ముంబై: భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే ఆకాంక్షను సాధించాలంటే ఆర్థిక సంస్థల స్థాయి, పరిమాణం గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర రావు అన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 90వ వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని ఇక్కడ నిర్వహించిన ‘గ్లోబల్ సౌత్‌లోని సెంట్రల్ బ్యాంక్‌ల ఉన్నత–స్థాయి విధాన సదస్సు’లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు...
గతంలో ప్రారంభించిన నియంత్రణా విధానాలు, తీసుకున్న విధానపరమైన చర్యలు భారత్‌లో పటిష్టమైన. సవాళ్లను తట్టుకోగల ఆర్థిక వ్యవస్థ, ఆర్థికాభివృద్ధికి దారితీశాయి. అనేక సంక్షోభాలను ఎదుర్కొన్న భారత్ ఎకానమీని స్థిరపరచాయి.
అయితే ఎకానమీ మరింత పురోభివృద్ధికి ఫైనాన్షియల్ సంస్థల పరిమాణం మరింత పెరగాలి. దృఢమైన పాలన వ్యవస్థ, ప్రభావవంతమైన రిస్క్ మేనేజ్‌మెంట్ ఈ దిశలో పురోగతికి దారితీసే అంశాలు.
బ్యాంకులతో పాటు సంస్థలుసైతం తమ పెరుగుతున్న నిధులు అవసరాలను నెరవేర్చుకోడానికి క్యాపిటల్ మార్కెట్‌లను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది.
ఆర్‌బీఐకి ఉన్నంత విస్తృత ఆధారిత ప్రపంచంలో చాలా సెంట్రల్ బ్యాంకులు లేవు. ఎకానమీ పురోభివృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఆర్‌బీఐ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో కేంద్రంతో సమన్వయంతో పనిచేస్తోంది.
ఆర్‌బీఐ 75 సంవత్సరాల అనుభవం.. దేశ అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చడంతోపాటు, ఎకానమీకి మద్దతు ఇవ్వగల బలమైన ఆర్థిక రంగానికి పునాదిని నిర్మించింది.
Comments
Please login to add a commentAdd a comment