ప్రియురాలికి హృతిక్ రోషన్ విషెస్ .. పెళ్లి అయిపోయిందా? | Hrithik Roshan wishes sweet anniversary wish for his partner Saba Azad | Sakshi
Sakshi News home page

Hrithik Roshan: ప్రియురాలికి హృతిక్ రోషన్ స్పెషల్ విషెస్..!

Published Tue, Oct 1 2024 7:55 PM | Last Updated on Tue, Oct 1 2024 8:10 PM

Hrithik Roshan wishes sweet anniversary wish for his partner Saba Azad

బాలీవుడ్‌ సెలబ్రిటీ ప్రేమ జంటల్లో హృతిక్ రోషన్‌- సబా ఆజాద్ ఒకరు. కొన్నేళ్లుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఏ ఈవెంట్‌ జరిగినా జంటగా కనిపిస్తారు. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందంటూ బీటౌన్‌లో టాక్ వినిపించింది. కానీ అలాంటిదేం జరగలేదు.

అయితే తాజాగా హృతిక్ రోషన్‌ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హ్యాపీ యానివర్సిరీ పార్ట్‌నర్‌ అంటూ సబా ఆజాద్‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్ట్ చూస్తుంటే అయితే తన ప్రియురాలిని హృతిక్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజా పోస్ట్‌తో గతేడాది అక్టోబర్‌లోనే వీరి పెళ్లి జరిగినట్లు హృతిక్ హింట్‌ ఇచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ జంట తమ మొదటి వివాహా వార్షికోత్సవాన్ని ఇవాళ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది చూస్తుంటే ఎలాంటి హడావుడి లేకుండానే హృతిక్- సబా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు అర్థమవుతోంది. కాగా.. గతంలో సబా ఆజాద్‌ త్వరలోనే గుడ్‌ న్యూస్ చెబుతానంటూ పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. 'క్రిష్', 'కోయి మిల్ గయా' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న హీరో హృతిక్ రోషన్. 2000లో ఇంటీరియర్ డిజైనర్ సుస్సానే ఖాన్‌ని పెళ్లి చేసుకున్న ఇతడు.. 2014లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. దీని తర్వాత సుస్సానే మరో వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉండగా.. హృతిక్ కూడా షబా అనే యువ నటితో ప్రేమలో పడ్డారు. అయితే పెళ్లి విషయం గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. 

ఇక సినిమాల విషయానికొస్తే హృతిక్ రోషన్‌ చివరిసారిగా యాక్షన్ చిత్రం ఫైటర్‌లో కనిపించారు.  ప్రస్తుతం హృతిక్ వార్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. సబా ఆజాద్‌ చివరగా అమెజాన్‌ ప్రైమ్‌ వెబ్ సిరీస్‌లో నటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement