మృదుమధురమైన షెహనాయి స్వరాలు ఎక్కడైనా వినిపించాయంటే అందరికీ ముందుగా ప్రముఖ షహనాయి వాయిద్యకారుడు బిస్మిల్లా ఖాన్ తప్పక గుర్తుకు వస్తారు. ఈరోజు (ఆగస్టు 21) ఆ మహనీయుని వర్థింతి. నేడు సంగీత ప్రియులు ఆయనను తప్పనిసరిగా గుర్తుచేసుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా షెహనాయ్‌కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత బిస్మిల్లా ఖాన్‌కే దక్కుతుంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి ఎర్రకోటపై నుంచి ప్రధాన మంత్రి ప్రసంగం అనంతరం బిస్మిల్లా ఖన్ షెహనాయి ప్లే చేశారు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం అనంతరం షెహనాయ్ వాయించడం ఆనవాయితీగా వస్తోంది.
బిస్మిల్లా ఖాన్ 1961 మార్చి 21న బీహార్‌లోని దుమ్రాన్ గ్రామంలో జన్మించారు. బాల్యంలో అతని పేరు ఖమరుద్దీన్. తరువాత అతని తాత రసూల్ భక్ష్ అతని పేరును బిస్మిల్లాగా మార్చారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కుటుంబం ఐదు తరాలుగా షెహనాయ్ వాయిస్తూ వస్తోంది. బిస్మిల్లా ఖాన్ తన 14 ఏళ్ల వయసులో తొలిసారి షెహనాయ్ వాయించారు. అనతికాలంలోనే మరింత ప్రావీణ్యం సంపాదించి, సంగీత ప్రపంచంలో షెహనాయ్‌కి భిన్నమైన గుర్తింపు తెచ్చారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం అతనికి డాక్టరేట్ పట్టా ఇచ్చింది.
2001లో సంగీత రంగంలో ఆయన చేసిన కృషికి గాను దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’తో ప్రభుత్వం సత్కరించింది. ఆయన 1980లో పద్మవిభూషణ్, 1968లో పద్మభూషణ్ అవార్డులు కూడా అందుకున్నారు. బిస్మాల్లా ఖాన్ మరణం తరువాత, అతను వినియోగించిన షెహనాయిని అతనితో పాటు ఖననం చేశారు.
బిస్మిల్లా ఖాన్ షెహనాయి వాదనను ప్రతి ఏటా ఆగస్టు 15న దూరదర్శన్‌లో ప్రసారం చేస్తుంటారు. ఆయన షెహనాయి ప్లే చేయడం ద్వారా ఏమీ సంపాదించలేదు. ఫలితంగా పలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు. బిస్మిల్లా ఖాన్ తన తన జీవితపు చివరి రోజుల్లో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద షెహనాయ్ వాయించాలని భావించారు. అయితే ఆ కోరిక నెరవేరకుండానే 2006 ఆగస్టు 21న బిస్మిల్లా ఖాన్ కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment