
వెబ్‌డెస్క్: మొబైల్ ఫోన్ మార్కెట్‌లో దూకుడుకి మరో పేరైన రిలయ్‌మీ మరోసారి ఆఫర్లు ప్రకటించింది. రిలయ్ మీ బ్రాండ్ మార్కెట్‌లోకి వచ్చి మూడేళ్లయిన సందర్భంగా దాదాపు ఇరవైకి పైగా మొబైల్ ఫోన్లపై వివిధ ఆఫర్లు ప్రకటించింది. ఈఎంఐ, క్యాష్‌బ్యాక్ మొదలు దాదాపు 40 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ వేదికగా ఈ ఆఫర్లు జూన్ 4 నుంచి 8 వరకు అందుబాటులో ఉంటాయి.
40 శాతం డిస్కౌంట్
హైఎండ్ 5జీ ఫోన్లలో ఒకటైన రియల్ మీ ఎక్స్ 50 ప్రో 5జీ మోడల్‌పై ఏకంగా నలభై శాతం డిస్కౌంట్‌ని రియల్ మీ ప్రకటించింది. దీంతో రూ,41,999 వేలు ఉన్న ఫోన్ డిస్కౌంట్‌తో రూ. 24,999కే లభిస్తుంది. 5జీ సపోర్ట్ చేసే ఈ మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్‌ను ఉపయోగించారు.
రూ.13,999లకే 5జీ ఫోన్
బడ్జెట్ 5జీ ఫోన్‌గా రియల్‌మీ మార్కెట్లోకి తెచ్చిన రియల్ మీ 8 మోడల్ ధర మూడు వేలు తగ్గించి రూ. 13,999కే అమ్మకానికి పెట్టింది రియల్ మీ. ఈ మొబైల్‌లో మీడియా టెక్ ప్రాసెసర్‌ను ఉపయోగించింది. దీంతో పాటు బడ్జెట్ నుంచి హై ఎండ్ వరకు మొత్తం 20 మోడల్స్‌కి డిస్కౌంట్ ఇచ్చింది. సిటీబ్యాంకు క్రెడిట్‌కార్డు ఉపయోగించిన వారికి క్యాష్‌బ్యాక్ ఆఫర్లూ కూడా ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment