సాక్షి, ముంబై : దేశీయ టెలికాం రంగంలోకి సునామీలా దూసుకొచ్చిన ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ జియో తన హవాను అప్రతిహతంగా కొనసాగిస్తోంది. టెలికాం రంగంలో ఎంట్రి ఇచ్చి గత నాలుగేళ్లుగా అనేక సంచలనాలకు నాంది పలికింది. సామాన్య ప్రజానీకానికి డేటా రుచి చూపించి టెలికాం రంగంలోవిప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఒకప్పుడు 4జీ డేటా ఉపయోగించడం విలాసవంతంగా భావించేవారు. కానీ ఇప్పుడు 4జీ డేటా నిత్యావసరాల్లో ఒకటిగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే జియో ఎంట్రీతో రోటీ, కపడా ఔర్ మకాన్ కాస్తా.. రోటీ, కపడా ఔర్ డేటాగా మారిపోయిందంటే అతి శయోక్తికాదు.
1 జీబీ డేటా 185 -200 రూపాయలు
2016 లో జియో వచ్చిన సమయంలో, వినియోగదారు ఒక జీబీ డేటా కోసం 185 నుండి 200 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం, రిలయన్స్ జియో ప్లాన్ల ప్రకారం జీబీ డేటా ఖర్చు ఐదు రూపాయలు మాత్రమే. అంటే డేటా ధరలు 40 రెట్లు తగ్గిపోయాయి. నాలుగేళ్ల క్రితం సెప్టెంబర్ 5, 2016 న ఉచిత వాయిస్ కాలింగ్ , డేటా ఆఫర్లతో రిలయన్స్ జియోదేశ టెలికాం రంగంలోకి అడుగుపెట్టినప్పుడు ఈ సునామీని ఎవరూ ఊహించలేదు. డేటా వినియోగంలో దేశాన్ని టాప టెన్ లో నిలుపుతానన్న వాగ్దానాన్ని తు.చ. తప్పకుండా అమలు చేసి చూపించారు. అంబానీ. మొబైల్ డేటా వినియోగం విషయంలో 230 దేశాల్లో 155 వ స్థానంలో ఉన్న దేశం ఇపుడు మొదటి స్థానానికి చేరుకుంది. కేవలం నాలుగు సంవత్సరాలలో టెలికాం రంగం ముఖచిత్రాన్ని మార్చిన ఘనత రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత‍్వంలోని రిలయన్స్ జియోకే దక్కుతుంది. జియో రాకముందు, డేటా వినియోగం నెలకు చందాదారునికి 0.24 జీబీ మాత్రమే, ప్రస్తుతం ఇది 10.4 జీబీ చొప్పున అనేక రెట్లు పెరిగింది.
ట్రాయ్ ప్రకారం, అమెరికా చైనా కలిసి వినియోగించే మొబైల్ 4జీ డేటా కంటే ఎక్కువ డేటా వినియోగంలో ఉంది. 300 మిలియన్ జీబీ డేటా వినియోగం ఇప్పుడు నెలకు 6 బిలియన్ డేటా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా 60 శాతం వాటాతో జియో ఆధిపత్యాన్ని చాటుకుంటోంది.
ఇండియా కా ఇంటెలిజెంట్ స్మార్ట్‌ఫోన్ జియో ఫోన్ రాకతో గ్రామాల్లో డేటా చందాదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 25 మిలియన్లకు పైగా జియోఫోన్ వినియోగదారులను తనఖాతాలో వేసుకుంది. గత సంవత్సరం ఆగస్టు 15 నుండి జియో ఫైబర్ పేరుతో వాణిజ్యపరంగా బ్రాడ్ బ్యాండ్ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చింది జియో. దాదాపు 1,600 పట్టణాలనుంచి 15 మిలియన్లకు పైగా రిజిస్ట్రేషన్లు సాధించింది.
వినియోగదారులు, మార్కెట్ వాటా ఆదాయాల పరంగా అగ్రభాగాన నిలిచింది. కస్టమర్లను తన నెట్‌వర్క్‌కు జత చేయడంలో రికార్డు సృష్టించింది. గత నాలుగేళ్లలో 400 మిలియన్లకు పైగా వినియోగదారుల తో ‘డేటా ఈజ్ న్యూ ఆయిల్’ అన్న తన మాట అక్షరాలా నిజమని నిరూపించారు. అంతేకాదు కరోనా సంక్షోభంలో, ప్రపంచంలోని దిగ్గజ సంస‍్థలు ఫేస్‌బుక్ గూగుల్, సహా భారీ మొత్తంలో పెట్టుబడులు సాధించడం గమనార్హం. ఒకటిన్నర లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో మరో రికార్డు సృష్టించింది. 2021 మార్చి నాటికి రిలయన్స్ రుణ రహిత సంస్థగా నిలబడతాన్న మాటను అనుకున్న సమయంకంటే ముందే నిలబెట్టుకోవడం విశేషం.
2016 -2020 నాలుగేళ‍్ళ జియో ప్రస్థానం
- 2016, 5 సెప్టెంబర్
- ఉచిత కాలింగ్, ఉచిత డేటాతో జియో సునామీ ఆరంభం. భారతదేశంలో 4 జీ ఎల్‌టిఇ సేవలు ప్రారంభం.
- 2017, 21 జూలై
- 170 రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వినియోగదారులు. సగటున, ప్రతి రోజు సెకనుకు 7 మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. జియో ఇండియా కా ఇంటెలిజెంట్ స్మార్ట్‌ఫోన్ పరిచయం.
- 2018 , 5 జూలై
- ప్రారంభమైన 22 నెలల్లో రికార్డు స్థాయిలో 215 మిలియన్ల కస్టమర్లు. ప్రపంచంలో ఎక్కడా ఏ టెక్నాలజీ కంపెనీ సాధించలేని ఘనత. డేటా వినియోగం నెలకు 125 కోట్ల జీబీల నుంచి నెలకు 240 కోట్లకు పైగా పెరిగింది.
- 2019, ఆగస్టు 12 జియో ఫైబర్
భారతదేశం అంతటా ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ లేదా ఐయోటి.
హోమ్ బ్రాడ్‌బ్యాండ్
ఎంటర్ప్రైజ్ బ్రాడ్‌బ్యాండ్
2020, జూలై 15
రానున్న మూడేళ్లలో 50 కోట్ల జియో వినియోగదారులు, 5 కోట్ల ఫైబర్ యూజర్ల లక్ష్యం. మేడ్-ఇన్-ఇండియాలో భాగంగా 5జీ సేవలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. 5జీ స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చిన వెంటనే ట్రయల్స్‌కు రడీ. వచ్చే ఏడాది ఫీల్డ్ డిప్లాయ్‌మెంట్‌కు సంసిద్దమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment