విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పారిశ్రామికవేత్తలు, నూతన ఆవిష్కర్తలకు తెలంగాణ రాష్ట్రం జాతీయ సాంకేతిక కేంద్రంగా మారిందని, అందులో‘టి–హబ్’పాత్ర కీలకమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన టి–హబ్ ఏడవ వార్షికోత్సవానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించిన 26 స్టార్టప్ కంపెనీలకు అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గత ఏడేళ్లలో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌లోని ప్రభుత్వం, విద్యాసంస్థలు, కార్పొరేషన్లు, పెట్టుబడిదారులు మొదలైన కీలక వాటాదారులతో స్టార్టప్‌లను అనుసంధానం చేయడంలో టి–హబ్ కృషి ఎంతో ఉందన్నారు. దేశ ఆర్థిక పునాదిని బలోపేతం చేయడంతోపాటు ప్రపంచస్థాయి సాంకేతిక అభివృద్ధికి ప్రేరణగా, ప్రపంచ పోటీదారుగా రాష్ట్రం నిలిచేందుకు టి–హబ్ ఉపయోగపడిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment