
ముంబై: కేన్సర్ నిర్మూలనకు విశేష కృషిచేస్తున్న డీఎస్ రీసెర్చ్ సెంటర్ ముంబై శాఖ ఏడో వార్షికోత్సం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బాంద్రాలోని డా.ఎర్నెస్ట్ బోర్జెస్ మెమొరియల్ హోమ్‌కు వెళ్లిన డీఎస్ రీసెర్చ్ బృందం అక్కడి కేన్సర్ పేషెంట్లతో సరదాగా గడిపింది. మిమిక్రీ కళాకారుడు సాగర్ పటేల్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డీఎస్ రీసెర్చ్ కేంద్రంలో చికిత్స పొంది కేన్సర్ నుంచి బయటపడిన వారు అక్కడి పేషెంట్లలో స్ఫూర్తి నింపేలా ప్రసంగించారు.