indiana
-
అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం యువకుడి మృతి
సాక్షి, ఖమ్మం: అమెరికాలో దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం యువకుడు వరుణ్ తేజ(24) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అధికారులు సమాచారం అందించారు.. వరుణ్ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుచ్చా రామ్మూర్తి కుమారుడు వరుణ్ తేజ్ 2022 ఆగస్టులో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతూ పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 31న వాల్పరైసో నగరంలో జిమ్ నుంచి బయటకు వస్తున్న వరుణ్‌పై అకస్మాత్తుగా ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన వరుణ్ రక్తపు మడుగులో పడిపోగా స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటి నుంచి వరుణ్ పరిస్థితి విషమంగానే ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచాడు. నిందితుడు ఆండ్రేడ్ జోర్డాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు -
అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి
న్యూయార్క్: అమెరికాలో ఇండియానా రాష్ట్రంలో సరస్సులో ఈతకెళ్లిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఈ నెల 15వ తేదీన సిద్ధాంత్ షా(19), ఆర్యన్ వైద్య(20)లు మరికొందరితో కలిసి మొన్రో సరస్సులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈదుతూనే ఇద్దరూ నీళ్లలో మునిగిపోయారు. అధికారులు ఎంతగా ప్రయత్నించినా వారి జాడ దొరకలేదు. ఈ నెల 18వ తేదీన ఇద్దరి మృతదేహాలు సరస్సులో తేలియాడుతూ కనిపించగా వెలికితీశారు. సిద్ధాంత్, ఆర్యన్లు ఇండియానా యూనివర్సిటీకి చెందిన కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులని అధికారులు వెల్లడించారు. వీరిద్దరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్ వైరల్ వీడియో
న్యూయార్క్: రోడ్డుపై పలు యాక్సిడెంట్ ఘటనలు చూసినప్పటికీ ఇంకా అలాంటి భయంకరమైన ఘటనలు పునరావృతమౌతునే ఉన్నాయి. అంతేకాదు వేగం తగ్గించమని ఎంతలా ట్రాఫిక్ యంత్రాంగం మొత్తుకున్న ప్రజల్లో సరైన మార్పు రాకపోవడం బాధకరం. కానీ యూఎస్‌లోని ఇండియానాలో జరిగిన అతి పెద్ద యాక్సిడెంట్ చూస్తే ఎవరికైనా భయం వేయాల్సిందే. (చదవండి: కొడుక్కి అరుదైన వ్యాధి.. వైద్య చరిత్రలో గుర్తిండిపోయే పనిచేశాడు.. హైస్కూల్ చదువుతోనే..!!) అసలు విషయంలోకెళ్లితే...ఇండియానాలోని ఇండియానాపోలిస్‌లో కనీసం మూడు స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ ఢీ కొన్నాయి. అయితే మొదట రోడ్డు ఖాళీగా ఉందని రెడ్ సిగ్నల్ పడినప్పటికీ ఒక ఎస్యూవీ కారు వేగంగా వచ్చేస్తుంది. అంతే మరో ఎస్యూవీ కారు దాన్ని గట్టిగా ఢీ కొడుతుంది. దీంతో అది గాల్లోకి లేచి రహదారికి మరోవైపు పడుతుంది. వెంటనే అటువైపేగా వస్తున్న ఎస్యూవీ కారు పై పడి అక్కడ ఉన్న ఆరు కారులను ఢీ కొడుతుంది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదుగానీ, మొత్తం ఆరు కారులు దెబ్బతిన్నాయి. అంతేకాదు ఈ ఘటన జరిగినప్పుడు ఒక పాదచారి నడుచుకుంటూ వెళ్తుంటాడు. అయితే అదృష్టమేమిటంటే అతనికి ఏం కాలేదు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: వెర్రి వేయి రకాలు.. కుక్కని బుక్ చేసేందుకు...మరీ అలా చేయాలా?) -
వైరల్: తల్లిని కాపాడేందుకు ఐదేళ్ల పిల్లాడు..
వాషింగ్టన్: తమ ఇంట్లో చొరబడిన దొంగలను ధైర్యంగా ఎదుర్కొన్నాడో ఐదేళ్ల పిల్లాడు. తుపాకీ చేతబట్టిన ఆ దుండగుల బారి నుంచి తన తల్లిని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు. తనను భయపెట్టాలని చేసిన ఆ దుష్టమూక మీదకు బొమ్మలు విసురుతూ వాళ్లను తరిమికొట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. పిల్లాడితో పాటు అతడి తల్లి, సోదరి నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో బుల్లెట్లు పేలుస్తూ దొంగలు బయటకు పరుగులు తీశారు. ఇండియానాలో సెప్టెంబరు 30న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. (చదవండి: సెల్యూట్‌తో అలరిస్తున్న బుడ్డోడు) ఇక దుండగుల ఆచూకీ కోసం రంగంలోకి దిగిన సౌత్ బెండ్ పోలీసులు బాధిత కుటుంబం ఇంట్లో లభించిన సీసీటీవీ ఫుటేజీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో కనిపిస్తున్న దుండగుల జాడ తెలిస్తే తమకు సమాచారం అందించాల్సిందిగా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. అదృష్టవశాత్తూ ఘటన జరిగిన రోజు ఆ కుటుంబానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఐదేళ్ల డేవిడ్ జాన్సన్ ఏమాత్రం భయపడకుండా దొంగలను ఎదుర్కొన్నాడని ప్రశంసలు కురిపించారు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు సైతం బుడ్డోడి ధైర్యసాహసాలకు ఫిదా అవుతున్నారు. అతడికి సాహస బాలుడి అవార్డు ఇవ్వాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం గురించి సౌత్‌బెండ్ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘అవును నిజమే. ఆ అబ్బాయి చాలా ధైర్యవంతుడు. సెప్టెంబరు 30న ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో నలుగురు సాయుధులు వాళ్ల తలుపు తట్టారు. డోర్ తీయగానే తుపాకులతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. హేయమైన నేరాలకు పాల్పడే ఇలాంటి దొంగలను అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టాం. అదృష్టం బాగుంది కాబట్టి ఆరోజు ఎవరికీ ఏమీ కాలేదు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కాబట్టి, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి’’అని విజ్ఞప్తి చేశారు. -
ఇంట్లో 140 పాములు.. మెడకు చుట్టుకుని..
వాషింగ్టన్ : ఇంట్లో పాములను పెంచుతున్న ఓ మహిళ జీవితం విషాదాంతమైంది. తాను ప్రేమగా పెంచుకున్న కొండచిలువ మెడకు చుట్టుకోవడంతో ఆమె దుర్మరణం పాలైంది. ఈ విషాదకర ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాలు.. లారా హర్ట్(36) అనే మహిళ ఇండియానాలోని ఆక్స్ఫర్్డలో నివసిస్తోంది. పాములంటే మక్కువ కలిగిన లారా తన ఇంట్లో ఏకంగా 140 పాములను పెంచుకుంటోంది. వీటిలో ఎనిమిది అడుగుల కొండచిలువ కూడా ఉంది. కాగా బుధవారం లారా ఆకస్మికంగా మృతి చెందినట్లు పొరుగింటివారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారా ఇంటికి వచ్చి ఆమె శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం లారా ఇంటిని వెదకగా వందల సంఖ్యలో పాములు వాళ్ల కంటపడ్డాయి. ఈ విషయం గురించి లారా పొరుగింటి వారిని ఆరాతీయగా... అవన్నీ ఆమె పెంపుడు జంతువులు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్‌మార్టం నివేదికలో బలంగా గొంతు నులిమిన కారణంగానే ఆమె మరణించినట్లు వెల్లడి కావడంతో పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపారు. ఈ క్రమంలో కొండచిలువే ఆమె మరణానికి కారణమని తేలింది. ఈ విషయం గురించి పోలీసు అధికారులు మాట్లాడుతూ.. పోస్ట్‌మార్టం నివేదిక తమను ఆశ్చర్యానికి గురి చేసిందని.... పాములు పెంచుకున్న లారా జీవితం విషాదంగా ముగిసిందని పేర్కొన్నారు. ఇక విష రహిత పాములైన కొండచిలువలు ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాల్లో ఎక్కువగా నివసిస్తాయన్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 రకాల జాతుల కొండచిలువలు ఉన్నాయి. -
ఇండియానాలో ఆలయ వార్షికోత్సవ వేడుకలు
ఇండియానా : మెరిల్‌విల్లేలో భారతీయ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. అక్కడ భారతీయ దేవాలయం నిర్మించి తొమ్మిది సంవత్సరాలు పూర్తయినందున ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారం విఘ్నేశ్వరుని పూజతో తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సింతియా చాకలింగమ్, గర్భ నృత్యప్రదర్శనలతో అందరినీ అలరించారు. మరుసటి రోజు శనివారం ఉదయం సుప్రభాత సేవతో పూజలు ప్రారంభమయ్యాయి. అభిషేకాలు, హోమాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ధ్వజారోహణం, కలశాభిషేకం, మహామంగళ హారతి చేపట్టి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. డా. అనురాధ దివాకరుని ఆధ్వర్యంలో స్కంద గ్రూప్, రఘురాం, అనఘ భక్తి కీర్తనలను ఆలపించారు. లావణ్య దర్శకత్వంలో చిన్నారుల అష్టలక్ష్మి నృత్యం, సంయుక్త, సంప్రీతి, సువాలిల భరతనాట్యం, రాన్యరాయ్ కథక్ అందరినీ ఆకట్టుకున్నాయి. -
నరరూప రాక్షసుడ్ని.. కండోమ్ పట్టించింది
ఎనిమిదేళ్ల చిన్నారిని ఒళ్లు గగుర్బొడిచే రీతిలో హత్యాచారం చేసి.. ఆపై పోలీసులకు చిక్కకుండా సైకోయిజం ప్రదర్శించిందో మృగం. అయితే ముప్పై ఏళ్ల తర్వాత నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఈ కేసును ఓ కండోమ్ సాయంతో పోలీసులు చేధించటం విశేషం. ఇండియానా రాష్ట్రం, ఫోర్ట్ వైనే నగరంలో 1988, ఏప్రిల్1న 8 ఏళ్ల చిన్నారి ‘ఏప్రిల్ టిన్స్లే’ అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మూడు రోజుల తర్వాత అక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో బాలిక మృతదేహం ముక్కలై పడి ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్‌లో చిన్నారిని లైంగికదాడి చేసి, ఆపై చిత్రవధ చేసి చంపినట్లు తేలింది. దీంతో ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు మాత్రం పోలీసులకు సవాల్ విసురుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో 1990లో నగరంలోని ఓ గోడ మీద..‘ఆ ఎనిమిదేళ్ల చిన్నారిని చంపింది నేనే. ఆ పాపా ఇంకో షూ మీకు దొరికిందా?.. హహ.. మళ్లీ చంపేస్తా’ అంటూ రాతలు కనిపించాయి. దీంతో పోలీసులు దర్యాప్తును మరింత ఉధృతం చేశారు. సుమారు 30 ఏళ్లుగా దర్యాప్తు కొనసాగుతూ వస్తోంది. చివరికి జన్యుశాస్త్రవేత్త సాయంతో దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జెనాలజీని ఆశ్రయించారు. (జెనాలజీ అంటే వంశవృక్షాన్ని తయారుచేసేందుకు ఉపయోస్తారు. ఆ డేటా ఇంటర్నెట్లో దొరుకుతుంది కూడా). కండోమ్ ద్వారానే... జెనాలజీ ఆధారంగా గ్రాబిల్‌కు చెందిన జాన్ మిల్లర్(59), అతని సోదరుడిపై పోలీసులకు అనుమానాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ నెల మొదట్లో జాన్ మిల్లర్ ఇంటి డస్ట్ బిన్ నుంచి విచారణ అధికారులు కండోమ్‌లను సేకరించారు. వాటి పరీక్షల అనంతరం నిందితుడు మిల్లరే అని నిర్ధారించిన పోలీసులు.. చివరకు అతన్ని అరెస్ట్ చేశారు. తాము ప్రశ్నించేందుకు వెళ్లిన సమయంలోనే మిల్లర్ నేరం ఒప్పేసుకున్నాడని అలెన్ కౌంటీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను అలెన్ కౌంటీ జైలుల్లో ఉండగా, వచ్చే వారం కేసు కోర్టులో విచారణకు రానుంది. గోల్డెన్ స్టేట్ కిల్లర్, టకోమా చిన్నారి మిచెల్లా వెల్చ్ హత్యాచారం కేసు కూడా జెనాలజీ ద్వారానే చిక్కుముడి వీడటం తెలిసిందే. -
ఊహించని ప్రమాదం
ఇండియానా: ప్రియురాలి మృతదేహంతో కారులో ఇరుక్కుపోయిన ఓ వ్యక్తి రెండు రోజుల తర్వాత బయటపడిన ఘటన అమెరికాలోని ఇండియానా చోటు చేసుకుంది. కెవిన్ బెల్(39) తన ప్రియురాలు నిక్కీ రీడ్(37)తో కలిసి ఈ నెల 17న ఫోర్డ్ కారులో పెన్సిల్వేనియాకు బయలుదేరాడు. జెన్నింగ్స్ కౌంటీలో కారు చెట్టును ఢీకొనడంతో వీరు ప్రమాదం బారిన పడ్డారు. నిక్కీ అక్కడికక్కడే చనిపోయింది. డ్రైవర్ సీటులో కూర్చున్న కెవిన్ ఎడమ కాలికి తీవ్రంగా గాయమైంది. దీంతో కదలేక కారులోనే ఉండిపోయాడు. ప్రియురాలి మృతదేహం పక్కనే కారులో రెండురోజుల పాటు గడిపాడు. చివరికి అందులోంచి బయటపడి రోడ్డుపైకి చేరుకుని ఓ ప్రయాణికుడి సహాయంతో మంగళవారం సాయంత్రం ఆస్పత్రికి చేరాడు. అసలేం జరిగిందనేది ఇంకా తెలియలేదని ఇండియానా పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ప్రమాదం జరిగిన గ్రామీణ ప్రాంతం ప్రధాన రహదారికి చాలా దూరంగా ఉందని తెలిపారు. ఇండియానాకు తిరిగి వస్తున్నామని శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత కుటుంబ సభ్యులకు కెవిన్, నిక్కీ తెలిపారని, తర్వాత వారి ఫోన్లు చేయలేదని వెల్లడించారు. ఆందోళనతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వీరిద్దరి కోసం పోలీసులు గాలింపు చేపట్టగా, ఆచూకీ తెలిస్తే చెప్పాలని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు. చివరకు వీరు ప్రమాదం బారిన పడ్డారని తెలుసుకుని షాక్ కు గురయ్యారు. నిక్కీ రీడ్ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
చట్ట ప్రకారమే నా బాబును చితకబాదాను!
ఇండియానా: అమెరికాకు చెందిన ఓ మహిళ తన ఏడేళ్ల కొడుకుని చితకబాదింది. ఈ విషయాన్ని స్కూలు యాజమాన్యం గమనించి ఆ తల్లిని ప్రశ్నించగా తాను స్థానిక మత విశ్వాసాలలో ఉన్న స్వేచ్ఛతోనే కొడుకును కొట్టినట్లు చెప్పింది. ఇండియానాలో నివాసం ఉంటున్న కిన్ పార్క్ థాయింగ్(30)కి ఇద్దరు సంతానం. ఏడేళ్ల కొడుకు, మూడేళ్ల కూతురు ఉన్నారు. అయితే కొన్ని నెలల కిందట బాబు ప్రవర్తన బాగా లేదని, విపరీతమైన కోపంలో హ్యాంగర్ తీసుకుని 36సార్లు కొట్టింది. ఆ బాలుడి చేతి, మెడ భాగాల్లో కమిలిన వాతలువచ్చాయి. ఈ విషయం పోలీసుల దృష్టికివెళ్లగా వాళ్లు ఆమెను విచారణ చేశారు. ఆమె చెప్పిన విషయం విని పోలీసులు నోరెళ్ల బెట్టారు. తప్పు చేసినప్పుడు దండించే హక్కు, స్వేచ్ఛ ఉందని స్థానిక మత విశ్వాసాల చట్టంలో ఉందని థాయింగ్ చెప్పింది. దీనిపై కోర్టులో అఫిడవిట్ దాఖలుచేసింది. వచ్చే అక్టోబర్ నెలలో ఈ కేసు విచారణకు రానుంది. పిల్లలను దండించకుండా.. మంచి అలవాట్లు ఎలా నేర్పాలో, వారికి మంచి నడవడిక నేర్పించడంపై థాయింగ్ కు ప్రాక్టికల్ క్లాసులు నిర్వహిస్తారు. 14 ఏళ్ల లోపు పిల్లలను అంత దారుణంగా హింసించడం చట్టాలను ఉల్లంఘించడమేనని పోలీసులు పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయని తెలిపారు. -
ట్రంప్‌పై హిల్లరీ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అసలు కాక మొదలైంది. ఇండియానా ప్రాథమిక ఎన్నికల తర్వాత పోటీ దారులమధ్య మాటల యుద్ధం షురూ అయింది. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన అనంతరం డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో అదే స్థాయిలో హిల్లరీ స్పందించారు. ట్రంప్ ఓ చంచల స్వభావి అని, అమెరికా ప్రజలు అతడిని ఎన్నుకునేంత తెలివితక్కువ వారని తాను భావించడం లేదని అన్నారు. ట్రంప్‌కు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టడం అమెరికాకు సమస్యలు కొనితెచ్చుకోవడమే అని చెప్పారు. ట్రంప్‌ను ధీటుగా ఎదుర్కోని ప్రచారం ఎలా నిర్వహించాలో తనకు బాగా తెలుసని అన్నారు. అదే సమయంలో.. ట్రంప్ పార్టీలోని రెబల్స్ అతడిపై పైచేయి సాధించలేకపోయారని, ఎందుకంటే అంతకంటే ముందే వారు ట్రంప్‌తో ఒప్పందం చేసుకున్నారని ఆమె ఆరోపించారు. 'ట్రంప్ ఓ పేలని ఫిరంగి. పేలని ఫిరంగులు ఉపయోగిస్తే అవి మిస్ ఫైర్ అవుతాయి' అని ఆమె విమర్శించారు. 'ట్రంప్ పెద్దపెద్ద ప్రకటనలు చేస్తున్నారు. పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఒక దేశ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నప్పుడు అసలు ప్రజలకు ఏం చేస్తారో అనే విషయం తప్పక చెప్పాలి. ప్రజలకు ఎంత మంచి చేయాలనుకుంటున్నారో.. దానికోసం ఎలా ముందుకు వెళతారో వివరించాలి. స్వతహాగా వ్యాపారస్తుడైన ట్రంప్ కు విదేశాంగ విధానం అస్సలు తెలియదు. అతడిని అధ్యక్షుడికి ఎన్నుకోవడం మాత్రం అమెరికాకు పెద్ద చిక్కే' అని ఆమె చెప్పారు. -
'అతడికి నేనంటే ఇష్టమో.. కాదో'
న్యూయార్క్: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే అమెరిక అధ్యక్ష పదవి కోసం నామినేషన్ అర్హత దాదాపు సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తొలిసారి కాస్త నెమ్మదించి మాట్లాడారు. ఇండియానా ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రత్యర్థి టెడ్ క్రూజ్‌ను వెనక్కి నెట్టిన ట్రంప్.. క్రూజ్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఇప్పటి వరకు ఎన్నో పోటీలు ఎదుర్కొన్నానని, తమ పార్టీ తరుపునే బరిలోకి దిగిన క్రూజ్ గట్టి పోటీ ఇచ్చాడని అన్నారు. 'నా జీవితమంతా పోటీల మయం. ఎన్నో పోటీలు దిగ్విజయంగా ఎదుర్కొన్నాను. భిన్న పోటీలు నా జీవన ప్రయాణంలో చూశాను. కానీ, ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. టెడ్ క్రూజ్... అతడు నన్ను ఇష్టపడతాడో లేదో నాకు తెలియదు. కానీ పోటీ దారుల్లో మాత్రం అతడు మేటి. అతడితో కాంపిటేషన్ చాలా టఫ్.. బాగా తెలివైన వాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. నేను అతడికి అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అతడి ముందున్న పరిస్థితి కొంత కఠినమైనది. నిజంగానే కఠినమైనది. టెడ్, హైదీ ఆయన కుటుంబం మొత్తం బాధపడుతూ ఉండొచ్చు. ఒక విషయం మాత్రం చెప్పగలను. అతడిని ఎదుర్కోవడం మాత్రం నిజంగా చాలా కష్టమే.. గొప్ప పోటీదారు క్రూజ్' అంటూ ట్రంప్ చెప్పాడు. నవంబర్ లో అధ్యక్ష పీఠం తమ వశమవుతుందని, అమెరికా నెంబర్ 1 అవుతుందని చెప్పారు. ఇక కంపెనీల వ్యవహారాలన్ని మూసేసి తాను దేశ సేవకు అంకితం అవుతానని ట్రంప్ చెప్పారు. -
