గుడ్‌న్యూస్‌ : 20 రోజుల్లో 20 స్మార్ట్‌ఫోన్లు ఫ్రీ | you can win Xiaomi smartphones for free starting June 28  | Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌ : 20 రోజుల్లో 20 స్మార్ట్‌ఫోన్లు ఫ్రీ

Published Tue, Jun 25 2019 7:25 PM | Last Updated on Tue, Jun 25 2019 7:30 PM

you can win Xiaomi smartphones for free starting June 28  - Sakshi

సాక్షి, ముంబై : స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ షావోమి తన వినియోగదారులకు మరోసారి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.  దేశీయంగా ఈ నెల (జూన్‌) 28 నుంచి  ఎంఐ ఫ్యాన్స్‌  ఉచితంగా  షావోమి ష్లాగ్‌షిప్‌ ఫోన్లను గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. వారానికి అయిదుగురు చొప్పున  20 రోజుల్లో 20 స్మార్ట్‌ఫోన్లను ఉచితం అందించనుంది.  5 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ  ఆఫర్‌ను   అందిస్తోంది.

లక్కీ డ్రా ద్వారా జూన్‌ 28 - జూలై 19 మధ్య కాలంలో  విజేతలను  ఎంపిక  చేయనుంది. వెయ్యి రూపాయలు, ఆపైన  ప్రీ పెయిడ్‌ ఆర్డర్‌ చేసిన  వినియోగదారులు మాత్రమే ఈ లక్కీ డ్రాకు అర్హులు. విజేతలకు రెడ్‌మి నోట్‌ 7ఎస్‌(3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌)ఒకటి,  రెడ్‌మి నోట్‌ 7 (3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌) రెండు,  రెడ్‌ మి 7 (3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌)  రెండు స్మార్ట్‌ఫోన్లను వారానికి అందించనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement