Bismillah Khan
-
బిస్మిల్లా ఖాన్ వర్థంతి: మరణంలో షెహనాయి తోడు
మృదుమధురమైన షెహనాయి స్వరాలు ఎక్కడైనా వినిపించాయంటే అందరికీ ముందుగా ప్రముఖ షహనాయి వాయిద్యకారుడు బిస్మిల్లా ఖాన్ తప్పక గుర్తుకు వస్తారు. ఈరోజు (ఆగస్టు 21) ఆ మహనీయుని వర్థింతి. నేడు సంగీత ప్రియులు ఆయనను తప్పనిసరిగా గుర్తుచేసుకుంటారు.ప్రపంచవ్యాప్తంగా షెహనాయ్కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత బిస్మిల్లా ఖాన్‌కే దక్కుతుంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి ఎర్రకోటపై నుంచి ప్రధాన మంత్రి ప్రసంగం అనంతరం బిస్మిల్లా ఖన్ షెహనాయి ప్లే చేశారు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం అనంతరం షెహనాయ్ వాయించడం ఆనవాయితీగా వస్తోంది.బిస్మిల్లా ఖాన్ 1961 మార్చి 21న బీహార్‌లోని దుమ్రాన్ గ్రామంలో జన్మించారు. బాల్యంలో అతని పేరు ఖమరుద్దీన్. తరువాత అతని తాత రసూల్ భక్ష్ అతని పేరును బిస్మిల్లాగా మార్చారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కుటుంబం ఐదు తరాలుగా షెహనాయ్ వాయిస్తూ వస్తోంది. బిస్మిల్లా ఖాన్ తన 14 ఏళ్ల వయసులో తొలిసారి షెహనాయ్ వాయించారు. అనతికాలంలోనే మరింత ప్రావీణ్యం సంపాదించి, సంగీత ప్రపంచంలో షెహనాయ్కి భిన్నమైన గుర్తింపు తెచ్చారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం అతనికి డాక్టరేట్ పట్టా ఇచ్చింది.2001లో సంగీత రంగంలో ఆయన చేసిన కృషికి గాను దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’తో ప్రభుత్వం సత్కరించింది. ఆయన 1980లో పద్మవిభూషణ్, 1968లో పద్మభూషణ్ అవార్డులు కూడా అందుకున్నారు. బిస్మాల్లా ఖాన్ మరణం తరువాత, అతను వినియోగించిన షెహనాయిని అతనితో పాటు ఖననం చేశారు.బిస్మిల్లా ఖాన్ షెహనాయి వాదనను ప్రతి ఏటా ఆగస్టు 15న దూరదర్శన్‌లో ప్రసారం చేస్తుంటారు. ఆయన షెహనాయి ప్లే చేయడం ద్వారా ఏమీ సంపాదించలేదు. ఫలితంగా పలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు. బిస్మిల్లా ఖాన్ తన తన జీవితపు చివరి రోజుల్లో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద షెహనాయ్ వాయించాలని భావించారు. అయితే ఆ కోరిక నెరవేరకుండానే 2006 ఆగస్టు 21న బిస్మిల్లా ఖాన్ కన్నుమూశారు. -
వమ్ముకాని విశ్వాసం
తాను చెరువులో విసిరేసిన ఉంగరాన్నిచేప మింగిందని, ఆ చేపనే తన స్నేహితుడుతనకు కానుకగా ఇచ్చాడని, దాన్నే బిస్మిల్లాహ్ అని చదివి కూతురు కోసి ఉంటుందని, ఇదంతా బిస్మిల్లాహ్పఠించడం వల్లనే జరిగిందని తండ్రికి బోధపడింది. ఏదైనా పని ప్రారంభించే ముందు ‘బిస్మిల్లాహ్’ అని పఠిస్తే మంచిదనే విషయాన్ని ఒక పండితుని దగ్గర నేర్చుకుందో అమ్మాయి. ఆ రోజు నుంచి ‘బిస్మిల్లాహ్ చదవందే ఏ పనీ మొదలెట్టేది కాదు. అయితే, అది ఆ అమ్మాయి తండ్రికి రుచించలేదు. తన కూతురి చేత ‘బిస్మిల్లాహ్’ అనడం, రాయడం మాన్పించాలని ఆ తండ్రి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకరోజు అత్యంత ఖరీదైన ఒక ఉంగరాన్ని కూతురికిచ్చి దాన్ని భద్రంగా దాచి ఉంచమని చెప్పాడు. అమ్మాయి ‘బిస్మిల్లాహ్’ చదివి ఉంగరాన్ని తన జేబులో వేసుకుంది. రాత్రి అమ్మాయి నిద్రలోకి జారుకున్నాక ఆమె నుంచి ఉంగరాన్ని దొంగిలించి, దానిని ఒక చెరువులో విసిరేసి ఇంటికి వచ్చాడు. ఏమీ ఎరగనట్టుగా ఉంగరం ఏది? అని అడిగాడు. తాను దాచిన తావులో చూస్తే ఉంగరం కనిపించలేదు అమ్మాయికి. ‘సాయంత్రంలోగా తన ఉంగరాన్ని తనకు అప్పజెప్పకపోతే నా చేతిలో నీ చావు ఖాయం’ అని హెచ్చరికలు చేశాడు. తండ్రి బెదిరింపులకు కించిత్తు కూడా ఆందోళన చెందకుండా రోజంతా బిస్మిల్లాహ్ పఠించడంలోనే లీనమైపోయింది ఆ అమ్మాయి. ఇంతలో ఒక స్నేహితుడు ఒక చేపను ఆ అమ్మాయి తండ్రికి కానుకగా అందించాడు. ఆ చేపను పులుసు చేయమని పురమాయించాడు తండ్రి. బిస్మిల్లాహ్ చదివి చేపను కత్తితో కోయగా చేప కడుపులోంచి ఉంగరం బయటపడింది. ఆనందంగా ఆ ఉంగరాన్ని తీసి శుభ్రం చేసి, దాచి పెట్టింది. తండ్రి రాగానే ఆయన చేతికి అందించింది. అది చూసి తండ్రి విస్తుపోయాడు. తాను చెరువులో విసిరేసిన ఉంగరాన్ని చేప మింగిందని, ఆ చేపనే తన స్నేహితుడు తనకు కానుకగా ఇచ్చాడని, దాన్నే బిస్మిల్లాహ్ అని చదివి కూతురు కోసి ఉంటుందని, ఇదంతా బిస్మిల్లాహ్ పఠించడం వల్లనే జరిగిందని తండ్రికి బోధపడింది. కూతుర్ని మార్చే ఆలోచనను విరమించుకుని తానూ బిస్మిల్లాహ్ పఠించడం మొదలెట్టాడు. దైవవిశ్వాసులకు ఎప్పుడూ మేలే కలుగుతుంది. – జుబేదాబేగం -
జపాన్ ప్రధానికి షెహనాయ్ స్వాగతం
వారణాసి: ప్రముఖ షెహనాయ్ విధ్వాంసుడు బిస్మిల్లా ఖాన్ కుమారుడు జపాన్ ప్రధాని షింజో అబేకు స్వాగతం పలకనున్నారు. శనివారం సాయంత్రం అబే వారణాసి సందర్శించనున్న నేపధ్యంలో నాదేశ్వర్ లోని హోటల్ తాజ్ గేట్ వేలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో షెహనాయ్ కచేరి ఉంది. దీనిద్వారా ఒకప్పటి షెహనాయ్ లెజండరీ, భారత రత్న అవార్డు గ్రహీత బిస్మిల్లా ఖాన్ కుమారుడు జమీన్ ఉస్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో అబేకు స్వాగతం కార్యక్రమం ఏర్పాటుచేశారు. దీంతోపాటు గంగా నది ఒడ్డున అబేకు గంగా హారతి కార్యక్రమంతో కూడా అబే పాల్గొంటారు. అబే అక్కడికి వస్తున్న నేపథ్యంలో వారణాసి మొత్తం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.