Big C mobiles
-
Mahesh Babu Photos: మహేష్ బాబు లేటెస్ట్ అప్పియరెన్స్ (ఫొటోలు)
-
బిగ్ సి సంక్రాంతి పండుగ ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్స్ రీటైల్ విక్రయ సంస్థ బిగ్ సి కస్టమర్లకు కోసం సంక్రాంతికి అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సందర్భంగా మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లపై ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తున్నామని బిగ్ సి వ్యవస్థాపకులు, సీఎండీ బాలు చౌదరి తెలిపారు. మొబైళ్ల కొనుగోళ్లపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్దతిలో కొనుగోళ్లకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ప్రతీ మొబైల్‌పై కచ్చితమైన బహుమతి, స్మార్ట్ టీవీల కొనుగోలుపై రూ.4,000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తున్నామన్నారు. అమెజాన్ పే, డెబిట్‌కార్డు, పేటియం మాల్ ద్వారా కొనుగోళ్లపై పలు ఆఫర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. -
బిగ్ సి @20 ఇయర్స్
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ రిటైల్ చైన్ బిగ్‘సి’ సంస్థ విజయవంతగా 20వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా వేడుకలకు సిద్ధమైంది. ‘‘రిటైల్ కస్టమర్లకు అత్యుత్తమ సేవలను, అమ్మకాలను అందించే ఉద్దేశంతో 2002 విజయవాడలో తొలి స్టోర్‌ను స్థాపించాము. నాటి నుంచి ఉన్నతమైన ప్రమాణాలను పాటిస్తూ., గత 19 ఏళ్లలో 250కి పైగా స్టోర్లను నెలకొల్పి అద్భుతమైన అమ్మకాలతో ఐదు కోట్ల మంది కస్టమర్లకు సౌకర్యవంతమైన సేవలు అందించాము’’ అని కంపెనీ సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసిన 90 నిమిషాల్లోనే కస్టమర్లు కోరిన మొబైల్‌ను అందిస్తున్నామన్నారు. కంపెనీ 19 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొబైల్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌ట్యాబ్‌ల కొనుగోళ్ల పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించామని., కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
బిగ్ ‘సి’ దసరావళి తొలి డ్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ బిగ్ ‘సి’ దసరావళి తొలి లక్కీ డ్రా విజేతలను ప్రకటించింది. సంస్థ ఫౌండర్ ఎం.బాలు చౌదరి, డైరెక్టర్లు స్వప్న కుమార్, బాలాజీ రెడ్డి ఈ వివరాలను బుధవారం వెల్లడించారు. మొత్తం 20 మందిని లక్కీ డ్రాలో ఎంపిక చేశారు. వీరిలో 10 మందికి మారుతీ ఆల్టో 800 కార్లు, 10 మందికి బజాజ్ ప్లాటినా బైక్‌లను బహుమతిగా అందిస్తారు. అక్టోబరు 29 వరకు ఉండే ఈ ఆఫర్ కింద మొత్తం 30 మారుతి ఆల్టో కార్లు, 30 బజాజ్ ప్లాటినా బైక్‌లను కస్టమర్లు గెలుచుకోవచ్చు. అలాగే 10% హెచ్డీఎఫ్సీ క్యాష్ బ్యాక్, సులభ వాయిదాల్లో మొబైల్ కొన్నవారికి ఒక ఈఎంఐ ఉచితం, 30% పేటీఎం క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. ప్రతి మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉంది. -
కూకట్పల్లి బిగ్ సిలో సందడి చేసిన సమంత
-
కంపెనీల మధ్య పోటీతో.. కస్టమర్లకే ప్రయోజనం
♦ మొబైల్ కంపెనీల మధ్య పోటీ ♦ ఆషాఢం సేల్‌లో 51 శాతం దాకా డిస్కౌంట్ ♦ బిగ్ సి మొబైల్స్ సీఎండీ బాలు చౌదరి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మొబైల్స్ తయారీలో ఉన్న చైనా కంపెనీలు నేరుగా భారత్‌లో అడుగుపెడుతున్నాయి. దీంతో కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నువ్వా నేనా అన్నట్టు స్మార్ట్ ఫీచర్స్‌తో మొబైల్స్‌ను ప్రవేశ పెడుతున్నాయని బిగ్ సి మొబైల్స్ సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు. అది కూడా అందుబాటు ధరలో విక్రయించడంతో కస్టమర్లకే అధిక ప్రయోజనం చేకూరుతోందని శుక్రవారమిక్కడ మీడియాతో చెప్పారు. బ్రాండ్‌కు బదులు వినియోగదార్లు విలువ చూస్తున్నారని అన్నారు. రూ.3 వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టిన రిలయన్స్ జియో భారత టెలికం రంగంలో సంచలనం సృష్టించడం ఖాయమన్నారు. ఉచిత డేటాతో కస్టమర్లను ఈ కంపెనీ ఆకట్టుకుంటోందని వివరించారు. ముప్పు తొలగింది..: ఈ-కామర్స్ కంపెనీలు గతేడాది భారీ డిస్కౌంట్లతో ఉపకరణాలను విక్రయించడంతో రిటైలర్లు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడా కంపెనీలు డిస్కౌంట్లు ఇవ్వడం మానేశాయని బాలు చౌదరి తెలిపారు. ‘రిటైల్ వ్యాపారులు ఈ-కామర్స్ ముప్పు నుంచి బయటపడ్డారు. బిగ్-సి ప్రతినెలా 30-40% వృద్ధి నమోదు చేస్తోంది. 115 స్టోర్లతో 1.8 కోట్ల మంది వినియోగదార్లకు చేరువయ్యాం. వీరిలో 80% మంది రిపీటెడ్ కస్టమర్లు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ఒకరు బిగ్ సి వినియోగదారు. మొబైల్స్ సగటు విక్రయ ధర ఏడాదిలో రూ.4,400 నుంచి రూ.5 వేలకు వచ్చి చేరింది’ అని తెలిపారు. భారీ డిస్కౌంట్లతో.. ఆషాఢం సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై 51 శాతం దాకా డిస్కౌంట్‌ను బిగ్ సి ప్రకటించింది. ఏడేళ్లుగా ఈ ఆఫర్‌ను కొనసాగిస్తున్నామని, కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన ఉందని వివరించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి సేల్‌లో 50 శాతం ఎక్కువ మోడళ్లను జోడించారు. ఐఫోన్ 6 ప్లస్‌పై రూ.18 వేల డిస్కౌంట్, ఎల్జీ మాగ్నాపై 55 శాతం, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ సిల్వర్‌పై 53 శాతం, లైఫ్ విండ్-1పై 35 శాతం, శాంసంగ్ గెలాక్సీ నోట్-5పై 30 శాతం డిస్కౌంట్ ఉంది. ఎంపిక చేసిన మోడళ్లపై రెండు ఫీచర్ ఫోన్లు, వీఆర్ బాక్స్, హెడ్సెట్లలో ఒకదానిని రూ.51లకే అందుకోవచ్చు. జీరో డౌన్‌పేమెంట్ సౌకర్యమూ ఉంది.