రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీలకు మలుగూరు విద్యార్థులు
హిందూపురం రూరల్ : రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీలకు మలుగూరు ఏపీఎస్‌డబ్ల్యూఆర్ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ నాగమణి మంగళవారం తెలిపారు. ఏటా భారతీ జాతీయ సంస్థ జాతీయ థర్మల్‌పవర్ కార్పొరేషన్, ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో నిర్వహించే చిత్రలేఖనం పోటీల్లో ఎంట్రీల్లో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో సుమారు లక్ష మంది విద్యార్థులు ఎంట్రీలను పంపించగా అందులో మలుగూరు విద్యార్థులు పంపినవి ఎంపికయ్యాయన్నారు.
వాతావరణంలో గ్రీన్‌మౌస్ వాయువులు (కార్బన్‌ఫుట్‌పాయిట్) పారదోలాలి అన్న అంశంపై 8వ తరగతికి చెందిన మధుశేఖర్ చిత్రాల ద్వారా ‘భూమిని ఎలా రక్షించుకోవాలి’ అన్న దానిపైనా అదేవిధంగా భూమిని(ధృవపు ప్రాంతము) ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తూ 8వ తరగతికి చెందిన హరికృష్ణ చిత్రీకరించారు. విద్యుత్ జాగ్రత్త వాడకంపై భవిషత్తులో ఎలాంటి అనర్ధాలు చోటు చేసుకున్నాయో, ఎలాంటి అలవాట్లను చేసుకోవాలి అన్న అంశంపై 6వ తరగతికి చెందిన విద్యార్ధి చందశేఖర్ చిత్రీకరించారు. ఈ ముగ్గురు విద్యార్థులకు రూ.2500 నగదు బహుమతితోపాటు ఈ నెల 9న సికింద్రాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీలకు ఎంపికయ్యారన్నారు.