
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ రిటైల్ చైన్ బిగ్‘సి’ సంస్థ విజయవంతగా 20వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా వేడుకలకు సిద్ధమైంది. ‘‘రిటైల్ కస్టమర్లకు అత్యుత్తమ సేవలను, అమ్మకాలను అందించే ఉద్దేశంతో 2002 విజయవాడలో తొలి స్టోర్‌ను స్థాపించాము. నాటి నుంచి ఉన్నతమైన ప్రమాణాలను పాటిస్తూ., గత 19 ఏళ్లలో 250కి పైగా స్టోర్లను నెలకొల్పి అద్భుతమైన అమ్మకాలతో ఐదు కోట్ల మంది కస్టమర్లకు సౌకర్యవంతమైన సేవలు అందించాము’’ అని కంపెనీ సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసిన 90 నిమిషాల్లోనే కస్టమర్లు కోరిన మొబైల్‌ను అందిస్తున్నామన్నారు. కంపెనీ 19 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొబైల్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌ట్యాబ్‌ల కొనుగోళ్ల పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించామని., కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.