ఇండియానా : మెరిల్‌విల్లేలో భారతీయ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. అక్కడ భారతీయ దేవాలయం నిర్మించి తొమ్మిది సంవత్సరాలు పూర్తయినందున ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారం విఘ్నేశ్వరుని పూజతో తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సింతియా చాకలింగమ్, గర్భ నృత్యప్రదర్శనలతో అందరినీ అలరించారు.
మరుసటి రోజు శనివారం ఉదయం సుప్రభాత సేవతో పూజలు ప్రారంభమయ్యాయి. అభిషేకాలు, హోమాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ధ్వజారోహణం, కలశాభిషేకం, మహామంగళ హారతి చేపట్టి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. డా. అనురాధ దివాకరుని ఆధ్వర్యంలో స్కంద గ్రూప్, రఘురాం, అనఘ భక్తి కీర్తనలను ఆలపించారు. లావణ్య దర్శకత్వంలో చిన్నారుల అష్టలక్ష్మి నృత్యం, సంయుక్త, సంప్రీతి, సువాలిల భరతనాట్యం, రాన్యరాయ్ కథక్ అందరినీ ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment