
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి తన ప్రముఖ కార్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఆడి ఏ3 ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఆడి ఇండియా ఈ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎంట్రీ లెవల్ సెడాన్ కారు ఏ3 ధరను (35 టీడీఐ ప్రీమియం ప్లస్) దాదాపు రూ.5 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోలు, డీజిల్ ఆప‍్షన్లలో లభిస్తున్న మొత్తం నాలుగు వేరింయట్లలోనూ ఈ తగ్గింపు ధరలను ప్రకటించింది.
వీటి ధరలు రూ.28.99 లక్షలు రూ. 31.99 లక్షలు (ఎక్స్ షో రూం, ఇండియా) ఉండనున్నాయి. అంతకుముందు ఈ ధరలు రూ.33.12 లక్షల నుంచి ప్రారంభం. టాప్ వేరియంట్ ధర రూ.36.12 లక్షలుగా ఉంది. అంటే టాప్ వేరియంట్‌పై రూ.5లక్షల భారీ తగ్గింపును కంపెనీ అందిస్తోంది.
ఆడి ఏ3లో ప్రధానంగా 35 టీఎఫ్ఎస్ఐ ప్రీమియం ప్లస్, 35 టీఎఫ్ ఎస్ఐ టెక్నాలజీ, 35 టీడీఐ ప్రీమియం ప్లస్, 35 టీడీఐ టెక్నాలజీ అనే నాలుగు వేరియంట్లలో లభ్యం. 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 150పీఎస్, 250 ఎన్‌ఎం ఆడి ఏ3 పెట్రోల్ వేరియంట్ ప్రధాన ఫీచర్లు. ఏ3 డీజిల్ వేరియంట్‌లో 2 లీటర్ టర్బో చార్జ్‌డ్ ఇంజిన్,6 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 143 పీఎస్, 320 ఎన్‌ఎం ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.
35 టీఎఫ్ఎస్ఐ ప్రీమియం ప్లస్ : ప్రస్తుత ధర రూ. 28.99 లక్షలు, అసలు ధర రూ.33.12 లక్షలు
35 టీఎఫ్ ఎస్ఐ టెక్నాలజీ : ప్రస్తుత ధర రూ. 30.99 లక్షలు, అసలు ధర రూ.34.57 లక్షలు
35 టీడీఐ ప్రీమియం ప్లస్ : ప్రస్తుత ధర రూ. 29.99 లక్షలు, అసలు ధర రూ.34.93 లక్షలు
35 టీడీఐ టెక్నాలజీ : ప్రస్తుత ధర రూ. 31.99 లక్షలు, అసలు ధర రూ.36.12 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment