బలమైన జాతి నిర్మాణమే ఐ ఫోకస్‌ లక్ష్యం  | I Focus Mission JAYA PRADHA 18th Anniversary Celebrations 2023 | Sakshi
Sakshi News home page

బలమైన జాతి నిర్మాణమే ఐ ఫోకస్‌ లక్ష్యం 

Published Sun, Dec 31 2023 4:15 AM | Last Updated on Sun, Dec 31 2023 4:18 PM

I Focus Mission JAYA PRADHA 18th Anniversary Celebrations 2023 - Sakshi

ఉప్పల్‌ (హైదరాబాద్‌): బలమైన జాతి నిర్మాణమే ‘ఐ ఫోకస్‌’సంస్థ లక్ష్యమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు సభ్యులుగా ఉన్న ఈ సంస్థ 18 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో సంస్థ సభ్యులకు ఆయన అభినందలు తెలిపారు. ఉప్పల్‌ భగాయత్‌ శిల్పారామంలో ‘జయప్రద–2023’పేరిట శనివారం నిర్వహించిన ఐ ఫోకస్‌ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలోని లేని యువత భారత్‌కు ఉందని, 2047 నాటికి స్వతంత్ర భారత్‌ వందేళ్లు పూర్తి చేసుకుంటుందన్నారు. అప్పటికి భారత్‌ ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి చేరుకుంటుందని ఆశా­భావం వ్యక్తం చేశారు. ‘ఐ ఫోకస్‌’శివానంద మూర్తి కళలు కన్న భారత్‌ను చూస్తామని, ఆ యజ్ఞంలో ఇక్కడి సభ్యులంతా భాగస్వాములుగా ఉంటారన్నారు. అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తున్న ఐ ఫోకస్‌ సంస్థ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

18 ఏళ్ల క్రితం పిడికెడు మందితో ప్రారంభమైన ఈ సంస్థ నేడు 15 వేల మంది సభ్యులను సంపాదించుకుందన్నా­రు. విద్యార్థుల్లో ఏకాగ్రత, మహిళల్లో ఆత్మ­వి­శ్వాసం, ఉద్యోగుల్లో సమర్థత, యువతలో చైతన్యం, నూరిపోయడం, ప్యావారుల్లో నైప్యుణాన్ని పెంపొందించడానికి ఐ ఫోకస్‌ కృషిచేస్తోందన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి వస్తుండగా, ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో కిషన్‌రెడ్డి, హరీశ్‌రావు నాగోల్‌ మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కి గమ్యానికి చేరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement