Jaya Pradha
-
బలమైన జాతి నిర్మాణమే ఐ ఫోకస్ లక్ష్యం
ఉప్పల్ (హైదరాబాద్): బలమైన జాతి నిర్మాణమే ‘ఐ ఫోకస్’సంస్థ లక్ష్యమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు సభ్యులుగా ఉన్న ఈ సంస్థ 18 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో సంస్థ సభ్యులకు ఆయన అభినందలు తెలిపారు. ఉప్పల్ భగాయత్ శిల్పారామంలో ‘జయప్రద–2023’పేరిట శనివారం నిర్వహించిన ఐ ఫోకస్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలోని లేని యువత భారత్‌కు ఉందని, 2047 నాటికి స్వతంత్ర భారత్ వందేళ్లు పూర్తి చేసుకుంటుందన్నారు. అప్పటికి భారత్ ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఐ ఫోకస్’శివానంద మూర్తి కళలు కన్న భారత్‌ను చూస్తామని, ఆ యజ్ఞంలో ఇక్కడి సభ్యులంతా భాగస్వాములుగా ఉంటారన్నారు. అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తున్న ఐ ఫోకస్ సంస్థ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. 18 ఏళ్ల క్రితం పిడికెడు మందితో ప్రారంభమైన ఈ సంస్థ నేడు 15 వేల మంది సభ్యులను సంపాదించుకుందన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఉద్యోగుల్లో సమర్థత, యువతలో చైతన్యం, నూరిపోయడం, ప్యావారుల్లో నైప్యుణాన్ని పెంపొందించడానికి ఐ ఫోకస్ కృషిచేస్తోందన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి వస్తుండగా, ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో కిషన్‌రెడ్డి, హరీశ్‌రావు నాగోల్ మెట్రో స్టేషన్లో రైలు ఎక్కి గమ్యానికి చేరుకున్నారు. -
జయప్రద వర్సెస్ డింపుల్!
లక్నో: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి, మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. రాంపూర్ ఎమ్మెల్యే ఆజంఖాన్.. అదే స్థానం నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయిన విషయం తెలిసిందే. దీంతో రాంపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ నేపథ్యంలో కనౌజ్ ఎంపీగా పోటీచేసి ఓటమిచెందిన.. డింపుల్‌ను ఉప ఎన్నికల బరిలో నిలిపేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్పీకి కంచుకోటయిన రాంపూర్‌లో డింపుల్ అయితేనే గెలుపొందే అవకాశం ఉందని, ఆ పార్టీ స్థానిక నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువచ్చినట్లు ఎస్పీ సీనియర్ నేత వెల్లడించారు. అయితే బీజేపీ నుంచి ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను బరిలో నిలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆమె రెండు సార్లు ఎంపీగా గెలుపొందగా.. గత ఎన్నికల్లో ఆజంఖాన్ చేతిలో ఓటమిని చవిచూశారు. 2009, 14 ఎన్నికల్లో ఎస్పీ నుంచి గెలుపొందిన జయప్రద అనంతరం బీజేపీలో చేరి ఓడిపోయారు. దీంతో అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో ఆమెనే నిలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె ఇప్పటికే పార్టీ పెద్దలతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడే అవకాశం ఉండడంతో రాంపూర్ ఉప ఎన్నిక ఉత్కంఠగా మారింది. త్వరలోనే ఈ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇదిలావుండగా.. లోక్‌సభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీలు ఫలితాల అనంతరం ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇక జరగబోయే ప్రతి ఎన్నికల్లోనూ తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రకటించారు. అయితే డింపుల్‌ను బరిలోకి దింపితే.. బీఎస్పీ మద్దతు ఇస్తుందా లేదా అనేది ఎస్పీ నేతలను వెంటాడుతున్న ప్రశ్న. 1980 నుంచి ఇప్పటి వరకు ఈ స్థానంలో ఎస్పీ తప్ప మరో పార్టీకి గెలిచే అవకాశం రాలేదు. ఈసారి బీజేపీ ఇక్కడ విజయం సాధించాలని ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. అందుకే లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే జయప్రద రాంపూర్ స్థానిక నేతలతో చర్చలను ప్రారంభించారు. -
విడుదలకు సిద్ధమైన ‘సువర్ణ సుందరి’
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సువర్ణసుందరి’. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకుడు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు బి.గోపాల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సాగర్ మాట్లాడుతూ... ‘ఇది చాలా ఎక్స్ట్రాడినరీ చిత్రం. హీరోయిన్స్ చాలా చక్కగా చేశారు. మన తెలుగు సినీ పరిశ్రమకు అందగత్తే జయప్రద. ఆవిడ కూడా ఈ చిత్రంలో నటించారు. ఎంటైర్ టీమ్ కి ఆల్ ద బెస్ట్. సాయికార్తిక్ మ్యూజిక్ బావుంది. ఫైట్స్ చాలా బాగా వచ్చాయి.’ అన్నారు. హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ... ‘సహనం అంటే అది సూర్య గారి నుంచే నేర్చుకోవాలి. ప్రతీ ఒక్కరికీ చాలా ఓర్పుగా తమ తమ పాత్రల గురించి చాలా చక్కగా వివరించి ఆయనకు ఏమి కావాలో ఆ అవుట్ పుట్ తెప్పించుకున్నారు. ఫైట్ మాస్టర్‌కి కూడా నా కృతజ్ఞతలు. హీరో రామ్ కూడా మొదట్లో కొంచం భయపడేవారు కాని బాగా నటించారు. సాక్షి మనిద్దరి మధ్య జరిగే చాలా సన్నివేశాలు అన్నీ ఫన్నీగా జరిగిపోయాయి. మా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అన్నారు. -
‘శరభ’ ఫస్ట్ సింగిల్
బాహుబలి సక్సెస్ తరువాత సోషియో ఫాంటసీ సినిమాలకు ఆధారణ పెరిగింది. అదే బాటలో తెరకెక్కుతున్న మరో గ్రాఫికల్ వండర్ శరభ. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘శరభ’ పోస్టర్ రిలీజ్ చేయించారు మేకర్స్. దీంతో ‘శరభ’ సినిమాపై టాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. చాలా ఏళ్ల తరువాత జయప్రద ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో ఆకాశ్ కుమార్ సహదేవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. తాజాగా శరభ సినిమాలోని ‘టామ్ అండ్ జెర్రీ’ అనే పాటను విడుదల చేశారు. సంగీత దర్శకుడు కోటి స్వరాలు సమకూర్చగా, అనంత శ్రీరామ్ సాహిత్యాని అందించారు. హేమచంద్ర పాడిన ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. మిస్తీ చక్రవర్తి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అశ్విని కుమార్ సహదేవ్ నిర్మాతగా వ్యవహరించగా, నర్సింహా రావు దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 1న శరభ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఎలక్షన్ వాచ్...
జయప్రద, అమర్‌లకు ఎంపీ టికెట్ల ఖరారు లక్నో: రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)లో చేరిన సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేతలు అమర్‌సింగ్, జయప్రదలకు లోక్‌సభ టికెట్లు ఖరారయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీ నుంచి అమర్, బిజ్నూర్ నుంచి జయ పోటీలో దిగనున్నారు. ఆర్ఎల్డీ అధినేత అజిత్‌సింగ్ బాగ్పత్ నుంచి బరిలో దిగుతుండగా, ఆయన తనయుడు జయంత్ చౌధురి మథుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌తో జతకట్టిన ఆర్ఎల్డీకి సర్దుబాటులో భాగంగా యూపీలో ఆరు సీట్లు వచ్చాయి. దీంతో ఆయా నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఆర్ఎల్డీ మంగళవారం ప్రకటించింది. ‘చాయ్ పే చర్చా’లో ఉచిత టీలు ఇవ్వొద్దు! లక్నో: ముందస్తుగా తగిన అనుమతి తీసుకున్న తర్వాతే ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఆ కార్యక్రమం సందర్భంగా ఎన్నికల కోడ్‌ను అతిక్రమించేలా ప్రజలకు ఉచితంగా టీలు ఇవ్వొద్దని మంగళవారం బీజేపీకి ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈసీ మార్గదర్శకాల ప్రకారం.. జిల్లా ఎన్నికల అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాకే చాయ్ పే చర్చా నిర్వహించాలని యూపీ ముఖ్య ఎన్నికల అధికారి ఉమేశ్ సిన్హా తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనేవారి నుంచి చాయ్‌కి డబ్బులు వసూలు చేయాలన్న షరతుతోనే సంబంధిత అధికారులు అనుమతి జారీ చేస్తారన్నారు. చాయ్ పే చర్చాలో చాయ్‌కి అందరితోనూ డబ్బులు వసూలు చేస్తామని బీజేపీ యూపీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ హామీనిచ్చారని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రేకు మోడీ బుజ్జగింపు ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్)తో దోస్తీకి బీజేపీ అర్రులు చాస్తుండడంపై భగ్గుమంటున్న ఎమ్మెన్నెస్ బద్ధశత్రువు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రంగంలోకి దూకారు. ఉద్ధవ్ కు ఆయన మంగళవారం రాత్రి ఫోన్ చేసి బుజ్జగించారు. ‘సేన బీజేపీకి పాత, నమ్మకమైన నేస్తం. పాతికేళ్ల మన బంధం బలమైంది’ అని మోడీ చెప్పినట్లు శివసేన వర్గాలు తెలి పాయి. ప్రస్తుత పరిణామాలపై ఆందోళనపడాల్సి అవసరం లేదని అన్నారన్నాయి. రాజకీయ పార్టీలపై ఎనిమిది కేసులు న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు వివిధ రాజకీయ పార్టీలపై ఇప్పటి వరకు 8 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయని ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికలకు ఈ నెల 5న షెడ్యూల్ విడుదలతో ఎన్నికల నియమావళి అదే రోజు నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోడ్‌ను ఉల్లంఘించాయంటూ కాంగ్రెస్‌పై ఒకటి, ఇతర పార్టీలపై ఏడు ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయని ఈసీ నోడల్ అధికారి ఒకరు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని చెప్పారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 72 తుపాకులు, పెద్ద మొత్తంలో లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మూడో కూటమికి మద్దతు: కరుణ చెన్నై, సాక్షి : రాహుల్‌గాంధీ, నరేంద్రమోడీ లేని మూడో లౌకికవాద కూటమికి డీఎంకే మద్దతిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి స్పష్టం చేశారు. వంద అంశాలు, హామీలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం ఆయన ఇక్కడ విడుదల చేశారు. కచ్చదీవుల సాధన, సేతు సముద్ర పథకం పూర్తి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం మహిళా రిజర్వేషన్, పది లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, ఈలం తమిళుల సమస్యపై ప్రజాభిప్రాయ సేకరణ, ఉరిశిక్ష రద్దు, మద్రాస్ హైకోర్టులో తమిళ భాష అమలు, నదుల అనుసంధానం వంటి వంద హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 76 మంది ఎంపీలపై తీవ్ర నేరాభియోగాలు న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్‌సభ సభ్యుల్లో 76 మంది తీవ్రమైన నేరాభియోగాలను ఎదుర్కొంటున్నారని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్), జాతీయ ఎన్నికల నిఘా సంస్థ(ఎన్ఈడబ్ల్యూ) వెల్లడించాయి. 2009లో లోక్‌సభకు ఎన్నికైన నేతల్లో 162 మంది 306 క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉండగా.. వారిలో 76 మంది హత్య, అపహరణ వంటి తీవ్ర నేరాల్లో నిందారోపణలను ఎదుర్కొంటున్నట్లు ఈ సంస్థలు తెలిపాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో అభియోగాలు నమోదైతే.. ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుసటి రోజే ఈ సంస్థలు నేతలపై కేసుల వివరాలను బయటపెట్టడం గమనార్హం. పెరుగుతున్న ఎన్నికల వ్యయం! సాక్షి, న్యూఢిల్లీ: పెరుగుతున్న పార్టీల సంఖ్య, స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య, జనాభాకు తగిన సంఖ్యలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ బూత్‌లు.. ఓటరు చైతన్య కార్యక్రమాలు.. వెరసి ప్రభుత్వానికి ఎన్నికల వ్యయం నానాటికీ పెరుగుతోంది. దీంతో సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఓటరు తలసరి వ్యయం పైసలు దాటి రూపాయిలకు చేరింది. దేశంలో తొలిసారి ఎన్నికలు జరిగిన 1951-52 నుంచి 2009లో జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికల వరకు ప్రభుత్వ ఖర్చు పరిశీలిస్తే ఓటరు తలసరి వ్యయం 20 రెట్లు పెరిగింది. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, సిబ్బందికి వేతనాలు, రవాణా, ఇతరత్రా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. 1951-52లో తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఒక ఓటరుకు 60 పైసలు వ్యయం చేయగా, 2009 నాటి ఎన్నికల్లో ఈ వ్యయం రూ.12కు చేరింది. 1951-52లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రూ.10.45కోట్లు వ్యయం చేయగా, 2009లో రూ.846.67 కోట్లు వ్యయం చేసింది.