తయారు చేస్తారు. కానీ మైక్ వుల్ఫ్ అనే మహానుభావుడు క్యాలెండ్ ‘హెయిర్’ తయారు చేశాడు. వుల్ఫ్ గారికి వీపు మీద తోడేలులాంటి కేశరాశి ఉంది. దాన్ని సదుపయోగం చేయాలన్న తాపత్రయం ఉంది. దానికి భార్య అందించిన ప్రోత్సాహం అగ్నికి వాయువులా, మిత్రుడు టేలర్ హార్గింగ్ కళాత్మకత ఆజ్యంలా పనిచేశాయి. ఇంకేముంది? వీపు కేన్వాస్ అయింది. వెంట్రుకలు డ్రాయింగ్లు అయ్యాయి. టేలర్ గారు వీపుపై వెంట్రుకలతో డిజైన్లు గీశాడు. వాటిని ఫొటోలుగా తీసి, క్యాలెండర్‌గా తయారు చేశాడు. ఒక్కో క్యాలెండర్ ఇరవై డాలర్ల చొప్పున అమ్మేశాడు. అవి శరవేగంగా అమ్ముడైపోయాయి. ఆయనకు బోలెడంత డబ్బు వచ్చింది. అయితే ఉల్ఫ్ గారికి తోడేలులాంటి కేశ రాశే కాదు. భల్లూకంలాంటి పట్టుదల కూడా ఉంది. పులిలాంటి ఓపిక ఉంది. ఏనుగంత ఆలోచన ఉంది. సింహం లాంటి హృదయం ఉంది. క్యాలెండ్ హెయిర్ అమ్మగా వచ్చిన డబ్బును మొత్తాన్ని చర్చి సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేశాడు. -
ఏకాంతంలోనే గీస్తానంటే కుదరదు!
ఈ డిసెంబరు 24న ఆర్టిస్టు మోహన్ 65వ పుట్టినరోజు కావడంతో పాటు, త్వరలో ఆయన రచనలతో బొమ్మలతో 20 సంకలనాలు వెలువడనున్న సందర్భంగా ఈ ఇంటర్వ్యూ. చిత్రకళా రంగంలో ఈ మధ్య మిమ్మల్ని ఆకట్టుకున్న విషయాలు ఏమిటి? అంతకుముందు ఏదన్నా చూడాలంటే మాలాంటి లోయర్ మిడిల్ క్లాస్ కుర్రాళ్లందరూ అబిడ్స్(హైదరాబాద్)కి వెళ్ళి విదేశీ కళ మీద చవగ్గా దొరికే పుస్తకాలు ఏరి తెచ్చుకునేవారు. తంటాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఫేస్బుక్, గూగుల్ వచ్చిన తర్వాత ఏం చూడాలన్నా సులభం. ఆర్టిస్టులు వాళ్ళ పనిని వెబ్సైట్లలోను, ఫేస్బుక్లోను పెడుతున్నారు. ఎప్పుడో వేసిన యుగాన్ షీలె బొమ్మలు చూడాలంటే వెంటనే ప్రత్యక్షం. మీ చుట్టూ నిరంతరం సాగే దర్బారు లాంటి వాతావరణంలో బొమ్మలు వేయటం ఇబ్బంది కాదా? ఎక్స్‌ట్రావర్టులు, ఇంట్రావర్టులు... ఇలా మనుషుల్లో ఎన్ని రకాలుంటారో ఆర్టిస్టుల్లోనూ అన్ని రకాలుంటారు. నేను పంతొమ్మిదేళ్ళు న్యూస్ పేపర్లలో పని చేశాను. కార్టూన్ గీసేటప్పుడు చుట్టూ సబెడిటర్లు, రిపోర్టర్లు ఉంటే నాకు కుదరదు అని అనలేము. అదొక ఇబ్బందిగా నేను ఫీల్ కాలేదు. నేను అలాగే పెరిగాను. చిన్నప్పుడు మా ఇల్లంతా పార్టీ ఆఫీసులా ఉండేది. జూట్ మిల్లు వర్కర్సూ, యూనియన్ పార్టీ నాయకులూ వస్తూండేవాళ్ళు, మా నాన్నతో చర్చలు నడిచేవి. విషయం ఏమిటంటే - అమెరికన్ కార్టూనిస్టు, రచయిత జేమ్స్ థర్బర్ అంటాడు: ‘‘నా వ్యాసంగంలో కష్టమైన అంశం ఏమిటంటే - కిటికీ దగ్గర నుంచుని బయటకు చూస్తూ కూడా నేను పని చేస్తున్నానని మా ఆవిడని నమ్మించడం’’ అని. కూర్చుని చేసే పని కేవలం యాంత్రికమైనది. ఏం ఆలోచించావు, ఏం కన్సీవ్ చేశావు అన్నది ముఖ్యం. తమపై మీ ప్రభావం గురించి చాలామంది చిత్రకారులు చెప్తారు. బొమ్మలపై మీ అనురక్తిని వాళ్లకు ఎలా బదిలీ చేయగలిగారు? రాత్రి చదివిన పుస్తకం గురించో, లేదా ఆల్బమ్‌లో చూసిన బొమ్మల గురించో మరుసటి రోజు ఎవరన్నా వచ్చి కూర్చుంటే వాళ్ళతో మాట్లాడుతాం. బడ్డీ కొట్టు దగ్గర కొత్త సినిమా హిట్టా ఫట్టా అని చర్చించుకోవడం లాంటిదే ఇదీనూ. మన ఆర్టిస్టుల్లో చాలామందికి చదివే అలవాటు ఉండదు. చిన్నపట్టణాల నుంచి వచ్చిన చాలామందికి ఇంగ్లీషుతో ఇబ్బంది ఉంటుంది. బొమ్మలు చూసి ముచ్చటపడిన పుస్తకాలు నా దగ్గరకు తీసుకువచ్చి ఆ బొమ్మల కింద ఇంగ్లీషులో ఏం రాశారో చెప్పమంటారు. అంతే నేను చేసింది. చిత్రకళ అనేక విభాగాల్లో పెయింటింగ్ వైపే మొగ్గు పెరిగి మిగిలినవి ఎందుకు వెనక పడుతున్నాయి? అరవై డెబ్భైల కాలంలో ఇండియాలో ఇంత సంపద లేదు. సంపన్న వర్గం అంటే టాటాలూ, బిర్లాలూ, జమీందార్లూ అనే. తర్వాత ఇక మధ్య తరగతి. ఈ రెంటి మధ్యలో ఇంటర్మిడియరీ క్లాసు ఒకటి లేదు. ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టులైన లక్ష్మాగౌడ్, సూర్యప్రకాష్ లాంటి వాళ్ళు అప్పుడూ బొమ్మలు వేశారు గానీ వాళ్ళను పలకరించేవారే లేరు. అందుకని వాళ్ళు బరోడా, ఢిల్లీ లాంటి బయ్యర్లు ఉన్న చోట్లకి వెళ్ళి ప్రయత్నించేవారు. తర్వాత నెమ్మదిగా హైదరాబాదులో రిచ్ క్లాస్ పెరిగింది. జూబ్లీహిల్స్ చాలా మారింది. ఇంటీరియర్ డెకరేటర్లు వచ్చారు. వాళ్ళు తమ క్లయింట్లకి ‘ఈ గోడ మీద ఫలానా పెయింటింగు బాగుంటుంది’ అని చెప్తారు. అలా పెయింటింగ్‌కి డిమాండ్ పెరిగింది. ఇది మంచి అభివృద్ధే కానీ, నష్టం కూడా ఉంది. రియలెస్టేట్ బూమ్ ఉన్నప్పుడల్లా పెయింటింగ్స్ అమ్ముడవుతాయి. తగ్గితే కావు. గ్యాలరీల వాళ్ళను అడిగితే ‘‘ఏం కన్స్ట్రక్షన్లు కావటం లేదండీ’’ అంటారు. అదీ పరిస్థితి. పెయింటింగ్ వైపు ఎందుకు వెళ్ళలేదు? ఏవన్నా ఎసెన్మైంట్స్ ఉంటేనే నేను పెయింట్ చేసాను. కానీ బోరు కొట్టి బయటకు వచ్చాను. నాకు లైన్ డ్రాయింగ్ అంటే ఇష్టం, ఏనిమేషన్ మీద ఆసక్తి పెరిగింది. కొన్నేళ్ళు దాని మీదే సమయం పెట్టుబడీ పెట్టాను. ఇప్పుడు నేను లక్ష్మా గౌడు లాగా, వైకుంఠం లాగా అవ్వాలీ అంటే నన్ను ఒక రెండు మూడేళ్ళు ఎవరన్నా పోషించాలి. కుంచెలు, తడిరంగులతో నిమిత్తం లేని డిజిటల్ ఆర్ట్ మీద మీ అభిప్రాయం? కుంచే ఎందుకు కావాలి, చీపురుపుల్లని నమిలి దానితో కూడా బొమ్మ వేయవచ్చు. అది కేవలం ఒక సాధనం. కంప్యూటర్లు వచ్చినప్పుడు చాలామంది ఆర్టిస్టులు దాన్ని తిట్టారు. కానీ అది కూడా సాధనమే కదా. తెలుగులో ఫస్ట్ ఏనిమేషన్ నేనే