అధ్యక్ష పదవికి రూట్ క్లియర్ చేశాడు
ఇండియానాపొలిస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ పొందేందుకు బరిలోకి దిగిన డోనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయం సాధించారు. ఇండియానాలో కూడా ఆయన పై చేయి సాధించారు. ఇక్కడ తనకు గట్టి పోటీ దారుడైన టెడ్ క్రుజ్‌ను మట్టి కరిపించి నామినేషన్ తన పేరిట ఖరారు చేసుకున్నారు. ఈ ఎన్నికలతో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థి తానే అనే ట్రంప్ నిరూపించుకున్నాడు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నప్పటికీ ట్రంప్ ఈ విజయం సాధించడం గమనార్హం. మరోపక్క, డెమోక్రటిక్ పార్టీ తరుపున నామినేషన్ కోసం పోటీ పడుతున్న శాండర్స్, హిల్లరీ క్లింటన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు హిల్లరీదే పై చేయి ఉండగా ఇండియానా ఎన్నికల్లో శాండర్స్‌కు అత్యధిక ఓట్లు లభించాయి. ఇండియానాలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌కు 481573 ఓట్లు రాగా.. టెడ్ క్రూజ్ కు 336492, శాండర్స్ కు 259341, హిల్లరీ క్లింటన్ కు 227693 ఓట్లు వచ్చాయి. ఈ విజయం సాధించిన సందర్భంగా బిజినెస్ టైకూన్ అయిన ట్రంప్ తన కుటుంబ సభ్యులు బంధువుల కుటుంబ సభ్యులతో కలిసి వేదికపై నడుస్తూ మీడియాతో మాట్లాడారు. 'హిల్లరీ గొప్ప అధ్యక్షరాలు కాలేదు.. ఆమె మంచి అధ్యక్షురాలు కూడా కాలేదు, ఆమె ఒక బలహీనమైన అధ్యక్షురాలిగానే ఉంటారు. ఆమెకు వర్తకం అంటే అసలే అర్థం కాదు' అంటూ చురకలు అంటించారు. జూన్ 7న ట్రంప్ తన నామినేషన్ వేయనున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి అసలైన ఎన్నికలు నవంబర్ 8న జరగనున్నాయి. -
అమెరికాపై విరుచుకుపడ్డ టోర్నడోలు
మిసిసిపి: పెనుగాలి(టోర్నడో) అమెరికాను కుదిపేస్తోంది. టోర్నడోల కారణంగా దేశవ్యాప్తంగా కనీసం ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఏడేళ్ల బాలుడు ఉన్నాడు. 40 మందిపైగా గాయపడ్డారు. ముఖ్యంగా ఇండియానా, మిసిసిపి రాష్ట్రాలపై టోర్నడోలు ప్రతాపం చూపాయి. ఆర్కాన్సాస్ ప్రాంతంలో ఇల్లుపై చెట్టు కూలిపోవడంతో 18 ఏళ్ల యువతి మృతి చెందింది. ఏడాది శిశువును రక్షించారు. టెన్నెసీ ప్రాంతంలో ఇద్దరు మృతి చెందారు. బెంటన్ కౌంటీలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆచూకీ లేకుండా పోయారు. వీరి జాడ కనుగొనేందుకు సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. పెనుగాలికి క్లార్క్స్ డేల్ చిన్న విమానాశ్రయంలో విమానాలు తల్లక్రిందులయ్యాయని మేయర్ బిల్ లకెట్ తెలిపారు. టోర్నడోలు పలుచోట్ల విధ్వంసం సృష్టించాయని చెప్పారు. 10 నిమిషాల పాటు టోర్నడో సృష్టించిన బీభత్సాన్ని స్థానిక టీవీ చానళ్లు ప్రచారం చేశాయి. మరోవైపు ఇంటర్ స్టేట్ 55 రహదారిని రెండు వైపుల మూసివేసినట్టు మిసిసిపి హైవేస్ పాట్రోల్ అధికారులు తెలిపారు. మిసిసిపితో పాటు మిస్సౌరి, ఇలినాయిస్, కెంటుకీలకు టోర్నడోల ముప్పు పొంచివుందని ఒక్లాహామాలోని నేషనల్ స్టార్మ్ ప్రిడిక్షన్ సెంటర్ హెచ్చరించింది. 193 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశముందని పౌరులను అప్రమత్తం చేసింది. -
సాలీడు భయంతో నడుస్తున్న కారులోంచి దూకేసి.. !
ఇండియానా: బొద్దింకను, బల్లిని చూసి భయపడిపోయి గట్టిగా అరుస్తూ పారిపోయే మహిళలను చాలాసార్లు చూసి ఉంటాం. కానీ, నడుస్తున్న కారులోంచి అలాంటి భయంతో దూకేసిన మహిళలను చూడటం మాత్రం ఎప్పుడూ చూసి ఉండం. ఇండియానాలో మాత్రం ఓ మహిళ ఒక్కసారిగా తాను నడుపుతున్న కారు స్టీరింగ్‌ను వదిలేసి, కారులో ఉన్న కొడుకును మరిచిపోయి ఆ పనే చేసింది. ఏకంగా కారు నడుస్తుండగానే బయటకు దూకేసింది. అయితే అదృష్టం బాగుండి ఆ పిల్లాడు చిన్నపాటి గాయాలతో.. తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే ఆమె ఎందుకు అలా చేసిందో తెలుసా?... సిరాక్యూజ్ చెందిన ఎంజెలా కిప్ (35) అనే మహిళ తన తొమ్మిదేళ్ల కొడుకుతో కారులో బయలుదేరింది. ఇంతలో ఆమె భుజంపై ఒక సాలీడు పాకుతుండటం గమనించింది. ఒక్కసారిగా ఆమె భయపడిపోయింది. అంతే ఏమాత్రం ఆలోచించకుండా స్టీరింగ్ ను వదిలేసి... కదులుతున్న కారులో నుంచి ఒక్క ఉదుటున బయటకు దూకేసింది. దీంతో షాకైన ఆ తొమ్మిదేళ్ల పిల్లాడు డ్రైవింగ్ సీటులోకి జంప్ చేసి బ్రేక్ పై కాలు వేయకుండా గ్యాస్ పెడల్ పై వేశాడు. దీంతో కారు అదుపు తప్పి ఓ స్కూలు వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జయినా ఆ బాలుడు మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు ఆ బాలుడిని ఆస్పత్రిలోకి చేర్చించారు. ప్రమాదానికి కారణమైన తల్లిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇలా అతి చిన్న విషయాలకే అతిగా స్పందించడాన్ని ఆర్కానో ఫోబియా అంటారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. వచ్చిన అతిథి
ఇండియానా: దాదాపు 140 సంవత్సరాల తర్వాత ఓ అతిథి ఇండియానా అడవులను పలకరించింది. దీంతో అటవీశాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. తిరిగి ఆ సంతతి తమ వద్ద పునరుత్పత్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ అతిథి ఎవరనీ అనుకుంటున్నారా. నల్లటి ఎలుగుబంటి. అవును.. 1871 నుంచి ఇండియానా అడవుల్లో ఎలుగు బంట్లు కరువై పోయాయట. అంతకుముందు కుప్పలుగా ఉన్న అవి ఉన్నపలంగా అంతరించిపోయి పూర్తిగా కనిపించడం మానేశాయి. వారి వద్ద ఉన్న డేటా ప్రకారం.. 140 ఏళ్లుగా ఒక్క ఎలుగుబంటి కూడా తమ అడవుల్లో ఉన్నట్లు రికార్డుల్లో లేదు. తాజాగా దాని పాదముద్రలు, మల విసర్జన గుర్తించిన అధికారులు వచ్చింది మగ ఎలుగుబంటి అని, అది మిచిగాన్ ప్రాంతం నుంచి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, చాలాకాలం తర్వాత ఎలుగుబంట్లు కనిపించడంతో అక్కడి వారు చాలా ఆందోళన చెందుతున్నారట. ఎందుకంటే అవి చాలా క్రూరమైన జాతికి చెందినవి. -
‘ఇండియానా’లో మిస్టర్ ఇండియా
అనిల్‌కపూర్, శ్రీదేవి నటించిన 1987 నాటి సూపర్‌హిట్ మూవీ‘మిస్టర్ ఇండియా’ను ఇటీవల అమెరికాలోని ఇండియానా వర్సిటీలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన తిలకించేందుకు అనిల్ కపూర్ స్వయంగా ఇండియానా వెళ్లాడు. తన సినిమాను అక్కడ ప్రదర్శించడం చాలా థ్రిల్ ఇచ్చిందంటూ అనిల్ కపూర్ తబ్బిబ్బవుతున్నాడు. ‘మిస్టర్ ఇండియా’ సినిమాను ఇండియానా వర్సిటీ విద్యార్థులు, బోధనా సిబ్బంది కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ప్రదర్శన తర్వాత విద్యార్థులతో ఇష్టాగోష్టి కార్యక్రమంలో కూడా అనిల్ కపూర్ పాల్గొన్నాడు.