state level competetions
-
రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీలకు మలుగూరు విద్యార్థులు
హిందూపురం రూరల్ : రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీలకు మలుగూరు ఏపీఎస్‌డబ్ల్యూఆర్ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ నాగమణి మంగళవారం తెలిపారు. ఏటా భారతీ జాతీయ సంస్థ జాతీయ థర్మల్‌పవర్ కార్పొరేషన్, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్వహించే చిత్రలేఖనం పోటీల్లో ఎంట్రీల్లో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో సుమారు లక్ష మంది విద్యార్థులు ఎంట్రీలను పంపించగా అందులో మలుగూరు విద్యార్థులు పంపినవి ఎంపికయ్యాయన్నారు. వాతావరణంలో గ్రీన్మౌస్ వాయువులు (కార్బన్ఫుట్పాయిట్) పారదోలాలి అన్న అంశంపై 8వ తరగతికి చెందిన మధుశేఖర్ చిత్రాల ద్వారా ‘భూమిని ఎలా రక్షించుకోవాలి’ అన్న దానిపైనా అదేవిధంగా భూమిని(ధృవపు ప్రాంతము) ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తూ 8వ తరగతికి చెందిన హరికృష్ణ చిత్రీకరించారు. విద్యుత్ జాగ్రత్త వాడకంపై భవిషత్తులో ఎలాంటి అనర్ధాలు చోటు చేసుకున్నాయో, ఎలాంటి అలవాట్లను చేసుకోవాలి అన్న అంశంపై 6వ తరగతికి చెందిన విద్యార్ధి చందశేఖర్ చిత్రీకరించారు. ఈ ముగ్గురు విద్యార్థులకు రూ.2500 నగదు బహుమతితోపాటు ఈ నెల 9న సికింద్రాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీలకు ఎంపికయ్యారన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు సప్తగిరి విద్యార్థులు
హిందూపురం టౌన్ : పట్టణంలోని సప్తగిరి కళాశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు గురువారం రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఎస్కే యూనివర్శిటీ పరిధిలో ఈ నెల 21న నిర్వహించిన పోటీల్లో డిగ్రీ విద్యార్థి ఎస్.సాధిక్, ఇంటర్ విద్యార్థులు అబూబకర్ సిద్దిక్, నాగేష్ ఎంపికైనట్లు తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రకాష్‌రెడ్డి, ఏఓ గంగిరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎస్డీజీఎస్ విద్యార్థులు
హిందూపురం టౌన్ : రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు హిందూపురం పట్టణంలోని ఎస్డీజీఎస్ కళాశాలకు చెందిన శరత్‌కుమార్, అరుణ్‌కుమార్ ఎంపికైనట్లు కళాశాల పీడీ హేమంత్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం విద్యార్థులను పీడీతో పాటు ప్రిన్సిపల్ శ్రీనివాసులు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ అండర్–19 ఏపీ స్కూల్ గేమ్స్‌లో భాగంగా ఫుట్‌బాల్ పోటీల్లో ఎస్డీజీఎస్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషమన్నారు. త్వరలో చిత్తూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.