చేశాను. అయినా ఇప్పటికీ కంప్యూటర్ ఆపరేట్ చేయలేను. లోపల ఏదో రెసిస్టెన్సు ఉంది. కానీ దాన్ని అసహ్యించుకోను. ఇంటర్నెట్లో గొప్ప గొప్ప ఆర్టిస్టుల గురించి తెలుసుకోవచ్చు, లేదంటే ఫేస్‌బుక్‌లోకి పోయి ‘నేను ఇప్పుడే ఇడ్లీ తిన్నాను’ అని అప్డేట్స్ పెట్టుకోవచ్చు. అవన్నీ సాధనాలంతే. సరుకంతా మన మైండ్‌లో ఉంటుంది. మీరు బొమ్మలు వేయటం ఒక ప్రివిలేజ్‌గా భావించిన రచన ఎవరిదైనా ఉందా? కె.ఎన్.వై. పతంజలి ‘పిలక తిరుగుడు పువ్వు’ ఇండియా టుడే’లో పబ్లిష్ అయింది. దానికి నేను వేసింది బెస్ట్ వర్క్. పెయింటింగ్ వైపు ఎందుకు వెళ్ళలేదు? ఏవన్నా ఎసెన్మైంట్స్ ఉంటేనే నేను పెయింట్ చేసాను. కానీ బోరు కొట్టి బయటకు వచ్చాను. నాకు లైన్ డ్రాయింగ్ అంటే ఇష్టం, ఏనిమేషన్ మీద ఆసక్తి పెరిగింది. కొన్నేళ్ళు దాని మీదే సమయం పెట్టుబడీ పెట్టాను. ఇప్పుడు నేను లక్ష్మా గౌడు లాగా, వైకుంఠం లాగా అవ్వాలీ అంటే నన్ను ఒక రెండు మూడేళ్ళు ఎవరన్నా పోషించాలి. మరల మరల చదువుకునే పుస్తకాలు, రచయితలు? ఒకరని చెప్పలేను. తెలుగులో చలం, శ్రీశ్రీ, డచ్ చిత్రకారుడు రెంబ్రాంట్ జీవితం మీద ‘కాచ్ 22’ రచయిత జోసెఫ్ హెల్లర్ రాసిన ‘పిక్చర్ దిస్’ నవల చాలా ఇష్టం. అలాగే ఫ్రెంచ్ చిత్రకారుడు పాల్ గాగిన్- అతని అమ్మమ్మల మీద పెరూవియన్ రచయిత మారియో వెర్గాస్ ల్లోసా చరిత్ర మీద మంచి పరిశోధనతో, కళ మీద లోతైన అవగాహనతో రాసిన పుస్తకం ‘ద వే టు పారడైజ్’. ఇంటర్వ్యూ: ఫణి -
ఇది జీపీఎస్ ప్రేమసందేశం...
అమ్మాయి ప్రేమ పొందడానికి అబ్బాయిలు చాలా పాట్లు పడతారు. తొలుత ఆ భామ దృష్టిలో పడటానికే ఎన్నో ఫీట్లు చేస్తారు. తర్వాత తమ ప్రేమను ఎలా వ్యక్తీకరించాలా అని జుట్టు పీక్కుంటారు. ఈ ప్రపంచంలో ఎవరూ చెప్పలేనంత కొత్తగా ప్రపోజ్ చేసి నిచ్చెలి మనసు దోచుకోవాలని ఆరాటపడతారు. ఇలాంటివారిలో జపాన్‌కు చెందిన యాసన్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాడు. ప్రేమించిన అమ్మాయికి తన మనసులో మాటను జీపీఎస్ డ్రాయింగ్ ద్వారా వ్యక్తీకరించి నివ్వెరపరిచాడు. ఇందుకోసం ఏకంగా తన ఉద్యోగాన్నే వదిలేసి ఎంతో శ్రమించాడు. ఓ జీపీఎస్ పరికరం, జపాన్ మ్యాప్ తీసుకుని ‘మ్యారీ మీ’ అనే ఆంగ్ల అక్షరాలను జీపీఎస్ డ్రాయింగ్‌లో రూపుదిద్దుకునేలా కొండలు, కోనలు, అడవుల్లో నడుస్తూ ఎంతో కష్టపడ్డాడు. తన ప్రేమ వ్యక్తీకరణ కోసం జపాన్‌లో ఆరు నెలల్లో దాదాపు 7వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇందులో ఎక్కువ దూరం నడవగా.. కొన్నిచోట్ల కారు, సైకిల్, పడవ వంటి ప్రయాణ సాధనాలు వినియోగించాడు. హొక్కాయిడో దీవి నుంచి ప్రారంభమైన అతడి జీపీఎస్ ప్రేమయాత్ర.. క్యూషు దీవిలోని హ్యోడో క్లిఫ్లో ముగిసింది. అనంతరం అతడి జీపీఎస్ పరికరంలో నమోదైన ప్రయాణాన్ని పరిశీలిస్తే.. ఇదిగో ఇలా కఅఖఖ్గ కఉ అనే అక్షరాలతోపాటు లవ్ సింబల్ దర్శనమిచ్చింది. యాసన్ దీనిని తీసుకెళ్లి తాను ప్రేమించిన అమ్మాయికి చూపించాడు. అంతే.. ఆమె కళ్లలో ఆనంబా ష్పాలు పెల్లుబికాయి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే యాసన్ ప్రేమకు ఓకే చెప్పేసింది. ఇదంతా 2008లో జరిగింది. అప్పుడు యాసన్కు 31 సంవత్సరాలు. తన ప్రేమయాత్రకు సంబంధించి యాసన్ ‘వాక్యుమెంటరీ’ పేరుతో ఏడు నిమిషాల నిడివి కలిగిన ఓ డాక్యుమెంటరీని కూడా విడుదల చేశాడు. ప్రపంచంలో ఇప్పటివరకు చేసిన ప్రేమ వ్యక్తీకరణల్లో ఇదే అతిపెద్దదట. పైగా 7,164 కిలోమీటర్ల పొడవులో ఉన్న ఈ జీపీఎస్ డ్రాయింగ్ ఇప్పటివరకు ఉన్నవాటిలో అతిపెద్దదని గిన్నిస్‌బుక్ వాళ్లు కూడా సర్టిఫికెట్ ఇచ్చేశారు. -
ఎన్ని పోటీలైనా ఈమెకు సాటిరావు!
ప్రతిభా కిరణం ఇది పోటీ ప్రపంచం. ఈ యుగంలో పోటీ పడనిదే పనిజరగదు. అని తన్మయి గ్రహించింది కాబోలు, పోటీలలో పాల్గొనడమే ధ్యేయంగా పెట్టుకుంది. పాల్గొన్న ప్రతిదానిలోనూ గెలిచి శభాష్ అనిపించుకుంటోంది. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 18, 1998న పుట్టిన తన్మయి అంబటి అత్యధిక పోటీల్లో పాల్గొని, బహుమతులు గెలుచుకుని రికార్డు సృష్టించింది. తన్మయి వివిధ రాష్ర్ట, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పరీక్షలు, డ్రాయింగ్, పెయింటింగ్, వ్యాసరచన, క్లే మాడలింగ్, చేతి రాత, పర్యావరణ అవగాహన, సామాజిక సేవ మొదలైన అంశాలలో 151కి పైగా అవార్డులను అందుకుంది. అంతర్జాతీయ మేథమెటిక్స్ ఒలంపియాడ్, జాతీయ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్, ఆల్ ఇండియా స్పాట్ కేమెల్ కలర్ కాంటెస్ట్, ఇంట్రా స్కూల్ లెవెల్ సైన్స్ క్విజ్ కాంటెస్ట్‌లతో పాటు ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన మేథమెటిక్స్, కంప్యూటర్ పరీక్షలలో బంగారు పతకాలు సాధించింది. ఆమె తొమ్మిది ఏళ్ల వయసులో కళారత్న, బాలమేధావి అనే బిరుదులను సంపాదించింది. 10 జూన్, 2010లో ‘మహా స్టార్’ గా ఎన్నికైనందుకు ప్రముఖ క్రికెటర్ ధోనీ చేతుల మీదుగా బహుమతి అందుకుంది. ఇంకా ఆంధ్రబాలరత్న, స్టేట్ బెస్ట్ చైల్డ్, జూనియర్ ఎక్స్‌లెన్స్ అవార్డులు పొందింది. అంతేకాదు, మన దేశ మాజీ రాష్ర్టపతి శ్రీమతి ప్రతిభాపాటిల్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయల అభినందనలు కూడా అందుకుంది తన్మయి. ఈ బాలికని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా పోటీలలో పాల్గొనండి, పతకాల పంట పండించండి!